New Car Launches in April 2026: కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో భారతీయ ఆటోమొబైల్ రంగం కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. మారుతి సుజుకి, మహీంద్రా, టొయోటా, మెర్సిడెస్-బెంజ్ వంటి అగ్రగామి సంస్థలు తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఎస్‌యూవీల నుండి ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఈ నెలలో ఐదు ముఖ్యమైన కార్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Continues below advertisement

వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ (VW Taigun Facelift)జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ టైగన్‌ను సరికొత్తగా అప్‌డేట్ చేస్తోంది. ఏప్రిల్ 9, 2026న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. కారు బయటి భాగంలో స్వల్ప మార్పులతో పాటు లోపల కొత్త ఫీచర్లను జత చేశారు. ఇందులో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ (115 hp), 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ (150 hp) ఇంజిన్ ఆప్షన్లు పాతవి కొనసాగుతాయి. పవర్‌ఫుల్ వెర్షన్‌లో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ లభించనుంది.

మెర్సిడెస్-బెంజ్ సీఎల్ఏ ఈవీ (Mercedes-Benz CLA EV)లగ్జరీ కార్ల ప్రియుల కోసం మెర్సిడెస్ తన ఎలక్ట్రిక్ అవతార్ సీఎల్ఏ (CLA) ధరలను ఏప్రిల్‌లో ప్రకటించనుంది. ఇందులో సీఎల్ఏ 250+, సీఎల్ఏ 350 అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. 85 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 792 కిలోమీటర్ల (WLTP) రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని పెర్ఫార్మెన్స్, లగ్జరీ ఫీచర్లు ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయనున్నాయి.

Continues below advertisement

 టొయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా (Toyota Ebella)టొయోటా నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎబెల్లా'. ఇది మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందింది. ఇందులో 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. పెద్ద బ్యాటరీ వెర్షన్ 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయంతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ దీని ప్రత్యేకత.

ఎంజీ మెజస్టర్ (MG Majestor)ఎంజీ గ్లోస్టర్ స్థానంలో వస్తున్న 'మెజస్టర్' ఇప్పుడు మరింత విలాసవంతంగా మారిందని తెలుస్తోంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ ప్రొఫైల్, అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లతో ఫిబ్రవరిలోనే ఇది సందడి చేసింది. దీని డెలివరీలు మే నెలలో ప్రారంభం కానున్నాయి. 216 hp పవర్ ఇచ్చే 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఈ కారుకు శక్తినిస్తాయి.

నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)నిస్సాన్ టెర్రానో స్థానాన్ని భర్తీ చేస్తూ 'టెక్టాన్' మార్కెట్లోకి రానుంది. ఇది కొత్త రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. దీని లుక్ నిస్సాన్ పెట్రోల్ (Patrol) కారును పోలి ఉండి చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. ప్రారంభంలో 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లతో వస్తున్న ఈ కారులో భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా కొత్త ఆర్థిక సంవత్సరంలో నయా మోడళ్లతో మార్కెట్లో జోష్ పెంచాలని కంపెనీలు గట్టి నిర్ణయంతో ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.