New Bolero vs Old Bolero Features Comparison: మహీంద్రా & మహీంద్రా, అత్యంత ప్రజాదరణ పొందిన SUVలు Bolero & Bolero Neo ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను ఇటీవల లాంచ్ చేసింది. కొత్త బొలెరో సిరీస్ ఇప్పుడు మరింత స్టైల్, కంఫర్ట్, & మోడ్రన్ ఫీచర్లను అందిస్తుంది. అందరికీ సుపరిచితమైన డిజైన్‌ను కొనసాగిస్తూనే, కంపెనీ ఈ కొత్త SUVలను మరింత ప్రీమియం & అధునికంగా కనిపించేలా చిన్నపాటి మార్పులు చేసింది. ఈసారి, మెకానికల్ అప్‌డేట్‌లపై దృష్టి పెట్టలేదు. బదులుగా, డ్రైవింగ్ క్వాలిటీ, లుక్స్ & ఇన్-క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.
కొత్త బొలెరో నియో ధరతెలుగు రాష్ట్రాల్లో, కొత్త బొలెరో నియో ధర ₹8.49 లక్షల నుంచి ₹9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, Bolero Classic ₹7.99 లక్షల నుంచి ₹9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుంది. ఈ రెండు SUVలు ఒకే రకమైన ఇంజిన్‌తో పని చేస్తాయి. అయితే, కొత్తగా, సున్నితమైన డ్రైవింగ్ క్వాలిటీ కోసం మహీంద్రాకు చెందిన Ride Flow Suspension Tuning ను కలిగి ఉన్నాయి. ఇది బొలెరోను పట్టణ & గ్రామీణ ప్రాంతాలలో నడపడం మరింత సులభంగా & సౌకర్యవంతంగా చేస్తుంది.
డిజైన్ ఎలా ఉంది?కొత్త బొలెరో నియో ఫేస్‌లిఫ్ట్‌లో హారిజాంటల్ క్రోమ్ స్లాట్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ ఉంది, ఇది SUV ప్రీమియం లుక్‌ని పెంచుతుంది. బొలెరో క్లాసిక్‌లో రగ్‌డ్ లుక్ ఇచ్చే & కాన్ఫిడెన్స్ పెంచే కొత్త క్రోమ్-హైలైటెడ్ గ్రిల్ బిగించారు. ఈ రెండు మోడళ్ల ఫ్రంట్ డిజైన్ కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ, బొలెరో సరళత & శక్తిమంతమైన ఉనికి వంటివి కీ ఫీచర్లుగా కొనసాగుతున్నాయి.
కొత్త రంగులు & వేరియంట్లుబొలెరో నియో ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు రెండు కొత్త రంగులలో వచ్చింది, అవి: జీన్స్ బ్లూ & కాంక్రీట్ గ్రే. నియో టాప్-ఎండ్ N11 వేరియంట్‌లో డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్ కూడా ఉంది, ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బొలెరో క్లాసిక్ అన్ని ట్రిమ్‌లలో అందుబాటులో ఉన్న కొత్త స్టెల్త్ కలర్ ఆప్షన్‌లోనూ లభిస్తుంది. దీంతో పాటు కొత్త B8 వేరియంట్ కూడా లాంచ్ అయింది.
క్యాబిన్ మహీంద్రా, కొత్త బొలెరో క్యాబిన్‌లో చాలా అప్‌డేట్స్ చేసింది. బొలెరో టాప్-ఆఫ్-ది-లైన్ N11 వేరియంట్ ఇప్పుడు కొత్త లూనార్ గ్రే ఇంటీరియర్ థీమ్‌లో ఉంటుంది. మునుపటి డార్క్ మోచా బ్రౌన్ కంటే తేలికగా & ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సీట్లు కుషనింగ్‌తో మెరుగుపరిచారు, ఇవి దూర ప్రయాణాలలో సౌకర్యవంతంగా ఉంటాయి. బొలెరో క్లాసిక్‌లో ఇప్పుడు కొత్త బాటిల్ హోల్డర్లు, మరిన్ని ప్యాడెడ్ సీట్లు & లెథరెట్ అప్హోల్స్టరీ (B8 వేరియంట్) కూడా ఉన్నాయి, దీని వలన ఇంటీరియర్ మరింత ప్రీమియంగా అనిపిస్తుంది.
ఫీచర్లు, ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌కొత్త బొలెరో & బొలెరో నియో ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లతో కనిపిస్తాయి. బొలెరో నియో N10 & N11 వేరియంట్లలో కొత్త 8.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్-వ్యూ కెమెరా & USB-C ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. బొలెరో టాప్-స్పెక్ B8 వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫాగ్ ల్యాంప్‌లు & USB-C పోర్ట్‌లు వంటి లక్షణాలు ఉన్నాయి.
మహీంద్రా ఈ రెండు SUVల ఇంజిన్‌లలో పెద్ద మార్పులు చేయలేదు. బొలెరో & బొలెరో నియో రెండూ వాటి పాత పవర్‌ట్రెయిన్‌లతో పని చేస్తాయి. అయితే, కొత్త రైడ్‌ఫ్లో సస్పెన్షన్ సిస్టమ్ కారణంగా కఠినమైన రోడ్లపై కూడా మృదువైన ప్రయాణాన్ని అందిస్తాయి.