Unusual Car Names India: మన దేశంలోకి కార్లు ఎన్నో వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ కొన్ని కార్ల పేర్లు మాత్రం వినగానే కాస్త కన్ఫ్యూజింగ్‌గా, కాస్త ఫన్‌గా, మరికొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడవుతున్న 13 అన్‌యూజువల్‌ కార్ల పేర్లు ఇవి. ఈ పేర్లు ఆయా కార్ల అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, వినగానే గుర్తుండిపోవడంలో మాత్రం టాప్‌లో ఉన్నాయి.

Continues below advertisement

1) Mahindra Thar Roxx

లాంచ్‌కు ముందు వరకు “Thar 5-door” అని అందరూ పిలిచారు. కానీ మహీంద్రా దీనికి Roxx అని పేరు పెట్టింది. “Rock లా సాలిడ్‌, Rockstar లా అట్రాక్టివ్‌” అనేదే బ్రాండ్‌ లాజిక్‌. ఈ పేరే హైలైట్‌.

Continues below advertisement

2) Mahindra BE 6

Born Electric సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ EVకి మొదట 6E అని పేరు పెట్టారు. కానీ అది ఒక ఎయిర్‌లైన్‌తో క్లాష్‌ కావడంతో BE 6గా మార్చేశారు. పేరు కాస్త స్ట్రేంజ్‌గా ఉన్నా EV మాత్రం శక్తిమంతమైనది.

3) Kia Carens

Car + Renaissance = Carens. ఇలా బ్రాండ్‌ చెప్పినప్పటికీ చాలామందికి ఇది పెద్దగా కనెక్ట్‌ కాలేదు. కానీ అమ్మకాల విషయంలో మాత్రం ఈ MPV మంచి నంబర్స్‌ సాధిస్తోంది.

4) Hyundai Venue

సిటీ రైడ్స్‌ కోసం పర్ఫెక్ట్‌. పేరు మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ సేల్‌ ఫిగర్స్‌ చూస్తే, ఈ పేరు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు.

5) Maruti Suzuki S-Presso

కాఫీ డ్రింక్‌లా పేరు పెట్టి, బ్రైట్‌ కలర్స్‌తో లాంచ్‌ చేశారు. మొదట్లో మంచి అటెన్షన్‌ తెచ్చుకుంది. కానీ ఇటీవల అమ్మకాలు అంత బాగాలేవు.

6) Tata Tiago

మొదట Zica అని పేరు ఫిక్స్‌ చేయగా, అదే సమయంలో Zika వైరస్‌ రావడంతో ఆ పేరుని ఆపేశారు. Tata, పిట్‌స్టాప్‌ వేసి Tiagoగా మార్చింది. Lionel Messi కుమారుడి పేరు నుంచి ఇన్స్‌పిరేషన్‌ తీసుకున్నారు.

7) Mahindra Scorpio N

కొంతమంది దీన్ని Scorpion అని కూడా పిలుస్తారు. కానీ ‘N’ అంటే New అన్నమాట. పేరు, LED సెటప్‌, రియర్ విండో డిజైన్‌ కలిపి Skorpion vibe ఇస్తాయి.

8) Tata Curvv

Coupe-SUV లుక్‌ని ఈ పేరుతో పర్ఫెక్ట్‌గా చూపించగలిగారు. పేరు, కారు రెండూ అదిరిపోయాయి.

9) Maruti Suzuki Dzire

సబ్‌-4 మీటర్‌ సెడాన్‌ సెగ్మెంట్‌లో బెస్ట్‌ సెల్లర్‌ ఇది. ఈ పేరు మాత్రం ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది.

10) Citroen Basalt

అగ్నిపర్వత రాయి “Basalt” నుంచి తీసుకున్న పేరు ఇది. ఇటీవల దానికి X కూడా జత చేశారు. Tata Curvv కి ప్రత్యర్థిగా వచ్చిన ఈ కూపే-SUV పేరు నిజంగా యునిక్‌.

11) Toyota Taisor

Maruti Suzuki Fronx ఆధారంగా వచ్చిన Toyota Taisor పేరు వినగానే ఒక ఎలక్ట్రిక్‌ డివైస్‌లా అనిపించొచ్చు. కానీ, ఇది అసలు Urban Cruiser ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త మెంబర్‌.

12) BYD Seal, Sealion 7

Ocean సిరీస్‌లో భాగంగా, సముద్ర జంతువుల పేర్లు తీసుకున్నారు. ఈ కారు బ్యాటరీ టెక్నాలజీ సాలిడ్‌గా ఉంది, పేర్లు వెరైటీగా ఉన్నాయి.

13) MG Hector

1930ల బ్రిటీష్‌ బైప్లేన్‌ నుంచి వచ్చిన పేరు. సినిమాల్లో వచ్చే Trojan-war హీరో నుంచి కూడా ఇన్స్‌పిరేషన్‌ ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.