Affordable ABS Scooters India 2026: తెలుగు రాష్ట్రాల్లో స్కూటర్‌ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజువారీ వాడకానికి, సరుకులు తెచ్చుకోవడానికి స్కూటర్లు చాలా అనుకూలంగా ఉండడమే దీనికి కారణం. అయితే,  ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ఊహించని రోడ్డు పరిస్థితుల్లో స్కూటర్‌ నడిపేటప్పుడు భద్రత అత్యంత ముఖ్యం. ఇలాంటి సమయంలో ABS (యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌) పెద్ద రక్షణగా మారుతుంది. ఒకప్పుడు ప్రీమియం బైక్‌లకే పరిమితమైన ABS, ఇప్పుడు స్కూటర్ల సెగ్మెంట్‌లోనూ కనిపిస్తోంది.

Continues below advertisement

కేంద్ర ప్రభుత్వం, భవిష్యత్తులో అన్ని టూ వీలర్లకు ABS తప్పనిసరి చేయొచ్చనే చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతానికి, ABS ఎక్కువగా హైఎండ్‌ స్కూటర్లకే పరిమితమైంది. అయినప్పటికీ, కొన్ని చవక మోడళ్లు ఈ ట్రెండ్‌ను మార్చుతున్నాయి. ఇప్పుడు, మన మార్కెట్‌లో ABS ఉన్న బడ్జెట్‌ ధర స్కూటర్లు ఏవో చూద్దాం.

6. Yamaha Aerox 155

Continues below advertisement

యమహా ఏరాక్స్‌ 155 ధర రూ.1.41 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).స్పోర్టీ డిజైన్‌తో ప్రత్యేకంగా కనిపించే ఈ స్కూటర్‌, R15 నుంచి తీసుకున్న శక్తిమంతమైన ఇంజిన్‌తో వస్తుంది. 155సీసీ ఇంజిన్‌ 14.75hp శక్తి ఇస్తుంది. సింగిల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది. ట్రాక్షన్‌ కంట్రోల్‌, కీ లెస్‌ ఇగ్నిషన్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

5. Hero Xoom 160

హీరో జూమ్‌ 160 ధర రూ.1.37 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయమైన ఈ స్కూటర్‌, మ్యాక్సీ స్కూటర్‌ సెగ్మెంట్‌లో హీరో వేసిన తొలి అడుగుగా మారింది. 156సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 14.6hp శక్తి ఇస్తుంది. సింగిల్‌ ఛానల్‌ ABSతో పాటు, హైవే వేగాల్లోనూ స్థిరమైన పనితీరు చూపిస్తుంది.

4. VLF Mobster 135

VLF మాబ్‌స్టర్‌ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).భారతదేశంలో డ్యూయల్‌ ఛానల్‌ ABS ఉన్న ఏకైక 125సీసీ స్కూటర్‌ ఇదే. ఇటాలియన్‌ డిజైన్‌, 125సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, 5 ఇంచ్‌ TFT డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

3. Aprilia SR 175

అప్రిలియా SR 175 ధర రూ.1.18 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) నుంచి ప్రారంభం.174.7సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్‌, సింగిల్‌ ఛానల్‌ ABS కలిగి ఉంది. స్పోర్టీ రైడింగ్‌ ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక.

2. TVS Ntorq 150

టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 150 ధర రూ.1.09 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).149.7సీసీ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తుంది. తక్కువ ధరలో ABS ఇవ్వడం దీని పెద్ద ప్లస్‌. TFT డిస్‌ప్లే ఉన్న హై వేరియంట్‌కు అదనంగా రూ.9,000 చెల్లించాలి.

1. Suzuki Access - అత్యంత చౌక ABS స్కూటర్‌

సుజుకి యాక్సెస్‌ ABS ధర రూ.92,328 (ఎక్స్‌-షోరూమ్‌ ధర) నుంచి మొదలవుతుంది.125సీసీ సెగ్మెంట్‌లో ప్రభుత్వ నిబంధన లేకపోయినా, స్వచ్ఛందంగా ABS అందిస్తున్న స్కూటర్‌ ఇది. టాప్‌ రెండు వేరియంట్లలో ABS లభిస్తుంది. తక్కువ ధర, మంచి మైలేజ్‌, నమ్మకమైన పనితీరుతో ఇది బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.

మీకు తక్కువ బడ్జెట్‌లో అదనపు భద్రత కావాలంటే, సుజుకి యాక్సెస్‌ ABS ప్రస్తుతం భారత మార్కెట్‌లో బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.