Affordable Rear Wheel Drive Cars India 2025: భారత్‌లో ఎక్కువ మంది కొనుగోలు చేసే కార్లు సాధారణంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెటప్‌తో వస్తాయి. కారు లోపలి స్థలం, తక్కువ ధర, తక్కువ నిర్వహణ కారణంగా వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. కానీ అసలైన డ్రైవింగ్ ఫన్ మాత్రం రియర్ వీల్ డ్రైవ్ (RWD) కార్లలోనే ఉంటుంది. పవర్ వెనుక చక్రాలకు వెళ్లడం వల్ల మలుపుల్లో వచ్చే పర్‌ఫెక్ట్ కంట్రోల్, థ్రోటిల్ రెస్పాన్స్, స్టీరింగ్ కమ్యూనికేషన్.. ఇవన్నీ RWD కార్ల ప్రత్యేకత.
డ్రైవింగ్ ప్రియులకు మాత్రమే కాదు, ఆఫ్‌రోడ్, హిల్స్, డస్ట్ రోడ్లపై కూడా RWD కార్లు అదిరిపోయే పట్టు ఇస్తాయి. అందుకే, ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరల్లో దొరికే టాప్-10 RWD కార్ల జాబితా మీ కోసం తయారు చేశాం.
10. Toyota Fortuner (₹33.64 లక్షలు నుంచి)
టఫ్ బిల్డ్, అడ్వెంచర్ ఇమేజ్, పెద్ద సైజు… టయోటా ఫార్చ్యూనర్‌కు ఏ లిస్ట్‌లోనైనా ఒక స్థానం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో, ఆటోమేటిక్/మాన్యువల్ ఆప్షన్లతో కూడా ఇది వస్తుంది. ఏళ్లు గడుస్తున్నా, క్యాలండర్లు మారుతున్నా దీని డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
9. Mahindra XEV 9e (₹21.90 లక్షలు నుంచి)
మహీంద్రా తీసుకొచ్చిన కొత్త ఈవీ, 79kWh పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో 656km వరకు MIDC రేంజ్ ఇస్తుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లు కూడా RWDలోనే వస్తాయి. 286hp మోటార్‌తో 0-100 km వేగాన్ని కేవలం 6.8 సెకన్లలో చేరుతుంది. ప్రస్తుతం పెద్ద డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
8. Isuzu D-Max (₹20.34 లక్షలు నుంచి)
హై-లాండర్, V-Cross గా లభించే ఈ పికప్ ట్రక్.. టఫ్‌నెస్‌కు సింబల్. నగరంలో కొంచెం పెద్దగా అనిపించినా, ఆఫ్‌రోడ్ లైఫ్‌స్టైల్ కోసం బెస్ట్ ఆప్షన్. RWD రూపంలో ఇది ఇండియాలో అందుబాటులో ఉన్న అతి కొన్ని పికప్ ట్రక్‌ల్లో ఒకటి.
7. Toyota Innova Crysta (₹18.65 లక్షలు నుంచి)
ఫ్లీట్, ఫ్యామిలీ సెగ్మెంట్ రెండింటిలోనూ ఇది బెస్ట్ సెల్లర్. స్పేస్, కంఫర్ట్, రిలయబిలిటీ క్రిస్టా USPలు. స్టీరింగ్ కొంచెం హెవీగా ఉన్నా, హై-కంఫర్ట్ RWD MPVలో ఇది టాప్ మోడల్.
6. Mahindra BE 6 (₹18.90 లక్షలు నుంచి)
XEV 9e లాగే 79kWh బ్యాటరీ, 286hp RWD మోటార్ ఉంది. తక్కువ బరువు ఉన్నందున పెర్ఫార్మెన్స్ ఇంకా షార్ప్‌గా ఉంటుంది. క్రెట్టా EV, కర్వ్ EV లాంటి రైవల్స్‌ను టార్గెట్ చేస్తుంది. ఇంటీరియర్ ఎర్గోనామిక్స్ మాత్రం ఇంకా మెరుగుపరచాల్సిందే.
5. Mahindra Scorpio range (₹12.98 లక్షలు నుంచి)
స్కార్పియో క్లాసిక్, స్కార్పియో N - ఈ రెండూ RWDలో వస్తాయి. క్లాసిక్ బిల్డ్ క్వాలిటీ, N లో పవర్‌ఫుల్ ఇంజిన్, 7 సీటర్ కంఫర్ట్ ఇవన్నీ బెస్ట్. స్కార్పియో Nలో AWD కూడా లభిస్తుంది.
4. Mahindra Thar range (₹9.99 లక్షలు నుంచి)
థార్ 3-డోర్, థార్ రాక్స్ 5-డోర్ రెండూ RWD/4x4లో వస్తాయి. 3-డోర్‌లో చిన్న 1.5-లీటర్ డీజిల్ కూడా అందుబాటులో ఉంది. థార్ రాక్స్ స్పేస్ ఎక్కువ, ప్రాక్టికల్. అయితే టాప్ వేరియంట్లు కొంచెం ఖరీదైనవే.
3. Mahindra Bolero range (₹7.99 లక్షలు నుంచి)
బోలెరో, బోలెరో నియో రెండూ RWDలోనే లభ్యమవుతాయి. 1.5 లీటర్ డీజిల్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రఫ్ అండ్ టఫ్ యూజ్‌కు అద్భుతమైన ఆప్షన్. బోలెరో ఫీచర్లు కొంచెం పాతగా అనిపించవచ్చు.
2. MG Comet (₹7.49 లక్షలు నుంచి)
సిటీకి పర్‌ఫెక్ట్ EV. చిన్నదైనా ఇంటీరియర్ సూపర్. రియర్ యాక్సిల్‌పై 42hp మోటార్ ఉండటం వల్ల టౌన్‌లో బాగుంటుంది, కానీ హైవేలో మాత్రం వేగం తక్కువగా అనిపిస్తుంది.
1. Maruti Eeco (₹5.20 లక్షలు నుంచి)
ఇండియాలో అత్యంత చవకైన RWD కారు ఇది. బేసిక్ మోడలే అయినా తక్కువ రన్నింగ్ కాస్ట్, పెద్ద లగేజ్ స్పేస్, టాక్సీ/ఫ్యామిలీ యూజ్‌కు పరిపూర్ణంగా సరిపోతుంది. 1.2 లీటర్ ఇంజిన్ లాంగిట్యూడినల్ సెటప్‌తో వచ్చింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.