Affordable 1000cc Bikes India: లీటర్‌-క్లాస్‌ ‍‌(1000cc) బైక్‌ కొనాలని చాలా మంది తెలుగు యువతకు ఉన్న కల. ఈ బండికి ఒక్కసారి థ్రాటిల్‌ ఇవ్వగానే వచ్చే పంచ్‌, హైవేపై ఆ స్టేబిలిటీ, లాంగ్‌ రైడ్స్‌లో ఇచ్చే కంఫర్ట్‌ - ఇవన్నీ బైక్‌ లవర్స్‌కి ఎప్పుడూ స్పెషల్‌. కానీ ఇలాంటి 1000cc లేదా అంతకంటే పై బైక్స్‌ చాలా ఖరీదుగా ఉండడంతో, ఇవి కలగానే మిగిలిపోతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. బ్రాండ్ల మధ్య కాంపిటీషన్‌ పెరగడంతో ధరలు కొంతవరకు డౌన్‌ అయ్యాయి. అందుకే 1000cc బైక్‌ కొనాలనుకునే వాళ్ల కోసం మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న అత్యంత చవకైన, బెస్ట్‌ 5 బైకుల లిస్ట్‌ ఇది.

Continues below advertisement


Kawasaki Ninja 1100SX - ధర: రూ. 14.42 లక్షలు


ఈ లిస్ట్‌లో ఏకైక ఫుల్‌-ఫెయిర్డ్‌ బైక్‌ ఇదే. 1,099cc శక్తిమంతమైన ఇంజిన్‌ 136hp పవర్‌, 113Nm టార్క్‌ ఇస్తుంది. క్రూజ్‌ కంట్రోల్‌, TFT డిస్‌ప్లే, ట్రాక్షన్‌ కంట్రోల్‌, బై డైరెక్షనల్‌ క్విక్‌ షిఫ్టర్‌ వంటి ఫీచర్లు ఉండటంతో యువ రైడర్లకు స్పోర్టీ అనుభవం పక్కా. టూరింగ్‌ కూడా సూపర్‌గా ఉంటుంది.


Kawasaki Versys 1100 - ధర: రూ. 13.89 లక్షలు


లాంగ్‌ రైడ్స్‌కి బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటే ఇదే. ఎత్తుగా ఉండే స్టాన్స్‌, అప్రైట్‌ సిట్టింగ్‌ పొజిషన్‌, పెద్ద విండ్‌షీల్డ్‌ వల్ల రోడ్‌ ట్రిప్స్‌లో కంఫర్ట్‌ లెవెల్‌ టాప్‌ క్లాస్‌గా ఉంటుంది. Ninja 1100SX లాగే దీనికీ అదే ఇంజిన్‌ ఉన్నా, TFT డిస్‌ప్లే, క్విక్‌ షిఫ్టర్‌ మిస్‌ అవుతాయి. కానీ ధర దాని కంటే రూ. 53,000 తక్కువ.


Honda CB1000 Hornet SP - ధర: రూ. 13.29 లక్షలు


ఇది ఈ లిస్ట్‌లో పవర్‌ కింగ్‌. 999cc ఇన్‌లైన్‌-ఫోర్‌ ఇంజిన్‌ 157hp పవర్‌ ఇస్తుంది. Honda క్వాలిటీతో వచ్చే ఈ బైక్‌ పవర్‌, స్టైల్‌, హ్యాండ్లింగ్‌.. ఇలా అన్నింటా యువ రైడర్లకు పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌. ఇంకా ఇది ఇండియాలో లభించే హై-స్పెక్‌ వేరియంట్‌.


Kawasaki Z1100 - ధర: రూ. 12.79 లక్షలు


ఈ లిస్ట్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బైక్‌ ఇదే. ధర పరంగా ఇండియాలో అందుబాటులో ఉన్న చవకైన ఇన్‌లైన్‌-ఫోర్‌ 1000cc బైక్‌. Sugomi స్టైలింగ్‌, Ninja 1100SX ప్లాట్‌ఫామ్‌, అదే 1,099cc ఇంజిన్‌, Showa అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌ వంటి వరల్డ్‌-క్లాస్‌ ఫీచర్లు దీనిని వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌గా నిలబెడతాయి. IMU ఆధారిత ఎలక్ట్రానిక్స్‌, TFT డిస్‌ప్లే కూడా ఉన్నాయి.


Triumph Bonneville T120 - ధర: రూ. 12.35 లక్షలు


క్లాసిక్‌ లుక్‌ ప్రేమికులకైతే ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సిన ఆప్షన్‌. 1,200cc ప్యారలల్‌-ట్విన్‌ ఇంజిన్‌ 80hp పవర్‌, 105Nm టార్క్‌ ఇస్తుంది. 270-డిగ్రీ క్రాంక్‌ వల్ల వచ్చే రాస్పీ ఎగ్జాస్ట్‌ నోట్‌ రైడర్లను ఫిదా చేస్తుంది. క్లాసిక్‌ బాడీ ఉన్నా మోడరన్‌ ఫీచర్లు మాత్రం ఫుల్‌. ట్రాక్షన్‌ కంట్రోల్‌, రైడ్‌-బై-వైర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి అన్నీ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఈ బైక్‌లో చూడవచ్చు.


భారత మార్కెట్‌లో ఇంకా చాలా బిగ్‌ బైక్స్‌ ఉన్నా, ఈ ఐదు బైక్స్‌ ధర & పనితీరు పరంగా యువ రైడర్లకు బెస్ట్‌ కాంబో ఇస్తాయి. హైవేపై స్టెబిలిటీ కావాలన్నా, సిటీ రైడింగ్‌లో పంచ్‌ కావాలన్నా... 1000cc క్లాస్‌లో ఇవే బెస్ట్‌ ఎంట్రీ ఆప్షన్స్‌.


ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.