MG Windsor EV Long Term Review: సాధారణంగా, ఏ వాహనం విషయంలోనైనా కంపెనీ చెప్పే లెక్కలకు, వాస్తవ ప్రపంచంలో అనుభవాలకు మధ్య కొంత తేడా ఉంటుంది. ఎలక్ట్రిక్‌ కార్‌ MG విండ్సర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ కారును కొని, 11000 కిలోమీటర్లు దానిలో తిరిగిన తర్వాత, ఒక యూజర్‌ ఇచ్చిన నిజ జీవిత అనుభవాల రిపోర్ట్ ఇది.

Continues below advertisement

"MG Windsor మా గ్యారేజ్‌లోకి అడుగుపెట్టినప్పుడు చాలా ఆసక్తి కలిగించింది. హ్యాచ్‌బ్యాక్‌ మాదిరిగా కనిపించినా, MPV తరహా స్పేస్‌ అందించే ఈ ఎలక్ట్రిక్‌ కార్‌తో మా ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది.

రెండు వారాల పాటు ఉపయోగించిన తర్వాత స్పష్టంగా అర్థమైన విషయం ఒక్కటే - మీరు ఎంత ఆధునిక కారులో కూర్చున్నారో MG Windsor ప్రతిసారీ గుర్తు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్లస్‌ పాయింట్‌గా మారితే, మరికొన్ని సందర్భాల్లో సహనాన్ని పరీక్షిస్తుంది.

Continues below advertisement

భారీ టచ్‌స్క్రీన్‌ - ఆకర్షణే కానీ అలవాటు కావాలి

కారులో కూర్చోగానే ఎదురయ్యేది 15.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్‌. ఇది చూడటానికి అద్భుతంగా ఉన్నా, దాదాపు అన్ని కీలక నియంత్రణలను ఇందులోనే పెట్టారు. ఎయిర్‌ కండిషనర్‌ తప్ప మిగతా అన్ని ఫంక్షన్లు స్క్రీన్‌ ద్వారానే ఆపరేట్‌ చేయాలి.

రియర్‌ వ్యూ మిర్రర్లను సర్దుకోవాలంటే కూడా మెనూల్లోకి వెళ్లాల్సి రావడం రోజువారీ డ్రైవింగ్‌లో కొంత ఇబ్బంది కలిగిస్తుంది. డ్రైవింగ్‌ సమయంలో చూపు రోడ్డుపై ఉండాలి కానీ, ఈ సెటప్‌ వల్ల అది కాస్త కష్టమే. స్టీరింగ్‌పై ఉన్న షార్ట్‌కట్‌ బటన్‌ కొంత ఉపశమనం ఇస్తుంది. అయినా, సాధారణంగా ఉండాల్సిన పనికి ఇంత కష్టపడాల్సి రావడం ఆశ్చర్యమే.

రాత్రి డ్రైవ్‌లో స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ సమస్య

ప్రతి సారి కారు స్టార్ట్‌ చేసినప్పుడు స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ మళ్లీ ఎక్కువగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి డ్రైవ్‌లలో ఇది కళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే, డ్రైవ్‌ మొదలుపెట్టే ముందు బ్రైట్‌నెస్‌ తగ్గించడం రోజువారీ అలవాటుగా మారింది.

360 డిగ్రీ కెమెరా - నిజంగా ఉపయోగపడుతుంది

టైట్‌ పార్కింగ్‌ స్థలాల్లో 360 డిగ్రీ కెమెరా చాలా సహాయపడుతుంది. స్క్రీన్‌ క్లారిటీ బాగుంది, సెన్సార్లు కూడా అలర్ట్‌గా పనిచేస్తాయి. అయితే, 20 కి.మీ./గం కంటే తక్కువ స్పీడ్‌లో ఇండికేటర్‌ వేయగానే కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్‌ కావడం కొంత డిస్ట్రాక్ట్‌ చేస్తుంది.

చిన్న చిన్న చిరాకులు

ఇండికేటర్‌ స్టాక్‌ చివర ఉన్న విండ్‌స్క్రీన్‌ వాషర్‌ బటన్‌ కారణంగా, చాలాసార్లు అనుకోకుండా వాషర్‌ ఆన్‌ అవుతుంది. ఇది చిన్న విషయం అయినా రోజూ ఎదురైతే చిరాకు కలిగిస్తుంది. అలాగే, Apple CarPlay కనెక్ట్‌ చేసిన ప్రతిసారీ ఆడియో వాల్యూమ్‌ ఒక్కసారిగా ఎక్కువగా రావడం కూడా ఆశ్చర్యపరుస్తుంది. వెంటనే తగ్గించుకోవాల్సి వస్తుంది. అయితే, CarPlay కనెక్టివిటీ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది.

స్పేస్‌, స్టోరేజ్‌ - Windsor బలమైన అంశం

ఈ కార్‌ను నిజంగా మెచ్చుకోవాల్సింది స్పేస్‌ విషయంలో. డ్యాష్‌బోర్డ్‌ దగ్గర ఉన్న కప్‌ హోల్డర్లు, ఫ్లోటింగ్‌ సెంటర్‌ కన్సోల్‌ రోజువారీ ఉపయోగంలో చాలా సౌకర్యంగా ఉన్నాయి. 604 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఈ సెగ్మెంట్‌లో పెద్ద ప్లస్‌. ఎయిర్‌పోర్ట్‌ ట్రిప్‌లు, వీకెండ్‌ ప్రయాణాల్లో లగేజీ స్పేస్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అయితే, స్టాండర్డ్‌గా స్పేర్‌ వీల్‌ ఇవ్వకపోవడం మాత్రం నిరాశ కలిగిస్తుంది.

డ్రైవింగ్‌ అనుభవం & రేంజ్‌

MG Windsor డ్రైవింగ్‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. పవర్‌ డెలివరీ ప్రశాంతంగా ఉండటంతో సిటీ డ్రైవింగ్‌ స్ట్రెస్‌ ఫ్రీగా సాగుతుంది. సిటీ వినియోగంలో సుమారు 230 కి.మీ. రేంజ్‌ లభించింది. మా కారులో ఉన్నది 37.9kWh బ్యాటరీ. ఎక్కువ రేంజ్‌ కావాలంటే 50.6kWh బ్యాటరీ ఉన్న Pro వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది.

మొత్తం మీద అనుభవం

MG Windsor‌తో జీవితం ఒక అడ్జస్ట్‌మెంట్‌ ప్రాసెస్‌లాంటిదే. సంప్రదాయానికి భిన్నంగా ఇది పనిచేస్తుంది. కానీ, విస్తారమైన స్పేస్‌, ఆధునిక ఫీచర్లు, ప్రశాంతమైన డ్రైవ్‌ అనుభవం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్‌ కార్‌గా నిలుస్తుంది. కొన్ని అలవాటు కావాల్సిన అంశాలు ఉన్నా, రోజువారీ వినియోగంలో ఇది మంచి అనుభవాన్నే ఇస్తుంది."

టెస్ట్‌ డేటాఓడోమీటర్‌: 11,290 కి.మీ.ధర: రూ.16.29 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర, ఇండియా)ఎఫిషియెన్సీ: 6.05 కి.మీ./kWhమెయింటెనెన్స్‌ ఖర్చు: లేదులోపాలు: లేవు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.