Continues below advertisement

MG Motors తమ పెద్ద SUV MG Majestor ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ కారును ఫిబ్రవరి ప్రారంభంలోనే తీసుకురానుంది. MG Majestor విడుదల చేస్తున్నంత మాత్రాన MG Gloster ను నిలిపివేయడం లేదు. వాస్తవానికి Majestor ను Gloster కంటే ఎక్కువ అని చెబుతున్నారు. కానీ MG Majestor ఒక పెద్ద 3 వరుసల SUV అవుతుంది. ఇది Gloster లో ఉన్న అదే డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది.  కానీ ఇది ట్విన్ టర్బో సెటప్‌తో వస్తుంది. దీంతో పాటు స్టాండర్డ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ SUV లో 4x4 వేరియంట్ కూడా ఇచ్చారు. 

కారు ఎలా ఉంది? 

Majestor ముందు భాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో వెడల్పాటి స్టాన్స్, పెద్ద నల్లటి గ్రిల్, సన్నని హెడ్‌లైట్‌లు ఉన్నాయి. Gloster తో పోలిస్తే దీని ముందు డిజైన్ భిన్నంగా ఉంటుంది. వెనుక వైపున కనెక్ట్ చేసిన టైల్‌లైట్‌లు ఉన్నాయి. బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి.

Continues below advertisement

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 12.3-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఉంటుంది. SUV లో లెదర్ సీట్లు ఉంటాయి. హీటెడ్, కూల్డ్,  మసాజ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్‌లు ఇచ్చారు. Majestor లో మూడు వరుసల సీటింగ్ అట్రాక్టివ్‌గా ఉంది. ఇది వెనుక కూర్చున్న వారికి కూడా మంచి స్పేస్ అందిస్తుంది.

కారు ఎప్పుడు విడుదల అవుతుంది? 

MG Majestor సాధారణ MG షోరూమ్‌ల ద్వారా విక్రయించనున్నారు. ఇది MG ఫ్లాగ్‌షిప్ SUV అవుతుంది. MG Gloster తో పాటు విక్రయించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన పోటీ Toyota Fortuner తో ఉండనుంది. ఎంజీ Majestor పరిమాణంలో Fortuner కంటే పెద్దది. దీని ధర గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. 

SUV ఫిబ్రవరిలో విడుదల కావచ్చు. ఈ సంవత్సరం JSW MG మొదటి విడుదల అవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మోడల్‌లు వస్తాయని ఎంజీ కస్టమర్లు భావిస్తున్నారు. ఫుల్-సైజ్ SUV విభాగంలో ప్రస్తుతం ఎక్కువ ఆప్షన్లు లేవు. ప్రస్తుతం ఈ విభాగంలో Toyota Fortuner ఆధిపత్యం చెలాయిస్తోంది. తాజాగా ఎంజీ Majestor రాకతో ఈ విభాగంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

Also Read: Tata Sierra Delivery Date: సంక్రాంతికి మీ ఇంటికి కొత్త కారు- Tata Sierra డెలివరీ అప్పుడే.. అన్ని వేరియంట్ల ధరలు చూశారా