భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. కాలుష్య రహిత ప్రయాణం, తక్కువ నిర్వహణ ఖర్చు వల్ల కస్టమర్లు ఈవీలను కొంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎమ్‌జీ మోటార్స్ (MG Motors) సంస్థ సరికొత్త హెక్టార్ టోమాహాక్ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన ADAPT ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైన ఈ భారీ ఎస్‌యూవీ Hector Tomahawk EV ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఆల్-ఎలక్ట్రిక్ అనే 2 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లోకి రానున్న మహీంద్రా XEV 9s, టాటా ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

Continues below advertisement

ఈ ఎలక్ట్రిక్ కార్ ఇంటీరియర్ అత్యంత విలాసవంతమైన ట్యాన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో చేశారు. డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన 15.6 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది గెస్టర్ కంట్రోల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, 10 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. 5 సీటర్, 7 సీటర్ లలో లభించే ఈ కారులో వెనుక వరుస ప్రయాణీకులకు విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్,  ఫ్లాట్ ఫ్లోర్ సదుపాయం కల్పించారు.

హైదరాబాద్‌లో MG హెక్టర్ టోమాహాక్ EV బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 20.83 లక్షలుగా ఉంది. అయితే మీరు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి ఈవీ కారు తీసుకుంటే మీరు మిగతా 18.83 లక్షలు లోన్, ఫైనాన్స్ చేసుకోవాలి. 4 ఏళ్లకుగానూ 9.5 శాతం వడ్డీతో అయితే 48 నెలలకుగానూ EMi రూ. 47 వేలు కట్టాలి. అదే 5 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే 60 నెలలపాటు ఈఎంఐ రూ. 39,550 చెల్లించాలి. 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే 72 నెలలపాటు ఈఎంఐ రూ. 34,416 మేర చెల్లించాలి. అదే 7 ఏళ్లకు అయితే 84 నెలలపాటు రూ. 30,780 కట్టాలి.

Continues below advertisement

Also Read: క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌

517 కిలోమీటర్ల రేంజ్..

సామర్థ్యం విషయానికి వస్తే, ఈ కారులో 69.2 kWh కెపాసిటీ గల  బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 204 bhp శక్తిని, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల  మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సాధారణ రోడ్లపై సులభంగా 400 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. కారు విండోలకు ఉపయోగించిన ఎకౌస్టిక్ గ్లాస్ క్యాబిన్ లోపలికి బయటి శబ్దం రాకుండా నిరోధిస్తుంది. సిటీ డ్రైవింగ్ కోసం ఈకో మోడ్, ఈజీ స్టీరింగ్ కంట్రోల్ ప్రయాణాన్ని తేలిక చేస్తాయి. 

భద్రత, ఛార్జింగ్ సాంకేతికత పరంగా ఇందులో భారత రోడ్లకు అనుగుణంగా పనిచేసే 'లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందించారు. V2L (వెహికల్ టూ లోడ్), V2V (వెహికల్ టూ వెహికల్) బైడైరెక్షనల్ ఛార్జింగ్ విధానాల ద్వారా ఈ కారు బ్యాటరీ నుండి ఇతర పరికరాలకు, వేరొక ఈవి వాహనానికి ఛార్జింగ్ చేయొచ్చు. 90kW DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే 30% నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో MG హెక్టర్ టోమాహాక్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.49 లక్షల నుంచి రూ. 23.49 లక్షల వరకు ఉంటుంది.  దీంతోపాటు కంపెనీ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానంలోనూ దీనిని విక్రయిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద కారు ప్రారంభ ధర రూ. 13.99 లక్షలకే లభిస్తుంది. బ్యాటరీ వినియోగానికి వాడిన కిలోమీటర్లను బట్టి ప్రత్యేకంగా అద్దె చెల్లించాలి. విశాలమైన కేబిన్ స్పేస్, మెరుగైన రోడ్ ప్రెజెన్స్, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఎస్‌యూవీ బెస్ట్ ఛాయిస్ కానుంది. 

Also Read: పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌