MG మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగంలో మరో కారు అందుబాటులోకి వచ్చింది. MG కామెట్ EV పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.  ఇప్పటికే  MG మోటార్ ఇండియా భారత్ లో ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. MG ZS EV పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా రెండో మోడల్ కారును వినియోగదారుల ముందుకు తెచ్చింది.


MG కామెట్ EV ధరలు


రీసెంట్ గా భారత్ లో ఈ కారు లాంచ్ కాగా, తాజాగా కంపెనీ ధరలను వెల్లడించింది. మూడు వేరియెంట్లలో అందుబాటులోకి రానున్న ఈ కార్ల ధరలను విడుదల చేసింది. టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ. 10 లక్షల కంటే తక్కువే ఉండటం విశేషం.  కామెట్ ఎంట్రీ పాయింట్ రూ. 7.98 లక్షలు కాగా,  మూడు వేరియంట్‌లు ఆఫర్‌లో ఉన్నాయి. వేరియంట్‌లను పేస్, ప్లే,  ప్లష్ అని పిలుస్తారు. టాప్-ఎండ్ వేరియంట్‌ను ప్లష్ అని పిలుస్తారు మరియు దీని ధర రూ. 9.98 లక్షలు కాగా, మిడ్-ప్లే వేరియంట్ రూ. 9.28 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.






MG కామెట్ EV రేంజ్


ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు SAIC-GM-వులింగ్ గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.  ఇటీవల లీక్ నివేదికల ప్రకారం, MG కామెట్ EV  ఒక్క ఫుల్ ఛార్జింగ్‌తో 230 కిలో మీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 7 గంటల వ్యవధిలో 0-100% ఛార్జింగ్ అవుతుంది. 3.3kW ఛార్జర్‌ని ఉపయోగించి 10-80% ఛార్జింగ్ ను కేవలం 5 గంటల్లో నింపే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం (EV) 42PS/110Nm ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది.


MG కామెట్ EV కొలతలు


MG కామెట్ EV  కాంపాక్ట్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. రెండు-డోర్ల లే అవుట్, నలుగురు  ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. మూడు-డోర్ల కామెట్ EV పొడవు 2,974mm, ఎత్తు 1,631mm, వెడల్పు 1,505mm ఉంటుంది. ఇది 2,010mm వీల్ బేస్ కలిగి ఉంటుంది.


MG కామెట్ EV ఫీచర్లు


ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కామెట్ EV LED హెడ్‌ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దాదాపు ఫ్లాట్ వెనుక భాగంలో LED టెయిల్‌ ల్యాంప్‌ లు ఉంటాయి. క్యాబిన్ లోపల, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.


MG కామెట్ EV  ఏ కార్లకు పోటీగా ఉంటుందంటే?


సరికొత్త MG కామెట్ EV  కారు  భారత మార్కెట్‌లో టాటా టియాగో EV, టిగోర్ EV, అలాగే సిట్రోయెన్ eC3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది.  


Read Also: డీజిల్‌ వాహనాలపై నిషేధం? కేంద్రం ముందుకు కీలక ప్రతిపాదన!