MG Comet EV, India’s Most Affordable Electric Car with BaaS Scheme and EMI Options Explained: ప్రస్తుతం ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రేసులో ఎంజీ మోటార్స్ (MG Motors) తన సరికొత్త కామెట్ ఈవీ (Comet EV) తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందిన ఈ చిన్న కారు, తన విభిన్నమైన డిజైన్ తో పాటు ఆకర్షణీయమైన ధరతో కస్టమర్లను మెప్పిస్తోంది. రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్ లో సులభంగా నడపడానికి, ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే రెగ్యులర్ సిటీ కమ్యూటర్లకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Continues below advertisement

ధరను తగ్గించే బాస్ (BaaS) వ్యూహం..  ఎంజీ కామెట్ ఈవీ అమ్మకాల్లో కంపెనీ ఒక వినూత్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది. కస్టమర్లు ఈ కారును నేరుగా కొనుగోలు చేయడమే కాకుండా, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (Battery-as-a-Service) స్కీమ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ పద్ధతిలో కారును కొనేటప్పుడు బ్యాటరీ ఖర్చు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం నెలకు కొంత మొత్తాన్ని బ్యాటరీ రెంటల్ లాగా చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు కొనేటప్పుడు పెట్టే పెట్టుబడి (Upfront cost) గణనీయంగా తగ్గుతుంది. మార్కెట్లో దీనికి పోటీగా టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లు ఉన్నా, ఎంజీ కామెట్ తన తక్కువ ధరతో దూసుకుపోతోంది.

నెలవారీ ఈఎంఐ (EMI) ఎంత ఉండొచ్చు?మీరు ఎంజీ కామెట్ ఈవీని లోన్ పై తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, నెలకు ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఎంజీ కామెట్ ఈవీ ధరలు రూ. 7,62,800 నుండి రూ. 9,99,800 (ఎక్స్‌షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇక్కడ మనం టాప్ ఎండ్ వేరియంట్ అయిన 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' (ధర రూ. 9,99,800) ను ఉదాహరణగా తీసుకుందాం. వడ్డీ రేటు 9.5% గా పరిగణనలోకి తీసుకుంటే, వివిధ కాలపరిమితులకు ఈఎంఐ లెక్కలు ఇలా ఉన్నాయి:

Continues below advertisement

12 నెలల కాలానికి: నెలకు సుమారు రూ. 87,666 ఈఎంఐ కట్టాలి. దీనిపై మొత్తం వడ్డీ రూ. 52,192 అవుతుంది.

24 నెలల కాలానికి: నెలకు సుమారు రూ. 45,905 ఈఎంఐ పడుతుంది. మొత్తం వడ్డీ రూ. 1,01,927 అవుతుంది.

36 నెలల కాలానికి: నెలకు దాదాపు రూ. 32,027 చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ భారం రూ. 1,53,156 గా ఉంటుంది.

48 నెలల కాలానికి: నెలకు రూ. 25,118 ఈఎంఐ పడుతుంది. ఇక్కడ వడ్డీ రూ. 2,05,869 అవుతుంది.

60 నెలల కాలానికి: నెలకు కేవలం రూ. 20,998 ఈఎంఐతో కారును మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం వడ్డీ రూ. 2,60,060 వరకు పెరుగుతుంది.

మీరు ఎంచుకునే డౌన్ పేమెంట్, లోన్ మొత్తం, బ్యాంకు అందించే వడ్డీ రేటును బట్టి ఈ ఈఎంఐలు మారుతుంటాయి. తక్కువ ఈఎంఐ కావాలనుకునే వారు ఐదేళ్ల (60 నెలల) ప్లాన్ ఎంచుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం వాయిదాలు చెల్లిస్తే వడ్డీ భారం కూడా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. సిటీ డ్రైవింగ్ కోసం స్టైలిష్ గా, టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఎంజీ కామెట్ ఈవీ ఒక అద్భుతమైన ఆప్షన్. పెట్రోల్ ఖర్చుల నుండి ఉపశమనం పొందుతూ పర్యావరణానికి మేలు చేసే ప్రయాణం చేయడానికి ఇది సరైన సమయంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.