భారత మార్కెట్లో మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ (Kia Seltos) వంటి కార్లకు పోటీగా వచ్చింది MG Astor. కానీ ఈ కారు ఇప్పుడు భారత మార్కెట్ కనుమరుగవుతోంది. అక్టోబర్ 2026 నివేదికల ప్రకారం, డీలర్ వర్గాల సమాచారం మేరకు JSW MG మోటార్ ఇండియా ఆస్టర్ అమ్మకాలు నిలిపివేసింది. ఈ SUV 2021లో మన దేశంలో లాంచ్ అయింది. ప్రీమియం కేబిన్, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో కస్టమర్లకు ఆకర్షించింది.
ఈ ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఇది వినియోగదారుల్లో బలమైన ముద్రను వేయలేకపోయింది. దాంతో సెప్టెంబర్ 2025 నుండి సెప్టెంబర్ 2026 మధ్య దీని సగటు నెలవారీ విక్రయాలు కేవలం 112 యూనిట్లు మాత్రమే. ఇంత తక్కువగా అమ్మకాలు జరుగుతుందడటంతో అమ్మకాలు నిలిపివేస్తున్నారు.
తక్కువ అమ్మకాలే అతిపెద్ద సమస్య
MG ఆస్టర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే సమయంలో దీని ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ పేర్కొంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), పనోరమిక్ సన్‌రూఫ్, వంటి ఫీచర్లు ఇచ్చారు. కానీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఇతర పోటీదారుల మధ్య దీని అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు దాదాపు ఏడాదిపాటు ఎంజీ ఆస్టర్ సగటు నెలవారీ విక్రయాలు 112 యూనిట్లుగా ఉన్నాయి. ఇంత తక్కువ అమ్మకాలతో మార్కెట్లో ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. అయినప్పటికీ, కంపెనీ దీని విక్రయాల నిలిపివేతకు కారణాలు చెబుతూ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తక్కువ అమ్మకాలే అందుకు కారణంగా భావించవచ్చు.
Also Read: ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఇంజిన్ ఆప్షన్లలోనూ వెనుకబడిన ఆస్టర్
MG ఆస్టర్ మరో పెద్ద బలహీనత దీని పరిమిత ఇంజిన్ ఆప్షన్లు. ప్రారంభంలో ఈ SUV 2 పెట్రోల్ ఇంజిన్లతో వచ్చింది. ఇందులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 110 hp పవర్ ఇవ్వగా, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 hp పవర్ ఇచ్చేది. ఫిబ్రవరి 2025లో కంపెనీ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను నిలిపివేయడం మరింత డ్యామేజీ చేసింది. ఆ తర్వాత ఆస్టర్‌లో కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారు. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చేది.
ఈ సెగ్మెంట్లోని ఇతర SUVలు పెట్రోల్‌తో పాటు డీజిల్, CNG, హైబ్రిడ్ వంటి ఆప్షన్లు అందిస్తున్నాయి. ఆస్టర్ క్రాసోవర్ వంటి డిజైన్ కూడా కొందరు వినియోగదారులకు తమ పోటీదారుల కంటే చిన్నదిగా అనిపిస్తుంది. ఈ విషయాలు మార్కెట్లో దాని స్థానాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.
కొత్త SUVని తీసుకురానున్న కంపెనీ
MG ఆస్టర్ విక్రయాలు నిలిచిపోవడం అంటే మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ నుంచి బయటకు వెళ్లడం లేదు. నివేదికల ప్రకారం, MG దీనికి ప్రత్యామ్నాయంగా మరొక మోడల్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త SUVని 2027లో లాంచ్ చేయవచ్చు. ఈ కొత్త మోడల్ కంపెనీకి చెందిన SIGMA అంటే SAIC ఇంటెలిజెంట్ గ్లోబల్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లకు సపోర్ట్ చేయడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత. దీని ద్వారా కొత్త మోడల్లో ఎక్కువ పవర్ట్రైన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో MG కంపెనీ కొత్త మిడ్ సైజ్ SUVకి సంబంధించి చర్చ జరుగుతోంది.
Also Read: MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
