Mercedes AMG G63 Collector Edition Launched: భారతదేశంలో లగ్జరీ ఇళ్ల లాగే లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు కస్టమ్ మేడ్ సూపర్ లగ్జరీ వాహనాల పట్ల చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మెర్సిడెస్-AMG G63 కలెక్టర్ ఎడిషన్ ఈ ట్రెండ్‌కు తాజా ఉదాహరణ, దీనిని ప్రత్యేకంగా భారతీయ కస్టమర్ల కోసం ఈ కంపెనీ రూపొందించింది.

మెర్సిడెస్ G63 కలెక్టర్ ఎడిషన్ అంటే ఏమిటి?భారతదేశం కోసం మాత్రమే తయారు చేసిన ప్రత్యేక ఎడిషన్ 'మెర్సిడెస్ G63 కలెక్టర్ ఎడిషన్'. దీనిలో కేవలం 30 యూనిట్లు (కార్లు) మాత్రమే ఉత్పత్తి చేశారు & టాప్-ఎండ్ మెర్సిడెస్ కస్టమర్లకు అందించారు. భారతదేశంలో అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్‌పై పెరుగుతున్న పాపులారిటీ & కస్టమైజేషన్‌ ట్రెండ్‌ను ఈ ఎడిషన్‌కు ఉన్న డిమాండ్‌ చూపిస్తుంది.

ప్రత్యేకమైన పెయింట్ & డిజైన్ ఎంపికలుమెర్సిడెస్-AMG G63 కలెక్టర్ ఎడిషన్ ప్రత్యేకంగా భారత రుతుపవనాల సీజన్ కోసం రూపొందించారు & రెండు ప్రత్యేకమైన పెయింట్ కలర్స్‌లో లాంచ్‌ చేశారు, అవి - Mid Green Magno & Red Magno. దీనితో పాటు, ఈ కలెక్టర్ ఎడిషన్ 22-అంగుళాల గోల్డె ఫిన్‌ష్‌ అల్లాయ్ వీల్స్‌తో వచ్చింది, ఇది ఈ SUV లుక్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.

క్యాబిన్‌లో మీ పేరు రాసుకోవచ్చుఈ SUV క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌తో డిజైన్‌ చేశారు, ఇందులో ఓపెన్-పోర్ నేచురల్ వాల్నట్ ఉడ్ డాష్‌బోర్డ్ ట్రిమ్‌తో పాటు తయారు చేసిన కాటలానా బీజ్ & బ్లాక్ నప్పా లెదర్ సీట్‌ అప్‌హోల్‌స్టెరీ ఇచ్చారు. ఈ కలెక్టర్ ఎడిషన్‌లో హైలైట్‌ ఏంటంటే.. కారు యజమాని గ్రాబ్ హ్యాండిల్‌పై పేరును చెక్కించుకునే సౌకర్యం కూడా ఉంది, ఇది కారుకు పర్సనల్‌ టచ్‌ ఇస్తుంది.

ఇంటీరియర్‌లోనూ రాయల్‌ టచ్దీని ఇంటీరియర్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ప్రత్యేకమైన కస్టమ్ టచ్‌లు క్యాబిన్‌లో కనిపిస్తాయి. కాంట్రాస్ట్ స్టిచింగ్ & ప్రీమియం ఫినిషింగ్‌తో ప్రత్యేక AMG స్పోర్ట్ సీట్లు ఉన్నాయి. కస్టమర్ తన ఇష్టప్రకారం ఇంటీరియర్‌ను డిజైన్‌ చేయించుకునే ఆప్షన్‌ కూడా ఉంది. దీని కారణంగా ఈ కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు & లోపల కూర్చున్నప్పుడు రాయల్‌ ఫీలింగ్‌ కలుగుతుంది.

పనితీరు ఎలా ఉంది?G63 కలెక్టర్ ఎడిషన్‌లో ఎటువంటి మెకానికల్‌ మార్పులు చేయలేదు. అదే శక్తిమంతమైన 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో లాంచ్‌ చేశారు, ఇది 577 bhp పవర్‌ను & 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ./గం. వేగాన్ని అందుకోగలదు. ఇంజిన్‌లో కొత్త అప్‌డేట్ లేనప్పటికీ ఈ SUV స్టైల్‌ & ఎక్స్‌క్లూజివ్‌ అప్పీల్‌ ఈ బండిని చాలా ప్రత్యేకంగా చూపిస్తాయి.

ధరఈ కలెక్టర్ ఎడిషన్ ధర దాదాపు రూ. 4.30 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న మెర్సిడెస్ టాప్-ఎండ్ కస్టమర్లకు మాత్రమే ఈ ఎడిషన్‌ను పరిమితం చేశారు.