ప్రీమియం స్పోర్ట్స్ బైక్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి నింజా ZX-6R ఇప్పుడు భారీ డిస్కౌంట్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మిడిల్‌వెయిట్ సూపర్‌స్పోర్ట్ విభాగంలో టాప్ గా ఉన్న ఈ బైక్‌పై ముంబైలో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఆఫర్ ద్వారా కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి భారీ మొత్తంలో నగదు ఆదా అయ్యే అవకాశం లభిస్తోంది. ఈక్ర‌మంలో మీరు బైక్ కొనాల‌నుకొంటే ముంబైలో కొంటే భారీ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. సో.. పారాహుషార్.. ఛ‌లో ముంబై అని, కవాస‌కి బైక్ ని తెచ్చుకోండి.

Continues below advertisement

ధర, ఆఫర్ వివరాలుసాధారణంగా ముంబైలో కవాసకి నింజా ZX-6R ఆన్-రోడ్ ధర సుమారు రూ. 15.43 లక్షలుగా ఉంటుంది. అయితే ప్రస్తుత డీలర్ లెవల్ ఆఫర్ల కారణంగా దీని ఎఫెక్టివ్ ఆన్-రోడ్ ధర రూ. 12.69 లక్షలకు తగ్గింది. అంటే కొనుగోలుదారులు ఏకంగా రూ. 3.72 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ తగ్గిన ధరలో కేవలం బైక్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా, అదనపు యాక్సెసరీస్ ప్యాకేజీ కూడా కలిసి ఉండటం విశేషం. దీంతో ఈ బైక్ ను పొందాల‌నుకునే వారు ముంబైలో తీసుకుంటే చాలా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని తెలుస్తోంది. 

ఉచిత యాక్సెసరీస్ ప్యాకేజీఈ డీల్‌లో భాగంగా దాదాపు రూ. 98,000 విలువ చేసే యాక్సెసరీస్ ప్యాకేజీని కేవలం రూ. 69,000 కే అందిస్తున్నారు, ఇది పైన పేర్కొన్న రూ. 12.69 లక్షల ధరలోనే కలిసి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బైక్ కింద పడినప్పుడు ఫ్రేమ్ , ఇంజిన్‌కు నష్టం కలగకుండా కాపాడే ఆర్‌అండ్‌జీ (R&G) ఫ్రేమ్ స్లైడర్లు, రేడియేటర్ దెబ్బతినకుండా రక్షణ ఇచ్చే రేడియేటర్ గ్రిల్ లభిస్తాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా హై-స్పీడ్ ప్రయాణాల్లో బైక్ స్టేబుల్ గా ఉండటానికి సహాయపడే ప్రసిద్ధ 'ఓలిన్స్ (Ohlins) స్టీరింగ్ డాంపర్'ను కూడా ఈ ఆఫర్‌లో భాగంగా ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ల‌గ్జ‌రీ బైక్ ల‌వ‌ర్స్ కు ఇది పండగేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Continues below advertisement

ఇంజిన్ , పనితీరునింజా ZX-6R బైక్ 636సీసీ, ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 129 హెచ్‌పి శక్తిని , 69 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌లో కవాసకి క్విక్‌షిఫ్టర్ సౌకర్యం ఉంది, దీనివల్ల క్లచ్ వాడకుండానే వేగంగా గేర్లు మార్చుకోవచ్చు. సెక్యూరిటీ ప‌రంగా, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, వేర్వేరు పవర్ మోడ్స్ ,పూర్తిస్థాయి టీఎఫ్‌టీ (TFT) డిస్ప్లేను అమర్చారు. ఈ డిస్ప్లేను స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా మొబైల్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. తక్కువ ధరలో ప్రీమియం సూపర్ బైక్ అనుభూతిని కోరుకునే వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు. సో మరి లేటేందుకు, ఈ బైక్ కొనాలనుకునేవాళ్లు ముంబైలో తీసుకుంటే లాభ‌సాటిగా ఉంటుందని చెప్ప‌వ‌చ్చు.