Variant-wise Maruti WagonR new prices 2025: మారుతి సుజుకి, తన పాపులర్‌ ఫ్యామిలీ కార్‌ వాగన్ ఆర్ మీద పెద్ద ఆఫర్‌ ప్రకటించింది. జీఎస్టీ సంస్కరణల తర్వాత (GST 2.0), ఈ కంపెనీ, వాగన్ ఆర్‌ లోని అన్ని వేరియంట్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు మారుతి వాగన్ ఆర్‌ మీద రూ.64,000 సేవ్‌ చేసుకోవచ్చు. 

Continues below advertisement

వాగన్‌ ఆర్‌ లుక్స్‌మారుతి WagonR రీసెంట్‌ మోడల్‌ సింపుల్‌గా ఉండి కూడా స్టైలిష్‌గా కనిపించే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. హై బాడీ స్టాన్స్‌ వల్ల రోడ్డుపై ప్రెజెన్స్‌ బలంగా కనిపిస్తుంది. కొత్త గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ ఫ్రంట్‌ లుక్‌ను మరింత మోడ్రన్‌గా మార్చాయి. వెనుక భాగంలో స్లీక్‌ టెయిల్‌ల్యాంప్స్‌ & స్ట్రాంగ్‌ లైన్స్‌ ఈ హ్యాచ్‌బ్యాక్‌ డిజైన్‌ను ప్రాక్టికల్‌గా, యువతరానికి సరిపడేలా తీర్చిదిద్దాయి.

18% GST ప్రకారం WagonR ఏ వేరియంట్ పై ఎంత డబ్బు ఆదా అవుతుంది? 

Continues below advertisement

Tour H3 1L ISS MT ------ రూ. 50,000 తగ్గింపు

Wagon R LXI 1L ISS MT ------ రూ. 50,000 తగ్గింపు

Wagon R VXI 1L ISS MT ------ రూ. 54,000 తగ్గింపు

Wagon R VXI 1L ISS AT ------ రూ. 58,000 తగ్గింపు

Tour H3 CNG 1L MT ------ రూ. 57,000 తగ్గింపు

Wagon R LXI CNG 1L MT ------ రూ. 58,000 తగ్గింపు

Wagon R VXI CNG 1L MT ------ రూ. 60,000 తగ్గింపు

Wagon R ZXI 1.2L ISS MT ------ రూ. 56,000 తగ్గింపు

Wagon R ZXI+ 1.2L ISS MT ------ రూ. 60,000 తగ్గింపు

Wagon R ZXI 1.2L ISS AT ------ రూ. 60,000 తగ్గింపు

Wagon R ZXI+ 1.2L ISS AT ------ రూ. 64,000 తగ్గింపు

ఆల్టో ధర ఇంత తగ్గుతుందిజీఎస్టీ తగ్గింపు వల్ల వ్యాగన్ ఆర్ ధర గణనీయంగా తగ్గుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ స్వయంగా చెప్పారు. కొత్త రేటు ప్రకారం, చిన్న కారు అయిన Maruti Alto ధర కూడా రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. దీని అర్థం, సాధారణ ప్రజలు ఇప్పుడు అవే పాపులర్‌ కార్లను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయగలరు. ఇది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, కంపెనీల అమ్మకాలు కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

చిన్న & పెద్ద వాహనాలపై కొత్త జీఎస్టీజీఎస్టీ కౌన్సిల్, చిన్న కార్లపై పన్నును 18% కు తగ్గించింది. 1200cc వరకు ఇంజిన్‌ & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లు చిన్న కార్ల విభాగంలోకి వస్తాయి. 1200 cc కంటే ఎక్కువ ఇంజిన్‌ & 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న కార్లపై ఇప్పుడు 40% GST విధించారు. గతంలో, జీఎస్టీతో పాటు ఈ వాహనాలపై 22% సెస్ కూడా విధించారు, దీనివల్ల మొత్తం పన్ను 50% కు చేరింది. ఇప్పుడు, సెస్‌ తొలగించి, ఓవరాల్‌గా 40% GST కి కుదించారు. దీనివల్ల, ప్రీమియం కార్లను కొనేవాళ్లకు కూడా డబ్బు ఆదా అవుతుంది.