Maruti New car Launch Latest News: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి మరో వెహికల్ లాంచ్ కానుంది. కాస్త పెద్ద సైజ్ లో ఉండే ఈ వెహికల్ కాస్త ఎక్కువ మంది ప్రయాణించేలా డిజైన్ చేయబడి ఉందని తెలుస్తోంది. మారుతి ఈనెల 3న కొత్త కాంపాక్ట్ SUVను విడుదల చేయనున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఇది మారుతి బ్రెజ్జా ,మారుతి గ్రాండ్ విటార మధ్యలో ప్లేస్ చేయబడుతుందని సమాచారం. కంపెనీ అరెనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడనుందని తెలుస్తోంది. తాజాగా, కొన్ని మీడియా నివేదికల ప్రకారం దీన్ని ‘మారుతి విక్టోరిస్’గా పిలవవచ్చని అంచచనా, కానీ అంతకుముందు దీనిని ‘మారుతి ఎస్కుడో’గా పిలవబోతున్నారని ప్రచారం జరిగింది. మారుతి ఇంకా అధికారికంగా పేరు ప్రకటించకపోయినా, 'విక్టోరిస్ , 'ఎస్కుడో' పేర్లకు ఇండియాలో పేటెంట్ దాఖలు చేయడంతో కొత్త మోడల్ కు ఈ రెండు పేర్లలో ఏదో ఒకటి ఖరారు కానుందని తెలుస్తోంది. మారుతి కొత్త మోడల్ రెండు వరుసల కూర్చునే SUVగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది గ్రాండ్ విటార కంటే కొంచెం పెద్దదిగా ఉండనుందని సమాచారం. హ్యూండాయ్ క్రెటా , కియా సెల్తోస్‌కు తగిన పరిణామాలో ఉండి, వాటికి గట్టి పోటీనివ్వనుందని నిపుణులు పేర్కొంటున్నారు.
స్టైలిష్ డిజైన్..డిజైన్ పరంగా, దీనిలో కర్వ్ డిజైన్ తోపాటు, స్ట్రెయిట్ బోనెట్, విటార తరహా స్లీక్ హెడ్‌లైట్ సెటప్, స్లిమ్ క్లాడింగ్, టాటా కర్వ్ మాదిరిగా స్లీక్ LED టెయిల్ లైట్స్ కనిపించొచ్చని తెలుస్తోంది. ఇంటీరియర్‌లో, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాడరన్ డాష్‌బోర్డ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ప్యానొరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ AC , వెంట్‌లేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశముందని సమాచారం. సేఫ్టీ పరంగా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌గా), 360 డిగ్రీ కెమెరా ,కొన్ని ADAS ఫీచర్లు కూడా పొందుపరిచారని ప్రచారం జరుగుతోంది.. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, గ్రాండ్ విటార లో ఉన్నట్లే 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ , 1.5 లీటర్ పెట్రోల్+CNG వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. వీటి పవర్ ఔట్‌పుట్ వరుసగా 103 PS (మైల్డ్ హైబ్రిడ్), 116 PS (స్ట్రాంగ్ హైబ్రిడ్ కలిపి), 88 PS (CNG), టార్క్ 137 Nm, 141 Nm (హైబ్రిడ్), 121.5 Nm (CNG)గా ఉండే అవకాశం ఉంది.
డ్యూయల్ సిలిండర్ సెటప్..!ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVTగా ఉంటాయని తెలుస్తోంది. CNG వేరియంట్‌లో, టాటా ,హ్యూండాయ్ కార్లలో ఉన్నట్లే డ్యూయల్ సిలిండర్ సెటప్ ఉండవచ్చని అంచనా. ధర విషయానికి వస్తే, ఇది అరెనా డీలర్‌షిప్‌లో అమ్ముడవ్వడం వల్ల గ్రాండ్ విటార (ధర రూ.11.42 లక్షలు నుండి రూ.20.68 లక్షల వరకు, ఎక్స్‌షోరూమ్) కన్నా కొంచెం తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హ్యూండాయ్ క్రెటా, కియా సెల్తోస్ వంటి మిడ్-సైజ్ SUVలకు గట్టి పోటీగా నిలవనుందని నిపుణులు అంచాన వేస్తున్నారు.