Maruti Victoris Finance Plan | మీరు CNG ఆప్షన్ ఉన్న మిడ్ సైజ్ SUV ని కొనాలని భావిస్తున్నారా.. అయితే దాని రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ కార్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మీకు Maruti Victoris CNG బెస్ట్ ఆప్షన్‌గా మారవచ్చు. Maruti Suzuki సంస్థ Victoris ను మిడ్-సైజ్ SUV విభాగంలో తీసుకొచ్చి విక్రయిస్తోంది. దీని CNG వెర్షన్‌ను SUV తో పాటు మంచి ఫ్యూయల్ ఎకానమీ (మైలేజ్) కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి తీసుకువచ్చారు.
మీరు ఈ SUV ని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించలేరనుకుంటే, కార్ లోన్ తీసుకుని దీనిని కొనుగోలు చేయవచ్చు. అలాంటప్పుడు 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌పై కారు కొనుగోలు చేసి, టర్మ్ పూర్తయ్యే వరకు ప్రతి నెలా EMI చెల్లించాల్సి ఉంటుంది.
కారు ఆన్ రోడ్ ధర ఎంత?
Maruti Victoris CNG LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.54 లక్షలుగా ఉంది. అయితే కస్టమర్ కారును కొనుగోలు చేసేటప్పుడు RTO, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. దానిని కార్ ఆన్ రోడ్ ధర అంటారు.
ఈ కారును హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కూడా చెల్లించాలి. అంతేకాకుండా TCS ఛార్జీ కూడా చేర్చుతారు. ఈ ఖర్చులన్నింటినీ కలిపిన తర్వాత Maruti Victoris CNG హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు 14.21 లక్షలుగా ఉంది.
2 లక్షల డౌన్ పేమెంట్‌పై లోన్కారు ఫైనాన్స్ ప్లాన్ విషయానికి వస్తే, మారుతి Victoris CNG కొనుగోలు చేయడానికి మీరు 2 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన మొత్తానికి బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకోవాలి. అప్పుడు మీరు దాదాపు 12.21 లక్షల మొత్తాన్ని ఫైనాన్స్ చేయించుకోవాలి.
మీరు బ్యాంక్ నుండి ₹12.21 లక్షల కార్ లోన్ తీసుకుని, ఆ లోన్‌పై సంవత్సరానికి 9 శాతం వడ్డీతో 7 సంవత్సరాల లోన్ (84 నెలలు) వ్యవధి పెట్టుకుంటే ప్రతి నెలా సుమారు ₹19,649 EMI చెల్లించాలి. కేవలం వడ్డీ రూపంలోనే రూ.4 లక్షలకు పైగా చెల్లిస్తారు.
ఒకవేళ మీరు 6 ఏళ్ల పాటు లోన్ తీసుకుంటే కనుక 72 నెలల పాటు ప్రతినెలా EMI రూ. 22,014 చెల్లించాలి. మొత్తంగా వడ్డీ రూ.3.6 లక్షల వరకు అవుతుంది. 5 ఏళ్లకు అదే వడ్డీతో లోన్ తీసుకుంటే మీరు 60 నెలలపాటు EMI రూ. 25,351 చెల్లించాలి. మొత్తంగా వడ్డీ రూ.3 లక్షల వరకు అవుతుందని గమనించాలి.
కేవలం EMI మాత్రమే చూసి కారు కొనుగోలు చేయాలనుకోకూడదు. తక్కువ EMI కోసం లోన్ కాలపరిమితిని ఎక్కువగా పెట్టుకుంటే ప్రతి నెలా చెల్లింపు తగ్గుతున్నా, చెల్లించే వడ్డీ పెరుగుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయగలిగితే, లోన్ మొత్తం, దానిపై పడే వడ్డీ సైతం తగ్గుతాయి. మీ జీతం ₹50-60 వేల మధ్య ఉంటే మీరు ప్లాన్ చేసుకుంటే సులభంగా మారుతి విక్టోరిస్ సీఎన్‌జీ కొనుగోలు చేయవచ్చు.
Victoris ను Maruti Suzuki 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న SUV గా మార్కెట్లోకి తెచ్చారు. భారత ఆటో మార్కెట్‌లో ఇది Maruti Grand Vitara తో పాటు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), Kia Seltos, Mahindra XUV700, Scorpio-N, Honda Elevate వంటి కార్లతో పోటీపడుతుంది.
