Continues below advertisement

Maruti WagonR on Down Payment | గత ఏడాది ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత పలు కార్లు, బైకుల ధరలు దిగొచ్చాయి. అదే సమయంలో గత ఏడాది చివరి మూడు నెలల్లో వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో Maruti WagonR ధర గతంలో కంటే కొంచెం చౌకగా మారింది. అందుకే, మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, దాని ఫైనాన్స్ వివరాలు తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది. కేవలం 1 లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. డౌన్ పేమెంట్ తర్వాత మీరు ప్రతి నెలా EMI గా ఎంత చెల్లించాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

మారుతి వాగన్ ఆర్ (Maruti WagonR) లోని Lxi వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 4,98,900 రూపాయలుగా ఉంది. దీనికి 48,201 రూపాయలు రోడ్ టాక్స్ (RTO), రూ. 22,872 ఇన్సూరెన్స్, 600 రూపాయలు ఇతర ఖర్చులు ఉంటాయి. అన్ని ఖర్చులు కలిపిన తర్వాత మారుతి వాగన్ ఆర్ కారు ఆన్-రోడ్ ధర రూ.5,70,573 అవుతుంది. 

Continues below advertisement

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?

మీరు 1 లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేసి మారుతి వాగన్ ఆర్ కారు కొనుగోలు చేస్తే, మిగిలిన 4.70 లక్షల రూపాయలను బ్యాంక్ లోన్ తీసుకుని ఈఎంఐ రూపంలో చెల్లించాలి. మీరు 10 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, ప్రతి నెలా మీరు 7 వేల 812 రూపాయల EMI చెల్లించాల్సి ఉంటుంది.  

Maruti WagonR లో మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ పెట్రోల్+CNG ఎంపికలు ఉన్నాయి. దీని పెట్రోల్ వెర్షన్ ఒక లీటర్ కు 25.19 కిలోమీటర్లు వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే CNG వెర్షన్ 34.05 Km/kg వరకు మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఈ కారును సిటీతో పాటు హైవే రెండింటిలోనూ సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. మారుతి వాగన్ఆర్ ప్రధానంగా టాటా టియాగో, మారుతి ఎస్-ప్రెస్సో వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లకు మార్కెట్లో పోటీ ఇస్తుంది. 

Maruti WagonR ఫీచర్లు ఎలా ఉన్నాయి? 

ఫీచర్ల విషయానికొస్తే, WagonR లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇది Android Auto, Apple CarPlay లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో కీ లెస్ ఎంట్రీ, పవర్ విండోస్ తో పాటు 341 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. భద్రత పరంగా WagonR ఇప్పుడు మునుపటి కంటే మరింత సురక్షితం అయింది. ఎందుకంటే ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తాయి. అంతేకాకుండా ABS తో పాటు EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ కెమెరా వంటి సౌకర్యాలు ఇస్తున్నారు.

Also Read: Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి