Maruti Suzuki Victoris Long Term Review: మారుతి సుజుకి నుంచి వచ్చిన కొత్త మిడ్‌ సైజ్‌ SUV విక్టోరిస్‌, లాంగ్‌ డ్రైవ్‌లో ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి ఆటో ఎక్స్‌పర్ట్‌లు 3,500 కిలోమీటర్లకు పైగా నడిపి చూశారు. కంపెనీ చెప్పినట్లుగానే ఇది హై రేంజ్‌ డ్రైవ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిందా, ఫీచర్లు ప్రాక్టికల్‌గా పని కొచ్చాయా అనేది ఎక్స్‌పర్ట్‌లు ఇచ్చిన రివ్యూలో ఇక్కడే తెలుసుకుందాం.

Continues below advertisement

ఎక్స్‌పర్ట్‌ల రిపోర్ట్‌ ప్రకారం... మొదటి డ్రైవ్‌ సమయంలోనే ఇది ఫీచర్లతో నిండిన, బ్యాలెన్స్‌డ్‌గా డిజైన్‌ చేసిన SUV అన్న అభిప్రాయం కలిగింది. ఆ తర్వాత జరిగిన 1,300 కిలోమీటర్లకు పైగా లాంగ్‌ రోడ్‌ ట్రిప్‌ ఈ కార్‌ అసలు సామర్థ్యాన్ని బయటపెట్టింది.

ఈ ప్రయాణంలో ఎక్స్‌పర్ట్‌లు ఉపయోగించిన వేరియంట్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, AWD ఉన్న ZXi+(O). హైబ్రిడ్‌ కాకపోయినా, ఇది టాప్‌ స్పెక్‌ కావడం విశేషం.

Continues below advertisement

ఓవర్‌టేకింగ్‌ సమయంలో ఒత్తిడి

సమృద్ధి మహామార్గ్‌ వంటి ఖాళీగా ఉండే హై-స్పీడ్‌ హైవేలో విక్టోరిస్‌ ఇంజిన్‌ పనితీరు స్పష్టంగా అర్థమైంది. నలుగురు ప్రయాణికులు, లగేజీతో నిండిన బూట్‌ ఉన్నప్పుడు 103hp పవర్‌ ఇచ్చే నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌, ఓవర్‌టేకింగ్‌ సమయంలో కొంచెం ఒత్తిడిగా అనిపించింది. అదే సమయంలో మైలేజ్‌ కూడా తగ్గింది.

మైలేజ్‌ 

ముంబై నుంచి అమరావతి వరకు వెళ్లి వచ్చిన ఈ ట్రిప్‌లో ఎక్కువగా హైవే డ్రైవింగ్‌ చేసినప్పటికీ, విక్టోరిస్‌ లీటరుకు 13.69 కిలోమీటర్ల మైలేజ్‌ మాత్రమే ఇచ్చింది. 45 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ కారణంగా ఫ్యూయల్‌ కోసం తరచూ ఆగాల్సి వచ్చింది. సిటీ డ్రైవింగ్‌లో అయితే మైలేజ్‌ మరింత తగ్గి లీటర్‌కు 8.93 కిలోమీటర్లు మాత్రమే వచ్చింది. మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ ఉన్నా ఇది పెద్ద ప్లస్‌గా అనిపించలేదు.

అయితే పవర్‌, మైలేజ్‌లో ఉన్న లోపాలను రిఫైన్‌మెంట్‌, రైడ్‌ క్వాలిటీతో విక్టోరిస్‌ కవర్‌ చేస్తుంది. 6-స్పీడ్‌ ఐసిన్‌ టార్క్‌ కన్వర్టర్‌ గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. లాంగ్‌ డ్రైవ్‌లో డ్రైవర్‌కు అలసట లేకుండా నడిపిస్తుంది.

సమృద్ధి మహామార్గ్‌ కాంక్రీట్‌ రోడ్డు మీద కనిపించే చిన్న చిన్న గుంతలు, బంప్స్‌ను కూడా విక్టోరిస్‌ సస్పెన్షన్‌ చాలా చక్కగా హ్యాండిల్‌ చేసింది. హై స్పీడ్‌లో కూడా కార్‌ స్టేబుల్‌గా ఉంది. ఎక్స్‌పర్ట్‌ల ప్రయాణంలో ఒకరికి కార్‌ సిక్‌నెస్‌ సమస్య ఉన్నా, ఈ ప్రయాణం అంతా ఆ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకపోవడం విక్టోరిస్‌ రైడ్‌ క్వాలిటీకి ఇవ్వాల్సిన ప్రశంస.

ప్రాక్టికల్‌గా పనికొచ్చిన ADAS ఫీచర్లు

లాంగ్‌ హైవే డ్రైవ్‌లో ADAS ఫీచర్లు చాలా ఉపయోగపడ్డాయి. అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ ముందున్న వాహనానికి సరైన దూరం ఉంచుతూ, అవసరమైనప్పుడు ముందుగానే స్పీడ్‌ తగ్గిస్తుంది. లేన్‌ కీప్‌ అసిస్ట్‌ కూడా ఇబ్బంది పెట్టకుండా మెల్లగా స్టీరింగ్‌ సపోర్ట్‌ ఇస్తుంది.

ఇన్‌టీరియర్‌ ఉపయోగం

ఇన్‌టీరియర్‌లో పెద్దగా, బాగా ప్యాడింగ్‌ ఉన్న ఫ్రంట్‌ సీట్లు, పవర్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌, వెంటిలేషన్‌ లాంగ్‌ డ్రైవ్‌కు చాలా ఉపయోగపడ్డాయి. ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్‌, డాల్బీ అట్మాస్‌తో పాటలు, పోడ్‌కాస్ట్‌లు వినడానికి బాగుంది. కొత్త 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఫోన్‌కు వెంటనే కనెక్ట్‌ అయింది, ఎక్కడా గ్లిచ్‌లు కనిపించలేదు. రాత్రి డ్రైవింగ్‌లో ఆటో LED హెడ్‌ల్యాంప్స్‌ రోడ్డును అద్భుతంగా వెలిగించాయి.

కొన్ని మైనస్‌లు

కేబిన్‌లో ఉన్న లైట్‌ బీజి-బ్లాక్‌ డ్యూయల్‌ టోన్‌ అప్హోల్స్టరీ చూసేందుకు బాగున్నా, త్వరగా మరకలు పడే అవకాశం ఉంది. ఇంకొక పెద్ద మైనస్‌ ఏమిటంటే స్టాండర్డ్‌గా స్పేర్‌ టైర్‌ లేకపోవడం. హైవే డ్రైవ్‌లో ఇది కాస్త టెన్షన్‌ కలిగించే విషయం. అయితే అదే స్పేస్‌ను అదనపు లగేజీకి ఉపయోగించుకోవచ్చు.

మొత్తానికి, మారుతి సుజుకి విక్టోరిస్‌ ఒక కంఫర్టబుల్‌, రిఫైన్‌డ్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ట్రావెలర్‌. బాగా సెట్‌ చేసిన చాసిస్‌కు సరిపడే శక్తిమంతమైన ఇంజిన్‌ ఉంటే ఇది మరింత ఆకట్టుకునేది. రాబోయే రోజుల్లో సిటీ డ్రైవ్‌తో పాటు లైట్‌ ఆఫ్‌రోడ్‌లో కూడా దీని AWD సామర్థ్యాన్ని పరీక్షించాలనేది ఎక్స్‌పర్ట్‌ల ప్లాన్‌, ఆ రివ్యూను కూడా త్వరలోనే అందిస్తాం.

కార్‌ వివరాలు

వేరియంట్‌: Maruti Suzuki Victoris ZXi+(O) AT AWDఓడోమీటర్‌: 3,613 కిలోమీటర్లుధర: ₹19.37 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)హైవే మైలేజ్‌: 13.69 kmplమెయింటెనెన్స్‌ ఖర్చు: ఇప్పటివరకు లేదులోపాలు: ఇప్పటివరకు లేవు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.