Upcoming Maruti Cars: భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ కోసం మారుతి సుజుకి అగ్రెసివ్ స్ట్రాటజీ ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మారుతి సుజుకీ ప్రెసిడెంట్ ఆర్సీ భార్గవ 2031 నాటికి ఐదు కొత్త ఐసీఈ మోడళ్లను పరిచయం చేయడం ద్వారా తన ప్రొడక్ట్ లైనప్‌ను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఏ మోడల్‌లు వస్తాయో ఇంకా వెరిఫై అవ్వలేదు. అయితే మూడు వరుసల ఎస్‌యూవీలు వచ్చే అవకాశం ఉంది.


త్వరలో కొత్త సెవెన్ సీటర్ ఎస్‌యూవీ
కొన్ని ఊహాగానాల ప్రకారం మారుతి సుజుకి కొత్త సెవెన్ సీటర్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తుంది. ఇది గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్‌పై బేస్ అయి ఉండవచ్చు. ఈ మోడల్‌లో ఇంజిన్‌తో పాటు గ్రాండ్ విటారా మాదిరిగానే డిజైన్ అంశాలు, ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇది మరికొంచెం పెద్దదిగా ఉంటుంది. దీంతోపాటు ఎక్కువ స్థలంతో పెద్ద ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది.


గ్రాండ్ విటారాలో 1.5 లీటర్ కే15సీ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ లేదా 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది వరుసగా 103 బీహెచ్‌పీ, 115 బీహెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త మూడు వరుసల ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇటీవల ఏర్పాటు చేసిన ఖార్ఖోడా ఫెసిలిటీలో తయారు కానుందని తెలుస్తోంది. ఈ సెవెన్ సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కజార్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి కార్లతో పోటీపడుతుంది. ప్రస్తుతానికి ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే, కంపెనీ దాన్ని ఇంకా ధృవీకరించలేదు.


ఇది కాకుండా మారుతి సుజుకి... కియా కారెన్స్‌కు పోటీగా సరసమైన ఎంపీవీని కూడా పరిచయం చేయవచ్చు. దీని ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల మధ్య ఉండవచ్చు. కంపెనీ మార్కెట్లోకి హ్యాచ్‌బ్యాక్, మైక్రో ఎస్‌యూవీని కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. సెలెరియో, ఆల్టోలకు తర్వాతి వెర్షన్లుగా ఇవి రానున్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా పంచ్‌లతో ఇవి పోటీపడనున్నాయి.


వచ్చే ఏడాది మూడు కొత్త కార్లు
2024లో మారుతి సుజుకి మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. వీటిలో తదుపరి తరం స్విఫ్ట్, డిజైర్ అలాగే ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్, డిజైర్ మోడల్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానున్నాయి. అయితే ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2024 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ప్రారంభం కానుంది.


మరోవైపు టెస్లా రూ. 20 లక్షల కంటే తక్కువ ధరలో కారును భారతదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అయితే రూ. 60 లక్షల ధరతో టెస్లా మోడల్ 3 త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు రూ. 20 లక్షలలోపు టెస్లా కారును కొనుగోలు చేయాలనుకుంటే మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!