Maruti Suzuki Swift Facelift Launch Date Set For May 9: ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. స్విఫ్ట్ ఫేస్ లిప్ట్ పేరుతో కొత్త కారును పరిచయం చేయబోతోంది. ఈ కారును ఈ నెల 9న ఆవిష్కరించనుంది. ఈ ఏడాది మారుతి లాంచ్ చేస్తున్న ముఖ్యమైన కారు ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ లేటెస్ట్ కారుకు సంబంధించి బుకింగ్స్ ను మారుతి సుజుకి ప్రారంభించింది. వినియోగదారులు మారుతి సుజుకి అధికారిక వెబ్ సైట్ తో పాటు అరేనా డీలర్ల దగ్గర రూ. 11 వేలు చెల్లించి కొత్త కారు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
భారతీయ మార్కెట్లో స్విఫ్ట్ సంచలనం
మారుతి సుజుకి స్విఫ్ట్ 29 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై మంచి సక్సెస్ రేటును అందుకుంది. వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తోంది. “మారుతి సుజుకికి స్విఫ్ట్ ఒక ఐకానిక్ బ్రాండ్. ఇది కస్టమర్ అంచనాలకు అనుగుణంగా అప్ డేట్ అవుతూ వస్తోంది. ఈ కారు 29 లక్షల మంది కస్టమర్ బేస్ ను కలిగి ఉంది. అనేక అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఎప్పటి లాగే, నెక్ట్స్ జెనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో కొత్త బెంచ్ మార్క్ ను సృష్టించడానికి స్విఫ్ట్ ఫేస్ లిప్ట్ అందుబాటులోకి రాబోతోంది” అని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ తెలిపారు.
స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు!
కొత్త స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కారు బయటి డిజైన పరంగా పలు వేరియంట్లు, కలర్ ఆప్షన్స్ లో రాబోతున్నాయి. కొత్త గ్రిల్, బంఫర్లు, అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, C-పిల్లర్ మౌంటెడ్ స్థానంలో సంప్రదాయ డోర్ హ్యాండిల్స్ లాంటి అప్ డేట్స్ ను కలిగి ఉండబోతోంది. ఇంటీరియర్‌లో, ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ కోసం పెద్ద MID యూనిట్, కొత్త సీట్ అప్హోల్స్టరీ లాంటి అప్ గ్రేడ్స్ ఉండవచ్చు. ఇంటీరియర్ డిజైన్ బాలెనో మాదిరిగానే ఉండనుంది.
ఇక సరికొత్త స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కారులో హుడ్ కింద, గత K-సిరీస్ యూనిట్ స్థానంలో 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ అందించబుతుంది. ఇది CNG వేరియంట్ తో సహా మాన్యువల్, AMT గేర్‌బాక్స్ అప్షన్స్ కలిగి ఉంటుంది. మొత్తంగా 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ దాని ఐకానిక్ హెరిటేజ్ కు అనుగుణంగా ఉంటూనే రిఫ్రెష్ లుక్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరును కలిగి ఉండబోతోంది. ఇటీవలే జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి మాతృసంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. ఈ కొత్త కారు భారత ఆటోమోబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉన్నట్లు మారుతి సుజుకి సంస్ధ భావిస్తోంది.
Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!