Maruti S-Presso Price in Hyderabad: మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో దే ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్‌ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. మధ్యతరగి కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన మోడల్‌ వారికి మంచి ఎంపికగా మారింది. నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్‌, పార్కింగ్ సమస్యలకు చెక్‌ పెడుతూ ఎస్‌యూవీ తరహా లుక్‌తో విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Continues below advertisement

ఆల్టో కంటే తక్కువ ధరకే ఎస్‌ప్రెస్సో లభిస్తుండంతో మోస్ట్ అఫార్డబుల్‌ మేజర్ కార్‌ మోడల్‌గా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారుకు ఉన్న డిమాండ్ , ఇక్కడి ఆన్‌రోడ్ ధరల పూర్తి వివరాలు తెలుసుకుందా. 

కారు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్‌రూమ్‌ ధరతోపాటు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్‌, ఇతర ఫీజుల కలిసి ఆన్‌రోడ్‌ ధర నిర్ణయమవుతుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం మారుతి ఎస్‌ప్రెస్సో వేరియంట్ల వారీగా అందాబుటులో ఉన్న ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే. 

Continues below advertisement
వేరియంట్ పేరు  ఇంధన రకం  ట్రాన్స్‌మిషన్  ఆన్-రోడ్ ధర 
S-Presso STD పెట్రోల్  మాన్యువల్  ₹ 4,21,000 - ₹ 4,25,000
S-Presso LXi పెట్రోల్  మాన్యువల్  ₹ 4,56,000 - ₹ 4,60,000
S-Presso VXi పెట్రోల్  మాన్యువల్  ₹ 5,14,000 - ₹ 5,17,000
S-Presso LXi S  సిఎన్‌జి  మాన్యువల్  ₹ 5,51,000 - ₹ 5,54,000
S-Presso VXi (O)AMT పెట్రోల్ ఆటోమేటిక్  ₹ 5,66,000 - ₹ 5,69,000
S-Presso VXi Plusపెట్రోల్  మాన్యువల్   ₹ 5,72,000 - ₹ 5,74,000
S-Presso VXi S-CNG సిఎన్‌జి మాన్యువల్   ₹ 6,15,000 - ₹ 6,16,000
S-Presso VXi Plus (O) AMTపెట్రోల్ ఆటోమేటిక్ ₹ 6,31,000 - ₹ 6,43,000

మారుతి ఎస్‌ప్రెస్సోలోని స్పెసిఫికేన్స్‌ 

ఈ మైక్రో ఎస్‌యూవీ పరిమాణంలో చిన్నదైనప్పటికీ రోడ్లపై దూసుపోవానికి అవసరమైన అన్ని సాంకేతిక హంగులను కలిగి ఉంది. దీని ప్రధాన ఇంజన్, పవర్‌, డైమెన్షన్ వివరాలు ఆకట్టుకునే ఉన్నాయి. 998 cc, 3-సిలిండర్ K10C ఇంజన్‌తో వస్తున్న ఈ కారు గరిష్ట పవర్ పెట్రోల్ మోడ్‌లో 5500 rpm వద్ద 68 bhp,  CNG మోడ్‌లో 56 bhp ఇస్తుంది. గరిష్ట టార్క్ గురించి చూస్తే 3500 rpm వద్ద 91.1 Nm ఇస్తుంది. భారతీయ రోడ్లపై ఉండే స్పీడ్ బ్రేకర్లను సులభంగా అధిగమించేలా గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm కలిగి ఉంది. 270 లీటర్ల విశాలమైన లగేజ్ స్పేస్ కలిగి ఉంటుంది. కేవలం 4.5 మీటర్ల టర్నింగ్ రేడియస్  ఉండటం వల్ల చిన్న సందుల్లో కూడా సులువుగా యూ-టర్న్ తీసుకోవచ్చు.

మైలేజ్‌, రన్నింగ్ కాస్ట్‌ 

మారుతి సుజుకి కార్లకు ఉన్న ఇతి పెద్ద బలం వాటి మైలేజ్‌ సామర్థ్యం. ఎస్‌ప్రెస్సో కూడా ఇందుకు మినహాయింపు కాదు. పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్‌లలనూ ఈ కారు మంచి మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ ఎఁీ వేరియంట్‌లో లీటరకు సుమారు 24.12 నుంచి  24.76 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని చెబుతున్నారు. ఇదే ఆటోమేటిక్‌లో లీటర్‌కు 25.3 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా ఉంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ సీఎన్జీ కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 

హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలకు సీఎన్జీ వేరియంట్‌ చాలా పొదుపుగా ఉంటుంది. రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఈ కారు తీసుకుంటే రోజుకు 2.20 రూపాయలే ఖర్చు అవుతుంది. ఇది బైక్‌ కాస్ట్‌తో సమానంగా చెబుతున్నారు. 

హైదరాబాద్‌లో ఈఎంఐలో కొనుగోలు చేయాలంటే?

మీరు హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సోను లోన్ ద్వారా కొనుగోలు చేయాలంటే బ్యాంకులు, ఫైనాన్స్‌ క కంపెనీలు మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. అయితే దీన్ని నెలవారీ ఈఎంఐపై కొనుగోలు చేయాలి అంటే దాదాపు 50 వేల వరకు డౌన్‌పేమెంట్‌ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కాలపరిమితితో 10 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకుంటే నెలకు 8 నుంచి 10 వేల వరకు ఈఎంఐ చెల్లించాలి.