Jimny On Road Price Hyderabad: మారుతి సుజుకి నుంచి వచ్చిన ఐకానిక్ ఆఫ్‌రోడర్ జిమ్మీ భారీయ ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అడ్వెంచర్ ప్రియులు కఠినమైన రోడ్లపై ప్రయాణించడానికి ఇష్టపడేవారికి ఈ కారు ఒక అద్భుతమైన ఎంపికగా నిలిచింది. ఈ సరికొత్త 5-డోర్ల జిమ్మీ ధరలు ఎంత ఉన్నాయి? వివిధ వేరియంట్ల ఆన్ రోడ్ ధరల విశ్లేషణ, పన్నుల వివరాలు, మైలేజీ, దీని ప్రత్యేకతలపై సమగ్ర పరిశీలన చూద్దాం.
హైదరాబాద్ మారుతి జిమ్మీ వేరియంట్ల వారీగా ఆన్‌రోడ్ ధరలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాహనాల రిజిస్ట్రేషన్, లైఫ్ టాక్స్ విధానం ఆధారంగా ఆన్‌రోడ్ ధరలు నిర్వహిస్తారు.
| వేరియంట్ పేరు | ఎక్స్-షోరూమ్ ధర | అంచనా ఆన్-రోడ్ ధర |
| జిమ్మీ Zeta MT (Base) | ₹ 12,31,500 | ₹ 14,90,923 |
| జిమ్మీ Alpha MT | ₹ 13,23,200 | ₹ 16,00,788 |
| జిమ్మీ Zeta AT (Automatic) | ₹ 13,37,500 | ₹ 16,17,920 |
| జిమ్మీ Alpha MT Dual Tone | ₹ 13,38,600 | ₹ 16,25,757 |
| జిమ్మీ Alpha AT (Automatic) | ₹ 14,29,200 | ₹ 17,27,785 |
| జిమ్మీ Alpha AT Dual Tone | ₹ 14,44,600 | ₹ 17,52,568 |
తెలంగాణలో కొత్తగా కొనుగోలు చేసే వ్యక్తిగత కార్లపై లైఫ్ ట్యాక్స్ రోడ్ టాక్స్ రూపంలో వసూలు చేస్తారు. మారుతి జిమ్మీ ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 12.31 లక్షలపైనే ఉండటంతో, ఇది నేరుగా 17 శాతం టాక్స్ స్లాబ్ కిందకు వస్తుంది. దీనికి అదనంగా థర్డ్ పార్టీ, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరన్స్ ఛార్జీలు, ఫాస్ట్‌ట్యాగ్, గ్రీన్‌సెన్, ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలు తోడవుతాయి. ఫలితంగా ఎక్స్‌షోరూమ్ ధరతో పోలిస్తే ఆన్‌రోడ్ ధర దాదాపు 22 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
జిమ్మీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్
జిమ్మీలో 1.5 లీటర్ల 4- సిలిండర్ కే-15B నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 104.8 పీఎస్ పవర్, 134.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది లో ఎండ్ టార్క్‌ను చక్కగా అందిస్తూ బురద, ఇసుక, నిటారైన కొండ ప్రాంతాల్లో కారు సులభంగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది.
జిమ్మి ఆల్ గ్రిప్ ప్రో 4- వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ ఉంటుంది. అత్యంత కఠినమైన ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు ఎక్కడా ఇరుక్కుపోకుండా చేస్తుంది. సాధారణ మోనోకాక్ కార్లలా కాకుండా జిమ్మీని దృఢమైన లాడ్ ఫ్రేమ్ చాసిస్‌పై నిర్మించారు. దీని వల్ల ఉండే గుంతలు తట్టుకొని శక్తి కారుకు లభిస్తుంది. లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్, కాయిల్ స్ప్రింగ్ కఠినమైన దారుల్లో కూడా అద్భుతమైన వీల్ ఆర్టిక్యూలేషన్ అందిస్తాయి.
