Maruti Suzuki Invicto Finance Plan | మారుతి సుజుకికి చెందిన ప్రీమియం MPV అయిన ఇన్‌విక్టోను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. కంపెనీ ఈ MPV ధరలు మరోసారి పెంచేసింది. కొత్త అప్‌డేట్ తర్వాత కొన్ని వేరియంట్ల ధర దాదాపు రూ. 10,000 వరకు పెరిగింది. కొన్ని రోజుల కిందట ఇన్‌విక్టో ధర కూడా పెరిగింది. దీనివల్ల ఈ MPV కొనుగోలు చేసే వారు కొంచెం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
మారుతి సుజుకి ఇన్‌విక్టోను కంపెనీ భారత మార్కెట్లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఇస్తోంది. ఇది ప్రధానంగా జీటా ప్లస్ హైబ్రిడ్ (Zeta Plus Hybrid), ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ (Alpha Plus Hybrid) వేరియంట్లలో లభిస్తుంది. భిన్నమైన సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను బట్టి ఇందులో 7 సీటర్, 8 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ మోడల్ ప్రీమియం MPV సెగ్మెంట్‌లో కంపెనీకి చెందిన స్పెషల్ ప్రొడక్ట్.
జీటా ప్లస్ 7S ధరలో మార్పుల్లేవ్
మారుతి ఇన్‌విక్టో కొత్త ధర అప్‌డేట్‌లో ఇన్‌విక్టో అన్ని వేరియంట్ల ధరలు పెరగలేదని కంపెనీ తెలిపింది. జీటా ప్లస్ 7S ధరలో మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో మారుతి సుజుకీ ఇన్‌విక్టో ఎక్స్‌షోరూమ్ ధర Rs.24,97,400 గా ఉండగా, ఆర్టీవో ఛార్జీలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇతర ఛార్జీలు కలిపితే ఆన్ రోడ్ ధర రూ. 31,72,335 వరకు అవుతుంది.
ఇక జీటా ప్లస్ 8S వేరియంట్ ధర మాత్రం రూ. 10,000 పెరిగింది. దీంతో ఎక్స్‌షోరూమ్ ధర రూ.25.37 లక్షలు ఉండగా, ఆన్ రోడ్ ధర దాదాపు రూ. 32.25 లక్షలకు చేరింది. 7 సీటర్ జీటా ప్లస్ కొనుగోలు చేసే వినియోగదారులు పాత ధరనే చెల్లిస్తారు. అయితే 8 సీటర్ వేరియంట్ అయితే కాస్త ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌విక్టో టాప్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ 7S ధర. 10,000 పెరిగింది. ధర పెరిగిన తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.70 లక్షలైంది.
Also Read: రూ.లక్ష లోపే వచ్చే పవర్‌ఫుల్ 125cc బైక్స్ - యూత్ మెచ్చిన టాప్-5 లిస్ట్ మీ కోసం!
ఈ వేరియంట్‌లో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి, అందుకే ఇది ఇన్‌విక్టోలో అత్యంత ఖరీదైన ఆప్షన్. ధర పెరిగినప్పటికీ, ఇందులో లభించే ఫీచర్లు మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ దీనిని ప్రీమియం MPV కొనుగోలుదారులకు మంచి ఎంపికగా నిలుపుతున్నాయి.
జూన్‌లో కూడా పెరిగిన ధరమారుతి ఇన్‌విక్టో ధర ఈ ఏడాది ఇప్పటికే పెరిగింది. జూన్ 2026లో కంపెనీ దీని కొన్ని వేరియంట్ల ధరను రూ. 25,000 వరకు పెంచింది. ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ కొన్ని వేరియంట్ల ధరను రూ. 10,000 వరకు పెంచారు. అంటే మే నెల ధరలతో పోలిస్తే, ఇన్‌విక్టో కొన్ని వేరియంట్ల మొత్తం ధరలో దాదాపు రూ. 35,000 వరకు తేడా వచ్చింది.
డౌన్ పేమెంట్ కడితే EMI ఎంత చెల్లించాలి
మారుతి ఇన్‌విక్టో 7 సీటర్ ఆన్ రోడ్ ధర రూ. 31.72 లక్షలుగా ఉంది. అయితే మీరు రూ.3 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే కనుక 9.8 శాతం వడ్డీతో 4 ఏళ్లపాటు ఈఎంఐ రూ. 70,682 చెల్లించాలి. ఒకవేళ మీరు 5 ఏళ్లకు లోన్ తీసుకుంటే అదే వడ్డీ శాతంతో 60 నెలలపాటు ప్రతినెలా రూ.59,162 EMI కడుతూ ఉండాలి. మీరు కనుక 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే 72 నెలలపాటు EMI రూ. 51,543 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రెండు కార్ల మధ్య గట్టి పోటీ
మారుతి ఇన్‌విక్టోకు అతిపెద్ద పోటీదారుగా టయోటా ఇన్నోవా హైక్రోస్ (Toyota Innova Hycross) విక్రయాలు జరుగుతుంటాయి. రెండూ ప్రీమియం హైబ్రిడ్ MPV సెగ్మెంట్‌లోకి రావడంతో పాటు రెండింటిలోనూ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లభిస్తుంది. పెద్ద కేబిన్, ప్రీమియం ఫీచర్లు ఇన్‌విక్టో ప్రత్యేకతగా చెప్పవచ్చు. బుకింగ్ చేసుకునే ముందు మీకు నచ్చిన వేరియంట్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర, డీలర్ వద్ద లభించే ఆఫర్ల వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
