ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి డిజైర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా 30 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును ఈ కారు అధిగమించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో 2.14 లక్షల విక్రయాలతో కంపెనీలోనే టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. 

Continues below advertisement

ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి డిజైర్' మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. దేశవ్యాప్తంగా ఈ కారు విక్రయాలు 30 లక్షల మార్కును దాటినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2008లో తొలిసారిగా పరిచయమైన ఈ మోడల్, ప్రస్తుతం నాలుగు ర‌కాల వేరియంట్ల‌తో వినియోగదారులను అలరిస్తోంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో సుమారు 2.14 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి, మారుతి సుజుకి బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. దీంతో కంపెనీ వర్గాలు ఆనందోత్సాహాల‌లో మునిగి పోయాయి. 

Continues below advertisement

తొలిసారి కారు కొనేవారికి మొదటి ఛాయిస్మారుతి సుజుకి వివ‌రాల‌ ప్రకారం, డిజైర్ కారును కొనుగోలు చేస్తున్న వారిలో దాదాపు సగం మంది మొదటిసారి వాహనం కొంటున్నవారే ఉండటం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. యువతను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 6.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ సెడాన్, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి, అత్యుత్త‌మ ఎంపిక‌గా నిలిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మైలేజీలో కింగ్..ఇండియ‌న్ కస్టమర్లు ప్రధానంగా ఆశించే ఇంధన సామర్థ్యం విషయంలో డిజైర్ అగ్రస్థానంలో ఉంది. పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ లీటరుకు 24.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. . పర్యావరణ హితమైన ఎస్-సీఎన్‌జీ (S-CNG) మోడ్‌లో కేజీకి 33.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన మైలేజీనే ఈ కారును సెగ్మెంట్ లీడర్‌గా నిలబెట్టాయన‌డంలో సందేహం లేదు.

అధునాతన ఫీచర్లుకాలంతో పాటు మారుతున్న టెక్నాలజీని డిజైర్ తనలో అందిపుచ్చుకుంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా వంటి ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి. 22.86 సెంటీమీటర్ల (9 అంగుళాల) స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను వాడుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ సుజుకి కనెక్ట్ ద్వారా స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.

టాప్ సెక్యూరిటీప్రస్తుతం భద్రతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన మారుతి, ఇందులో 15కు పైగా సేఫ్టీ ఫీచర్లను చేర్చింది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబీఎస్, ఈబీడీ వంటి సెక్యూరిటీ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. భారత్ ఎన్‌క్యాప్ (B-NCAP), గ్లోబల్ ఎన్‌క్యాప్ పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ సాధించడం ఈ కారు స్ట్రాంగ్ నెస్ కు నిదర్శనం. మైలేజీ, లగ్జరీ, భద్రతల మేళవింపుతో డిజైర్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. దీంతో అతి త‌క్కువ కాలంలోనే అత్యున్న‌త మైల్ స్టోన్ ను అధిగమించింది.