Maruti Suzuki Diwali Offers 2025: దీపావళి సీజన్‌ అంటే డిస్కౌంట్ల సీజన్‌. ఈ ఏడాది పండుగ సందర్భంగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ (MSIL) కస్టమర్ల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్‌ 23, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్లలో, కొత్త మారుతి కారు కొనేవాళ్లకు ₹57,500 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. GST 2.0 రూల్‌ తరువాత కార్ల ధరలు తగ్గడంతో పాటు, ఈ ఫెస్టివ్‌ బెనిఫిట్స్‌ వల్ల మరింత ఆదా చేసుకునే అవకాశం దక్కింది.

Alto K10 - బడ్జెట్‌ కార్లలో టాప్‌ ఆఫర్‌ఎంట్రీ లెవెల్‌ Maruti Alto K10 కొనుగోలు చేస్తే గరిష్టంగా ₹52,500 వరకు బెనిఫిట్స్‌ లభిస్తాయి. ఇందులో ₹25,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ ఉంది.

S-Presso - క్యూట్‌ లుక్‌, చక్కని ఆఫర్‌Maruti S-Presso పై ఈ దీపావళికి ₹47,500 వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఇందులో ₹20,000 క్యాష్‌ డిస్కౌంట్‌ కూడా ఉంది.

WagonR - ఫ్యామిలీ ఫేవరేట్‌కి మాక్స్‌ బెనిఫిట్‌అమ్మకాల జాబితాలో ఎప్పుడూ ముందుండే Maruti WagonR, ఈసారి ₹57,500 వరకు బెనిఫిట్స్‌ అందిస్తోంది. ఇందులో ₹30,000 క్యాష్‌ డిస్కౌంట్‌, ₹15,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి.

మారుతి సుజుకి అరేనా మోడళ్లుగరిష్ట డిస్కౌంట్‌
1. Alto K10రూ. 52,500 వరకు
2. Celerioరూ. 52,500 వరకు
3. S-Pressoరూ. 47,500 వరకు
4. WagonRరూ. 57,500 వరకు
5. Swiftరూ. 48,750 వరకు
6. Dzireరూ. 2,500 వరకు
7. Brezzaరూ. 35,000 వరకు
8. Ertiga
9. Eecoరూ. 42,500 వరకు

Swift - యువతకు ఫేవరేట్‌ ఆఫర్‌Maruti Swift హాచ్‌బ్యాక్‌ కొనుగోలుదారులకు ₹48,750 వరకు బెనిఫిట్స్‌ ఉన్నాయి, దీపావళి వెలుగులు పంచుతాయి. LXi, CNG వేరియంట్లకు ₹10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ మాత్రమే లభిస్తుంది, అయితే ఇతర వేరియంట్లకు ₹20,000 వరకు ఉంది.

Brezza - SUV స్టైల్లో ఆఫర్‌సిటీ SUV Maruti Brezza పై ₹35,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో క్యాష్‌ డిస్కౌంట్‌ లేకపోయినప్పటికీ, ₹15,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌, ₹25,000 స్క్రాపేజ్‌ బోనస్‌ & అదనంగా ₹10,000 స్పెషల్‌ ఆఫర్‌ ఉన్నాయి.

Dzire & Ertiga - లిమిటెడ్‌ ఆఫర్లుMaruti Dzire కాంపాక్ట్‌ సెడాన్‌ కొనుగోలుదారులకు ₹25,000 వరకు లాభాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. Maruti Ertiga MPV మీద ఈ నెలలో ఎటువంటి ఆఫర్‌ను మారుతి ఇవ్వడం లేదు.

Eeco - బడ్జెట్‌ యుటిలిటీ వెహికల్‌Maruti Eeco మోడల్‌ కొనుగోలుదారులకు ₹42,500 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో ₹15,000 క్యాష్‌ డిస్కౌంట్‌ ఉంది.

కమర్షియల్‌ వాహనాలకు స్పెషల్‌ ఆఫర్లుWagonR Tour H3, Dzire Tour S, Alto Tour H1, Eeco Tour V వంటి కమర్షియల్‌ మోడళ్లపై భారీగా ₹70,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.

ఈ దీపావళి సీజన్‌లో మారుతి సుజుకి కస్టమర్లకు అత్యధిక బెనిఫిట్స్‌, తగ్గింపు ధరలు, వివిధ మోడళ్లలో విభిన్న ఆప్షన్లు అందిస్తోంది. మీరు కొత్త మారుతి కారు కొనాలనుకుంటే, అక్టోబర్‌ 23 లోగా మీ దగ్గరలోని మారుతి షోరూమ్‌కు వెళ్లి, ఈ బంపర్‌ ఆఫర్‌లను మిస్‌ కాకుండా సొంతం చేసుకోండి.