Maruti Suzuki: భారత్‌లో మారుతీ సుజుకి అనే పేరు ఒక నమ్మకం. దశాబ్దాలుగా మధ్య తరగతి ప్రజల కలల సాకారం చేస్తున్న ఈ సంస్థ 2026 మార్చి నాటికి సాంకేతిక, భద్రత విషయంలో భారీ మార్పులను స్వీకరించింది. ప్రస్తుతం మారుతీ సుజుకి భారత్ మార్కెట్‌లో 19 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, MUVలు, సెడాన్‌లు ఉన్నాయి. 

Continues below advertisement

మారుతీ ఈ విటారాతో ఎలక్ట్రిక్‌ రంగంలోకి అడుగు

మారుతీ సుజుకి చరిత్రలో 2026 ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఫిబ్రవరి 17న కంపెనీ తన మొదటి ఈవీ ఈ విటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర 10.99 లక్షలుగా నిర్ణయించారు. ఈ వాహనాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 440 నుంచి 543 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇది మార్కెట్‌లో హ్యూందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, ఎంజీ ZS, మహీంద్రా బీఈ6 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. 

5 స్టార్ రేటింగ్ సాధించిన మోడళ్లు 

ఒకప్పుడు భద్రత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మారుతీ, ఇప్పుడు ఆ అపవాద చెరిపేసుకుంది. గత సెప్టెంబర్‌లో విడుదలైన మారుతి విక్టోరిస్‌ ఎస్‌యూవీ గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దీని ధర 10.50 లక్షల నుంచి 19.99 లక్షల వరకు ఉంది. 

Continues below advertisement

సరికొత్త తరం డిజైన్ మోడల్ మారుతి డిజైర్‌ పెద్దల భద్రతలో ఫైవ్‌స్టార్, చిన్నారుల భద్రతల విషయంలో ఫోర్‌ స్టార్ రేటింగ్ పొందింది. 12 మే 2025 నుంచి మారుతి తన ఆరీనా నెట్‌వర్క్ పరిధిలోని అన్ని కార్రలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కచ్చితంగా ఇస్తోంది. 

అరీనా, నెక్సా రెండు విభిన్న ప్రపంచాలు 

మారుతీ సుజుకి తన వినియోగదారులను రెండు విభిన్న రిటైల్ నెట్‌వర్క్‌ల ద్వాార చేరుకుంటోంది. మారుతీ సుజుకీ అరీనా ప్రధానంగా బడ్జెట్‌ , మధ్య తరగతి కొనుగోలుదారులను టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఇందులో పది మోడళ్లు ఉన్నాయి. ఆల్టో కే 10, ఎస్‌ప్రెస్స వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విప్ఠ్, డిజైర్‌, బ్రెజ్జా, ఈకో, ఎర్టిగా కొత్త విక్టోరిస్. ప్రస్తుతం మారుతీలో అత్యంత చౌకైన ధర కలిగింది ఎస్‌ ప్రెస్సో, దీని ర 3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మైలేజీ కోరుకునే వారికి  ఆల్టో కే10 సీఎన్జీ 4.81 లక్షల ధరతో అందుబాటులో ఉంది. 

ప్రీమియం అనుభవాన్ని కోరుకునే వాళ్లకు నెక్సా నెట్‌వర్క్ పని చేస్తుంది. ఇందులో ఇగ్నిస్, బలెనో, ఫ్రాంక్స్, ఎక్స్‌ఎల్‌ 6, జిమ్మి, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి ఏడు మోడళ్లు ఉన్నాయి. ఇందులో అత్యంత ఖరీదనదిగా ఇన్విక్టో ఉంది. దీని ధర 24. 97 నుంచి 28. 6 లక్షల వరకు ఉంటుంది. 

2026 మార్చి ఎక్స్ షోరూమ్‌ ధరల ప్రకారం 

మోడల్‌ ధర 
ఆల్టో K10₹3.70 - ₹5.45
వ్యాగన్ ఆర్₹4.99 - ₹6.84
స్విఫ్ట్₹5.79 - ₹8.65
బలెనో₹5.99 - ₹9.10
బ్రెజ్జా₹8.26 - ₹12.86
గ్రాండ్ విటారా₹10.77 - ₹19.64
జిమ్నీ₹12.31 - ₹14.29

 టెక్నాలజీ- పనితీరులో మారుతీ వ్యూహం 

మారుతీ సుజుకీ కేవలం పెట్లోల్ ఇంజినన్లకే పరిమితం కాకుండా హైబ్రీడ్‌, సీఎన్జీ విభాగాల్లోనూ అగ్రగామిగా ఉంది. స్ట్రాంగ్ హైబ్రీడ్‌ విభాగంలో విక్టోరిస్‌, గ్రాండ్ విటారా ఉన్నాయి. ఇవీ లీటర్‌కు 25-28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి. 

నిపుణుల సూచనలు 

మారుతి కార్ల ఎంపికలో కస్టమర్లు తమ అవసరాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సిటీ డ్రైవింగ్ కోసం ఫ్రాంక్స్ ఏఎంటీ, స్విఫ్ట్ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. కుటుంబ అవసరాల కోసం బడ్జెట్‌లో ఎర్టిగా, ప్రీమియం కావాలనుకుంటే ఎక్స్‌ఎల్ 6, ఇన్విక్టోను ట్రై చేయవచ్చు. మౌంటైన్ రైడ్స్, హార్ట్ రోడ్ల కోసం జిమ్మి మంచిదని చెబుతున్నారు.