ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో నిరంతరం కొత్త అప్‌డేట్స్, ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ వస్తున్నాయి. దాంతో వినియోగదారులకు మెరుగైన డిజైన్, మరిన్ని ఫీచర్లు, మంచి మైలేజ్ అందించడమే కార్ల కంపెనీల ప్రధాన ఉద్దేశ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno) కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో అనేక కొత్త మార్పులు, అప్‌డేట్స్ ఉంటాయని వాహనదారులు భావిస్తున్నారు. ఈ కారు ఇప్పటికే తన సెగ్మెంట్‌లో చాలా పాపులర్‌. ఇప్పుడు కంపెనీ దీనిని మరింత మెరుగుచేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలో రావడానికి సిద్ధమవుతోంది.

Continues below advertisement

మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు దాని డిజైన్‌లో కనిపించవచ్చు. కారు ఎక్స్‌టీరియర్ మునుపటి కంటే మరింత మోడ్రన్‌గా మరియు స్టైలిష్‌గా రూపొందించబడుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేట్ చేసిన  బంపర్, LED లైట్ల వంటి మార్పులు ఉండవచ్చు. దీనివల్ల కారు లుక్ మరింత ఆకర్షణీయంగా,  ప్రీమియంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా అల్లాయ్ వీల్స్, బాడీ డిజైన్‌లో కూడా పలు మార్పులు చూడవచ్చు. ఇది దీని ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్‌ను మెరుగుపరుస్తుంది.

కొత్త మారుతి బలెనో ఇంటీరియర్ ఎలా ఉంటుంది?ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త బలెనోలో పలు మార్పులు చేయనుంది. కేబిన్‌ను మరింత ప్రీమియంగా మార్చడానికి నాణ్యత కలిగిన మెటీరియల్, కొత్త డిజైన్ ఇవ్వవచ్చు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు  డిజిటల్ డిస్‌ప్లే వంటి అప్‌డేట్స్ లభిస్తాయని భావిస్తున్నారు. దీంతో పాటు డ్రైవర్, ప్యాసింజర్లకు కంఫర్టబుల్‌గా ఉండేలా సీటింగ్,  స్పేస్‌ను కూడా మెరుగ్గా ఇవ్వనుంది.

Continues below advertisement

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో భద్రత (Safety), టెక్నాలజీ రెండింటిపై ఫోకస్ పెంచారు.  ఉదాహరణకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ ఫీచర్లు లభిస్తాయని అంచనా వేశారు. దీనివల్ల కారు గతంలో  కంటే మరింత సురక్షితంగా,  స్మార్ట్‌గా మారుతుంది.

మారుతి బలెనో పవర్‌ట్రెయిన్మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ విషయంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం తక్కువ. నివేదికల ప్రకారం, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ రావొచ్చు. గతంలో మోడల్ లాగే మంచి మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీంతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ లభించవచ్చు.

బెస్ట్ మైలేజ్ కార్లలో ఒకటి

మైలేజ్ విషయంలో కూడా ఈ కారు తన ప్రత్యేకతను చాటుకుంటుంది. పెట్రోల్ వేరియంట్‌లో దాదాపు లీటరుకు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే CNG వేరియంట్‌లో మైలేజీ ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల రోజువారీ అవసరాలకు ఈ కారు ఎంతో పొదుపైనదిగా, మీ ఖర్చులు తగ్గించేదిగా ఉండనుంది. 

ధర, లాంచింగ్ వివరాలు..మారుతి కంపెనీ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీని ప్రారంభ ధర సుమారు రూ. 6.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ధర ఆయా రాష్ట్రాలు, నగరాల్లో వేర్వేరుగా ఉంటుందని తెలిసిందే. 2026లోనే మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయవచ్చని సమాచారం.