Maruti S Presso GST Discounted Price: మారుతి సుజుకి, తన ప్రసిద్ధ మైక్రో SUV అయిన ఎస్ ప్రెస్సో ధరను భారీగా తగ్గించింది, తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తోంది. GST సంస్కరణలు 2.0 (GST Reforms 2.0) కింద, చిన్న పెట్రోల్ & CNG ఇంజిన్ కార్ల మీద పన్నులు తగ్గాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనేవాళ్లకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్. GST 2.0 రూల్స్ ప్రకారం, మారుతి S ప్రెస్సో బేస్ మోడల్ రేటు ₹ 37,000 తగ్గింపును చూపుతోంది. అదే సమయంలో, టాప్-ఎండ్ CNG వేరియంట్ ధర ₹ 53,000 వరకు తగ్గుతోంది. మారుతి ఎస్ ప్రెస్సో మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో, మారుతి ఎస్ ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ. 4,26,500 (Maruti S Presso ex-showroom price, Hyderabad Vijayawada).
మారుతి S ప్రెస్సో రీసెంట్ లుక్స్ చాలా యూత్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. కారు ఫ్రంట్ ఎండ్‌లో షార్ప్ హెడ్‌ల్యాంప్స్ & ఎలివేటెడ్ గ్రిల్ SUV తరహా లుక్స్ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో హై గ్రౌండ్ క్లియరెన్స్ & కంపాక్ట్ బాడీ డిజైన్ అర్బన్ డ్రైవింగ్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. రియర్ పార్ట్‌లో మోడ్రన్ టెయిల్ ల్యాంప్స్ & క్లీన్ లైన్స్ ఈ బండికి బలమైన ప్రెజెన్స్ తెస్తాయి. మొత్తంగా చూస్తే, మారుతి S ప్రెస్సో డిజైన్, చిన్న కార్లలోనూ SUV ఫీలింగ్‌ను ఇచ్చేలా ప్రత్యేకంగా ఉంది.
మారుతి S ప్రెస్సో ధరల్లో తగ్గింపు, వేరియంట్ వారీగా:
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కొత్త ధరల్లో బేస్ మోడల్ STD (O) MT పై ₹ 37,000 డిస్కౌంట్ లభిస్తుంది.
LXI (O) MT వేరియంట్ పై ₹ 43,000 తగ్గింపు వస్తుంది
VXI (O) MT వేరియంట్ కొంటే ₹ 44,000 వరకు డిస్కౌంట్ తీసుకోవచ్చు.
VXI+ (O) MT ఇప్పుడు ₹ 47,000 తగ్గింపుతో అందుబాటులోకి వస్తుంది.
మారుతి ఎస్ ప్రెస్సో మైలేజ్మారుతి ఎస్ ప్రెస్సో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఈ ఇంజిన్ 68 PS పవర్ & 90 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ లభిస్తుంది. అయితే, CNG వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మారుతి ఎస్ ప్రెస్సో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.12 నుంచి 25.30 కిలోమీటర్లు & CNG వేరియంట్‌కు కిలోగ్రాముకు 32.73 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
స్మార్ట్ & సేఫ్టీ ఫీచర్లుఈ హ్యాచ్‌బ్యాక్ స్మార్ట్ & సేఫ్టీ ఫీచర్లలో - 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, సెమీ -డిజిటల్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ABS+EBD వంటివి ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో మెరుగైన మైలేజ్ & మోడ్రన్ ఫీచర్ల కోసం చూస్తున్నవారికి మారుతి S ప్రెస్సో నమ్మకమైన ఎంపిక అవుతుంది.