Maruti Recalls Alto K10 Cars: స్టీరింగ్ గేర్‌బాక్స్ అసెంబ్లింగ్‌లో సమస్య కారణంగా మారుతి సుజుకి 2,555 మారుతి ఆల్టో కె10 (Maruti Alto K10) కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా కంపెనీ ఈ లోపాలను సరిచేయనుంది. ఈ సమస్య వల్ల కేవలం 2,555 యూనిట్లను మాత్రమే ప్రభావితం అయ్యాయని పేర్కొంది. ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్‌లను నేరుగా సంప్రదిస్తామని మారుతి హామీ ఇచ్చింది. వారు తమ వాహనాలను వెంటనే సమీపంలోని మారుతీ డీలర్‌షిప్‌ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి తనిఖీ చేయించాలని సూచించింది.


వారిదే బాధ్యత
ఇంకా ఈ కారు వినియోగదారులు స్టీరింగ్ సమస్యలను గమనిస్తే డ్రైవింగ్‌ను కొనసాగించవద్దని కస్టమర్‌లకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆ సమస్య ఎదురైతే దగ్గర్లోని సర్వీస్‌ సెంటర్‌లో తమ కారును చెక్‌ చేయించాలని సూచించింది. సమస్య కన్ఫర్మ్‌ అయితే ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా సర్వీస్‌ అందిస్తమాని మారుతి హామీ ఇచ్చింది.


ఆల్టో K10 భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది చిన్న కుటుంబాలలో ప్రత్యేకించి ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే అనేక అప్‌గ్రేడ్స్‌ ఆగస్టు 2022న తిరిగి పరిచయం చేసింది. మారుతి మినీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సరసమైన ధర వద్ద అందుబాటులో ఉంది. 


ఇటీవలి కాలంలో మారుతి సుజుకి రీకాల్‌ల ద్వారా వాహన లోపాలను పరిష్కరించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ విధానం బ్రాండ్‌పై మరింత నమ్మకాన్ని కొనసాగిస్తుంది. రీకాల్ ప్రక్రియలో ప్రభావితమైన కస్టమర్‌ల వెహికిల్స్‌ని నేరుగా సంప్రదించడం లేదా దానికి తగిన విధంగా తీసుకోవాల్సిన అంశాలపై సలహా ఇవ్వడం వంటివి ఉంటుంది.


గతంలోనూ రీకాల్
మారుతి సుజుకి ఇండియా ఈ ఏడాదిలో ఇతర మోడళ్లను సైతం కూడా రీకాల్ చేసింది. జూలైలో స్టీరింగ్ టై రాడ్‌లో సమస్య కారణంగా 87,599 యూనిట్ల S-ప్రెస్సో, ఈకో (Eeco) మోడల్‌లను రీకాల్ చేశారు. అలాగే మార్చిలో ఫ్యూయల్ పంప్ మోటార్ సమస్య కారణంగా 11,851 బాలెనో యూనిట్లు మరియు 4,190 వ్యాగన్ఆర్ యూనిట్లను రీకాల్ చేశారు.


Also Read: మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసిన మారుతి - ఎలా ఉందో తెలుసా?


మారుతి ఆల్టో కె10 వివరాలు
మారుతి ఆల్టో కె 10 Std, LXi, VXi, and VXi Plus అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్లలో LXi మరియు VXi ట్రిమ్స్‌ సీఎన్‌జీ కిట్ ఆప్షన్‌తో వస్తాయి. ఈ కారు 1-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 67 ps శక్తిని, 89 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో జతచేశారు.  సీఎన్‌జీ వేరియంట్స్‌ 57 ps, 82 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. సీఎన్‌జీ వేరియంట్లో ఐడిల్ ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది.



ఈ కారు మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ స్పీడ్ బ్లూ, ప్రీమియం ఎర్త్ గోల్డ్, పెర్ల్ మిడ్నైట్ బ్లాక్, సాలిడ్ వైట్ అనే ఏడు మోనోటోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 214 లీటర్ల బూట్ స్పేస్‌ కూడా ఉంది. పెట్రోల్‌ వేరియంట్‌ 24.39 కిలోమీటర్లు, సీఎన్‌జీ 33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారు ధరలు 3.99 లక్షల నుంచి 5.96 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది.


Also Read: మనదేశంలో ఖరీదైన స్కూటీలు ఇవే - ఏకంగా రూ.14 లక్షల వరకు!