Maruti Nexa Discounts November 2025: ఈ నవంబర్ నెలలో, Maruti Suzuki తన ప్రీమియం Nexa లైనప్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దసరా–దీపావళి ఆఫర్ల తర్వాత కూడా తగ్గని డిమాండ్‌ను కొనసాగించేందుకు కంపెనీ మరింత ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌ను ఈ నెలలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా Grand Vitara, Fronx, Jimny, Ignis, Baleno, XL6 వంటి పాపులర్ మోడళ్లపై మంచి డిస్కౌంట్లు ఉండటంతో, కార్ కొనాలని చూస్తున్న వారికి ఇది బెస్ట్ టైమ్‌గా మారింది.
Maruti Grand Vitaraపై నవంబర్‌లో అతి పెద్ద ఆఫర్లు
Maruti Grand Vitaraపై ఈ నెలలో అతిపెద్ద డిస్కౌంట్ లభిస్తోంది. హైబ్రిడ్ వెర్షన్‌పై మొత్తం రూ.2.1 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో కాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బెనిఫిట్, అప్‌గ్రేడ్ బోనస్ వంటి ఆఫర్లు ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్లపై కూడా రూ.1.75 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. CNG మోడళ్లపై రూ.94,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం Grand Vitara ధరలు రూ.10.77 లక్షల నుంచి రూ.19.72 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Invictoపై మెగా బెనిఫిట్స్
Invicto Alpha+ వేరియంట్లపై రూ.1.4 లక్షల వరకు భారీ ఆఫర్లు ఉన్నాయి.Zeta+ వేరియంట్లపై రూ.1.15 లక్షల వరకు బెనిఫిట్స్ వర్తిస్తాయి.ఈ MPV, Innova Hycrossకు బ్యాడ్జ్–ఇంజినీర్డ్ ట్విన్‌గా మార్కెట్‌లో ఉంది.ధరలు రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Fronxపై నవంబర్ స్పెషల్ డీల్స్
Fronx Turboపై మొత్తం రూ.78,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.ఈ మొత్తంలో రూ.43,000 విలువైన Velocity యాక్సెసరీస్ కూడా వస్తాయి.పెట్రోల్ వేరియంట్‌పై రూ.25,000 వరకు, CNGపై రూ.15,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.ధరలు రూ.6.85 లక్షల నుంచి రూ.11.98 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Jimnyపై క్యాష్ డిస్కౌంట్
Jimny Alpha Pro వేరియంట్‌పై రూ.75,000 వరకు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ ఉంది.Zeta Proపై ఏ ఆఫర్లు లేవు.ప్రస్తుతం Jimny ధరలు రూ.12.32 లక్షల నుంచి రూ.14.45 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Ignisపై మంచి ఆఫర్లు
AMT మోడళ్లపై రూ.57,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.మాన్యువల్ వేరియంట్లపై రూ.52,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.ధరలు రూ.5.35 లక్షల నుంచి రూ.7.42 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Balenoపై నవంబర్ బెనిఫిట్స్
Balenoపై మొత్తం రూ.47,000 వరకు ఆఫర్లు ఊరిస్తున్నాయి.AMT వేరియంట్లపై గరిష్ట బెనిఫిట్స్ వర్తిస్తాయి.CNG & మాన్యువల్ మోడళ్లపై రూ.42,000 వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.ధరలు రూ.5.99 లక్షల నుంచి రూ.9.10 లక్షల వరకు ఉన్నాయి.
Maruti XL6పై ప్రత్యేక ఆఫర్లు
XL6 CNGపై పెట్రోల్ కంటే ఎక్కువ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.మొత్తం రూ.45,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.పెట్రోల్‌పై రూ.20,000 వరకు ఆఫర్ వర్తిస్తుంది.ధరలు రూ.11.52 లక్షల నుంచి రూ.14.48 లక్షల వరకు ఉన్నాయి.
ఈ ఆఫర్లు నగరం, స్టాక్ ఆధారంగా మారతాయని మారుతి సుజుకీ స్పష్టం చేసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.