Maruti Fronx SUV | మీరు రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి మంచి మైలేజీతో పాటు తక్కువ ఖర్చు ఉండే ఏదైనా SUV కోసం చూస్తున్నారా.. అయితే మీకు మారుతి ఫ్రాంక్స్ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. ఈ కారు పెట్రోల్, సిఎన్‌జి (CNG) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మారుతి ఫ్రాంక్స్ ధర, మైలేజీ, పూర్తి ఫీచర్లు తెలుసుకున్నాక మీరు ఓ అభిప్రాయానికి రావాలి. 

మారుతి ఫ్రాంక్స్ ధర ఎంత?మారుతి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 6.85 లక్షలకు ప్రారంభం కాగా, టాప్ వేరియంట్ వరకు రూ. 11.98 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఫ్రాంక్స్‌లో ప్రీమియం ఫీల్, తక్కువ రన్నింగ్ కాస్ట్, మంచి స్పేస్ లభిస్తాయి.

మారుతి ఫ్రాంక్స్ తన స్టైలిష్, ప్రీమియం ఇంటీరియర్‌తో కస్టమర్లకు ఆకట్టుకుంటోంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో,  ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే 9-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్  మరింత స్మార్ట్‌గా మార్చడానికి ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి కారు పవర్ ఎలా ఉంది?మారుతి ఫ్రాంక్స్ 2 వేర్వేరు పెట్రోల్ ఇంజన్లు, CNG ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2L K-సిరీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజన్‌తో పాటు 1.0L టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇచ్చారు. ఈ SUVని 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ 2 ఇంజన్లు BS6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలను పాటిస్తాయి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో నడుస్తాయి. దీనివల్ల పెట్రోల్ ఆదా అవ్వడమే కాకుండా పనితీరు కూడా స్మూత్‌గా ఉంటుంది.

ఈ కారు తన సెగ్మెంట్‌లో అద్భుతమైన మైలేజీని ఇచ్చే కారు. ARAI ప్రకారం, దీని 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 21.79 కిలోమీటర్లు, 1.2 లీటర్ పెట్రోల్ AMT వేరియంట్ 22.89 kmpl మైలేజీతో నడుస్తుంది. 1.2 లీటర్ CNG వేరియంట్ మైలేజీ 28.51 km/ kg గా ఉంది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అయితే లీటరకు 21.5 కిలోమీటర్లు, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 20.01 kmpl మైలేజీని అందిస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, పెట్రోల్ + CNG బై-ఫ్యూయల్ మోడల్ ఫుల్ ట్యాంక్‌పై గరిష్టంగా 1200 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇవ్వడంతో వెయ్యి కిలోమీటర్ల జర్నీ కోసం ఈ కారు తీసుకెళ్తారు. 

సేఫ్టీ ఫీచర్లు: మారుతి ఫ్రాంక్స్‌లో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్ వేరియంట్లలో), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్‌ హోల్డ్ అసిస్ట్, ABSతో కూడిన EBD వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

డిజైన్: ఇది మారుతి గ్రాండ్ విటారా ను పోలి రూపొందించిన కూపే లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. మార్కెట్లో ఈ కారు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తోంది.

 మారుతి సుజుకికి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా దీని మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ లభ్యత చాలా సులభం.