మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా (Maruti e Vitara) కోసం ఎదురుచూపులు ముగియనున్నాయి. మారుతి సుజుకీ కంపెనీ చాలాకాలం నుండచి ఎదురుచూపుల తర్వాత తమ మొదటి ఎలక్ట్రిక్ కారు e-Vitara ను విడుదల చేయడానికి సన్నద్ధమైంది. మారుతి కంపెనీ ఈ మోడల్‌ను మొదటిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. తాజాగా ఈ కారు డిసెంబర్ 2025 లో మార్కెట్లోకి రానుందని నిర్ణయించారు. కంపెనీ దీనిని ఒక ప్రత్యేక ప్రయోజనమైన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేసింది. ఇది మొదటి నుంచి ఎలక్ట్రిక్ కారు రూపంలోనే డిజైన్ చేశారు. ఇది పెట్రోల్ మోడల్ కు చెందిన ఎలక్ట్రిక్ మార్పిడి కారు మాత్రం కాదు.
మారుతి e-Vitara ఎలా ఉంది?
మారుతి e-Vitara ఆకారం దీనిని సమతుల్యమైన, ఆచరణాత్మకమైన SUV గా మార్చుతుంది. ఈ విటారా పొడవు 4275 మిమీ, వెడల్పు 1800 మి.మీ, వీల్‌బేస్ 2700 మి.మీ. దీని డిజైన్ సాంప్రదాయ మారుతి SUV శైలితో ఆధునిక, ఫ్యూచర్ డిజైన్ అందిస్తుంది. ఈ కారు ఉత్పత్తి గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ప్రారంభించారు. ఇక్కడ నుంచి మారుతి అనేక గ్లోబల్ మోడళ్లను ఎగుమతి చేస్తుంది. కంపెనీ e-Vitara కోసం పెద్ద ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే దీనిని 100 దేశాలకు పైగా ఎగుమతి చేస్తున్నారు.
మారుతి e-Vitara బ్యాటరీ, రేంజ్
మారుతి e-Vitara భారతదేశంలో 2 బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో 49 kWh, 61 kWh తో రానుంది. టాప్ వేరియంట్ రేంజ్ సుమారు 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు, ఇది ఈ విభాగంలో అత్యధిక రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ SUV లలో ఒకటి అని చెప్పవచ్చు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. దీనివల్ల బ్యాటరీని తక్కువ సమయంలో 80% వరకు ఛార్జింగ్ అవుతుంది. e-Vitara సిటీ రోడ్లతో పాటు రహదారి ప్రయాణం రెండుంటికీ అద్భుతమైన పనితీరును అందించగలదని కంపెనీ తెలిపింది.
మారుతి e-Vitara ఇప్పటివరకు అత్యధిక ఫీచర్లతో కూడిన SUV గా మారనుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉంటాయి. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS స్థాయి 2 డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తో సహా), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. అదనంగా ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
మారుతి e-Vitara ధర ఎంత?
మారుతి సుజుకి e-Vitara కంపెనీ ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఉత్పత్తిగా మారనుంది. SUV Grand Vitara కారు, Victoris కంటే ఎక్కువ స్థానంలో నిలుస్తుంది. కానీ ధర గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ దీని ప్రారంభ ధర 25 లక్షల నుండి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ధరకు e-Vitara హ్యుందాయ్ Creta EV కారు, Tata Curvv EV కారు, Mahindra XUV400 Pro కారు, MG ZS EV వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUV లతో పోటీపడుతుంది.