ప్రపంచంలో అదిపెద్ద కార్ల మార్కెట్‌లలో భారత్ ఒకటి. సెప్టెంబర్ 2025లో చాలా పెద్ద కంపెనీలు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భారత బ్రాండ్ల నుంచి విదేశీ కంపెనీల వరకు చాలా మోడల్స్ ఉన్నాయి. Maruti Escudo SUV నుంచి VinFast VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ కార్ల వరకు.. Mahindra Thar ఫేస్‌లిఫ్ట్ నుంచి Volvo EX30 మోడల్ కారు వరకు అనేక కొత్త డిజైన్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
మారుతి సుజుకీ - Maruti Suzuki Escudo
మారుతి సెప్టెంబర్ 3న తన కొత్త కారు మోడల్ SUV Escudo ని రిలీజ్ చేయబోతోంది. దీనిని Brezza, Grand Vitara మధ్య ఉంచుతారు. ఈ SUVలో పెట్రోల్, హైబ్రిడ్, CNG లాంటి 3 ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల రూపాయలు ప్రారంభ ధర ఉండవచ్చు. పవర్‌ఫుల్ ఫీచర్లు, చవకైన ధరలు దీనిని Hyundai Creta కారు, Tata Nexon వంటి SUVలకు నేరుగా పోటీలో నిలబెడతాయి.
Citroen Basalt X
సెప్టెంబర్ 5న Citroen Basalt X భారత మార్కెట్లోకి వస్తుంది. ఇది Basalt SUVలలో ప్రీమియం వేరియంట్ అవుతుంది. ఇందులో ఎక్కువ ఫీచర్లు, X బ్యాజింగ్ మీరు చూడవచ్చు. సుమారు 12.75 లక్షల రూపాయలు దీని ప్రారంభ ధర ఉండవచ్చు. కూపే-స్టైల్ డిజైన్, ఆధునిక ఫీచర్లు ప్రత్యేకంగా యువతను ఆకర్షించనున్నాయి.
వియత్నం బ్రాండ్ కార్లు VinFast VF6, VF7
సెప్టెంబర్ 6న వియత్నానికి చెందిన బ్రాండ్ VinFast భారతదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుంది. దీని నుంచి మొదట VF6, VF7 ఎలక్ట్రిక్ SUVలు భారత మార్కెట్లోకి రానున్నాయి. VF6 కారులో 59.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది సింగిల్ మోటార్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. దీని అంచనా ధర రూ.20 లక్షలు ఉండవచ్చు. VF7 ఒక పెద్ద, బిగ్ ప్రీమియం SUV, ఇందులో 75.3 kWh బ్యాటరీ ప్యాక్ తో పాటు సింగిల్, డ్యూయల్ మోటార్ (AWD) ఆప్షన్ ఉన్నాయి. దాంతో మీరు ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని ప్రారంభ ధర సుమారు 25 లక్షల రూపాయలు. ఈ SUVలు టాటా Harrier EVతో పాటు Mahindra XEV 9e వంటి కార్లకు పోటీ ఇస్తుంది.
మహీంద్ర థార్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Thar Facelift)
Mahindra సెప్టెంబర్ నెలలో తన ఆఫ్-రోడర్ SUV Thar (3-డోర్) ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇందులో డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. అయితే ఇంజిన్ ఆప్షన్లు గతంలోలాగే ఉంటాయి. దీని ధర సుమారు రూ.11.75 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.
వోల్వో కారు (Volvo EX30)
లగ్జరీ విభాగంలో Volvo EX30 మోడల్ కారు సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి రానుంది. ఇది కంపెనీ యొక్క ఎంట్రీ-లెవెల్ EV కానుంది. ఇందులో 69 kWh బ్యాటరీ ప్యాక్, దాదాపు 480 కిమీ రేంజ్ ప్రయాణించవచ్చు. ఈ EV సుమారు రూ.40 లక్షల ప్రారంభ ధరతో విడుదల కావచ్చు. ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్ తీసుకొస్తున్నారు.