Maruti Ertiga CNG Price And Finance Options: మారుతి ఎర్టిగా CNG కొత్త తరం మోడల్‌ స్టైలిష్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌లాంప్స్‌ & క్రోమ్‌ టచ్‌ ఉన్న గ్రిల్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్మూత్‌ సైడ్‌ బాడీ లైన్స్‌ & 15-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. రియర్‌లో LED టెయిల్‌లాంప్స్‌ & క్లీన్‌గా డిజైన్‌ చేసిన బంపర్‌ ఆధునికత హంగులను ప్రదర్శిస్తాయి. ఓవరాల్‌గా, ఇది ప్రాక్టికల్‌ MPV అయినప్పటికీ కూడా స్టైల్‌లో ఎటువంటి రాజీ పడలేదు.


ముఖ్యంగా, మారుతి సుజుకి ఎర్టిగా, అందుబాటు ధరలో వచ్చే కుటుంబ కారుగా ప్రసిద్ధి చెందింది. మీకు ఈ కారు కావాలనుకుంటే, సరిపడా డబ్బు లేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఎర్టిగాను కొనుగోలు చేయవచ్చు. కార్‌ లోన్‌ తీసుకున్నాక నెలకు కొంత మొత్తం EMI రూపంలో మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి కట్‌ అవుతుంది. ఎన్నేళ్ల టెన్యూర్‌కు ఎంత EMI కట్ అవుతుందో ముందుగా మీరు తెలుసుకోవాలి. 


మారుతి ఎర్టిగా CNG ధర ఎంత? 
తెలుగు రాష్ట్రాల్లో మారుతి సుజుకి ఎర్టిగా CNG ధర ఎక్స్-షోరూమ్ రూ. 11.16 లక్షలు. మీరు ఈ కారును హైదరాబాద్‌లో కొనుగోలు చేయాలనుకుంటే, ఈ కారు కోసం దాదాపు రూ. 1.98 లక్షల RTI ఫీజు & దాదాపు రూ. 55,000 బీమా మొత్తాన్ని చెల్లించాలి. దాదాపు రూ. 12,000 అదనపు ఛార్జీ కూడా ఉంది. ఈ విధంగా, హైదరాబాద్‌లో ఎర్టిగా CNG మొత్తం ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.80 లక్షలు అవుతుంది. విజయవాడలో ఆన్‌-రోడ్‌ రేటు దాదాపు రూ. 13.79 లక్షలు అవుతుంది. 


ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి? 
మీరు ఎర్టిగా CNG హైదరాబాద్‌లో కొనుగోలు చేయాలంటే, రూ. 13.80 లక్షల ఆన్-రోడ్ ధరపై కనీసం రూ. 2.65 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. డౌన్‌ పేమెంట్‌ పోను మిగిలిన రూ. 11.15 లక్షలకు కారు లోన్ తీసుకోవాలి. 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో బ్యాంక్‌ ఈ లోన్‌ మంజూరు చేసిందని అనుకుంటే...



  • నెలకు రూ. 17,947 EMI చెల్లిస్తే 7 సంవత్సరాల్లో మీ లోన్‌ మొత్తం తీరిపోతుంది. ఈ ఏడేళ్లలో మీరు మొత్తం రూ. 3,92,048 వడ్డీ కడతారు.

  • నెలకు రూ. 20,107 EMI చెల్లిస్తే 6 సంవత్సరాల్లో మీ లోన్‌ మొత్తం తీరిపోతుంది. ఈ ఆరేళ్లలో మీరు మొత్తం రూ. 3,32,204 వడ్డీ కడతారు.

  • నెలకు రూ. 23,155 EMI చెల్లిస్తే 5 సంవత్సరాల్లో మీ లోన్‌ మొత్తం తీరిపోతుంది. ఈ ఐదేళ్లలో మీరు మొత్తం రూ. 2,73,800 వడ్డీ కడతారు.

  • నెలకు రూ. 27,759 EMI చెల్లిస్తే 4 సంవత్సరాల్లో మీ లోన్‌ మొత్తం తీరిపోతుంది. ఈ నాలుగేళ్లలో మీరు మొత్తం రూ. 2,16,932 వడ్డీ కడతారు.


బ్యాంక్‌ రుణ మొత్తం, వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ విధానంపై ఆధారపడి ఉంటాయి. డీలర్‌షిప్‌, నగరాన్ని బట్టి వాహనం ధరలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు.


మారుతి సుజుకి ఎర్టిగా CNG మైలేజ్‌ & ఇంజిన్‌
ఎర్టిగా CNG వేరియంట్ కిలోకు దాదాపు 26.11 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఇంజిన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది &స్మూత్‌ డ్రైవ్‌ అందిస్తుంది. 


ఈ 7 సీట్ల ఫ్యామిలీ కారు 1462 cc ఇంజిన్‌ నుంచి శక్తి పొందుతుంది, గాలితో పందెం వేసినట్లుగా పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 101.64 bhp పవర్‌ను & 136.8 Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది.