Maruti Ertiga 2025: భారతీయ ఎంపీవీ మార్కెట్‌ లీడర్‌గా ఎదిగేందుకు మారుతి సరికొత్త వ్యూహంతో వచ్చింది. ఈ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఎర్టిగాకు సరికొత్త హంగులు అద్దింది. ఇలా నూతన అప్‌డేట్స్‌తో తీసుకొచ్చిన న్యూ మోడల్ కారు షోరూమ్‌లలో దర్శనమిస్తోంది. ప్రయాణికుల సౌకర్యంతోపాటు వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అనేక ఫీచర్స్‌ను మారుతి ఎర్టిగాలో అప్‌డేట్ చేశారు. ఆ వివరాలుని ఇక్కడ చూద్దాం. 

మారుతి ఎర్టిగా సైజ్‌ను కాస్త పెంచారు. దాని పొడవు 40 ఎంఎం పెంచారు. ఇప్పుడు పొడవు 4,435 ఎంఎం అన్నమాట. ఎర్టిగా అవుట్‌ లుక్‌ ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేసింది మారుతి. టెయిల్ ల్యాంప్‌లు, కొత్త టెయిల్‌ గేట్‌, వెనుక క్వార్టర్ ప్యానెల్‌ అమర్చింది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన కొన్ని ఫీచర్స్‌ను అలానే ఉంచింది. వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఫ్రంట్‌ గ్రిల్‌ డిజైన్, లైటింగ్ సెటప్‌ ఓల్డ్ ఎర్టిగా మాదిరిగానే ఉంచారు. 

ఇంటీరియర్‌లో చేసిన అప్‌డేట్స్ ఇవే 

మారుతి ఎర్టిగాలో ఇంటీరియర్‌లో మొదట చేసిన మార్పు ఎయిర్‌ బ్యాగ్‌లు. ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వస్తున్నాయి. దీంతో ప్రయాణం చేసే వారి భద్రతపై మరింతగా శ్రద్ధ పెట్టినట్టు అయ్యింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఎర్టిగాలో బేసిక్‌ వేరియంట్‌లో రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉంటే టాప్ ఎండ్‌ కారులో నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు.

ఇప్పటి వరకు టాప్‌ ఎండ్‌ వేరియెంట్‌లో ఉండే టీపీఎంఎస్‌ అంటే టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్ సిస్టమ్‌ ఇప్పుడు అన్ని మోడల్స్‌లో అందుబాటులో ఉంది. 7 సీట్లు 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌లతో వస్తోంది. మధ్యలో ఉండే ప్రయాణికులకు ల్యాప్‌ బెల్ట్ ఉంది.

ఎర్టిగా ఏసీ సెటప్‌లో కూడా మారుతి మార్పులు చేర్పులు చేసింది. అందరికీ సమానంగా ఏసీ తగిలేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మోడల్ రెండు, మూడో వరుసకు గాలిని ప్రసరించే రూఫ్‌ మౌంటెడ్‌ ఏసీ వెంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త మోడల్‌లో సెంటర్‌ కన్సోల్‌లో రెండువ వరుస ఏసీ వెంట్‌లు అమర్చారు. దీంతో అందరికీ గాలి తగులుతుంది. ఏసీ వెంట్‌ కింద ఉన్న టైప్ సీ ఛార్చింగ్ పోర్ట్‌లు కూడా ఇచ్చారు. వాటిని వాడుకోవచ్చు.మూడో వరసులో కూర్చున్న వారి కోసం ఏసీ వెంట్‌ అమర్చారు. దీంతో వారికి ఉక్కపోత లేకుండా ప్రయాణం చేయవచ్చు. అక్కడ కూర్చున్న వాళ్లు కూడా ఛార్జింగ్ పెట్టుకునేందుకు రెండు టై్ సీ యూఎస్‌బీ పోర్ట్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇది కేవలం ZXi, ZXi+ వేరియెంట్స్‌లో మాత్రమే లభ్యమవుతోంది. 

టాప్‌మోడల్స్‌లో పీఎం 2.5 ఫిల్టర్‌ అమర్చారు. రెండో వరుసలో మధ్యలో కూర్చున్న వ్యక్తికి ఇబ్బంది లేకుండా హెడ్‌రెస్ట్‌ కూడా ఉంటుంది.మిగతా ఫీచ్స్ అంటే 7 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆర్కామిస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, అండ్ ఆపిల్‌ కార్‌ ప్లే, కలర్‌ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో ఎంఐడీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత మోడల్స్‌లో ఉన్నట్టుగానే ఉంచారు.      

సెక్యూరిటీ కిట్‌లో ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ హిల్ హోల్డ్‌, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్‌తో ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్లు, పార్కింగ్ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి. టాప్ వేరియెంట్‌లలో సుజుకి కనెక్ట్‌ ద్వారా కూడా చాలా కనెక్టివిటీ ఫీచర్లు జోడించారు. 

ఇతర ఫీచర్ల 

మారుతి ఎర్టిగా 2025లో ఇప్పటికే ఉన్న 1.5 లీటర్ల K15C స్మార్ట్ హైబ్రీడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 103 పీఎశ్‌, 139ఎన‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో ఐదు స్పీడ్‌ మాన్యువల్‌, ఆరు స్పీడ్‌  AT ఉన్నాయి. ఎర్టిగా సీఎన్జీ 87 పీఎస్‌, 121.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది.