Maruti e Vitara Launch Date Price Features: మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు, ఈ-విటారా కోసం దేశవ్యాప్తంగా కారు ప్రేమికులు, అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు దగ్గరలోకి వచ్చింది. ఇప్పుడు, మారుతి ఈ-విటారా లాంచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కారు SUV విభాగంలోకి వస్తుంది & కంపెనీ దీనిని "ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025"లో ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ SUV ఈ సంవత్సరం చివరిలో, అంటే డిసెంబర్ 2025 లో షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారును గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.        

Continues below advertisement

మారుతి ఇ-విటారా మోడ్రన్‌ ఫీచర్లుమారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ప్రీమియం కారుగా తీర్చిదిద్దడానికి ఈ కంపెనీ చాలా మోడ్రన్‌ ఫీచర్లను అందిస్తోంది. హెడ్‌లైట్లు, DRLs & టెయిల్‌ల్యాంప్‌లు అన్నీ ఫుల్‌ LED ప్యాక్‌లో రావచ్చు. ఈ SUVలో 18-అంగుళాల చక్రాలు & యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ కూడా ఉంటాయి, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని, అదే సమయంలోనే మైలేజ్‌ను మెరుగు పరుస్తుంది. ఇంకా... పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు ఉంటాయి. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.    

మారుతి ఇ-విటారా బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లుఈ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది, అవి: 48.8 kWh బ్యాటరీ ప్యాక్ & 61.1 kWh బ్యాటరీ ప్యాక్. బిగ్‌ బ్యాటరీ ప్యాక్‌ (61.1 kWh) తో ఈ కారు 500 కి.మీ. పైగా డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుందని కంెపనీ క్లెయిమ్ చేస్తోంది. అయితే, వాస్తవ పరిధి అనేది డ్రైవింగ్ శైలి & ట్రాఫిక్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.     

Continues below advertisement

మారుతి ఇ-విటారా భద్రతలుమారుతి ఇ-విటారా చాలా సేఫ్టీ ఫీచర్లతో ‍‌(Maruti e Vitara Safety Features) వస్తుందని భావిస్తున్నారు. లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రత సాంకేతికతలను చేర్చవచ్చు. SUV డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉండవచ్చు. ఇ-విటారాలోని ఇతర భద్రతా లక్షణాలలో బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా & ముందు - వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.  

మారుతి ఇ-విటారా ధరమారుతి సుజుకి ఇ-విటారా ధర ₹17-18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని (Maruti e Vitara Price) అంచనా. టాప్-స్పెక్ వేరియంట్ ధర ₹25 లక్షల వరకు ఉండవచ్చు.