Maruti e Vitara Launch Date: చాలా కాలం ఎదురు చూపుల తర్వాత ఎట్టకేలకు ముహూర్తం దగ్గరకు వచ్చింది. కామన్‌ మ్యాన్‌ కార్ల కంపెనీ మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కారు ఇంకొన్ని రోజుల్లో, అంటే సెప్టెంబర్ 3, 2025న లాంచ్‌ అవుతుంది. లాంచ్‌ కంటే ముందే, ఇ-విటారా ప్రొడక్షన్‌ ఆగస్టు 26, 2025 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ-విటారాను మొదటిసారిగా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. 

మారుతి ఇ-విటారా డిజైన్ ఎలా ఉంటుంది?మారుతి ఇ-విటారా డిజైన్ మోడ్రన్‌ & స్పోర్టీ లుక్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, Y-ఆకారపు LED DRLs, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ క్లాడింగ్ & 18-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 

కారు లోపలి భాగం ఎలా ఉంది? e-Vitara ఇంటీరియర్‌లో..  డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్ & డ్యూయల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ సెటప్‌ను ఉంటుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. దీర్ఘచతురస్రాకార ఎయిర్ వెంట్స్, ఆటో-డిమ్మింగ్ IRVM, సెమీ-లెథరెట్ సీటింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ & వైర్‌లెస్ ఛార్జింగ్ స్టేషన్ వంటి ఫీచర్లు కూడా ఇ-విటారాలో అందించవచ్చు.

మారుతి ఇ-విటారాకు ప్రీమియం అప్పీల్‌ ఇవ్వడానికి పనోరమిక్ సన్‌రూఫ్, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఏర్పాటు చేస్తారని టాక్‌. భద్రత పరంగా, ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా & ADAS ప్యాకేజీ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

బ్యాటరీ ఎంపికలుఈ ఎలక్ట్రిక్‌ కారులో కీలకమైన బ్యాటరీ ఎంపికల దగ్గరకు వస్తే.. e-Vitara ను 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందించవచ్చు. 49 kWh బ్యాటరీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది, 142 bhp పవర్ & 193 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్‌ చేస్తే 344 కి.మీ. వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ ఇవ్వగలదు. 61 kWh బ్యాటరీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ & ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ వేరియంట్ 426 కి.మీ. వరకు ప్రయాణించగలదు, 171 bhp పవర్ & 193 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటారును కలిగి ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ 181 bhp పవర్ & 307 Nm టార్క్ ఇస్తుంది, ఇది 395 కి.మీ. వరకు ప్రయాణించగలదని భావిస్తున్నారు.  

మారుతి ఇ-విటారా కారు ఛార్జింగ్ పరంగా కూడా చాలా సులభంగా ఉంటుంది. 49 kWh బ్యాటరీ 7 kW AC ఛార్జర్‌తో దాదాపు 6.5 గంటల్లో & 11 kW ఛార్జర్‌తో 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 61 kWh బ్యాటరీ 7 kW ఛార్జర్‌తో తొమ్మిది గంటలు & 11 kW ఛార్జర్‌తో 5.5 గంటల్లో ఛార్జ్‌ అవుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించినప్పుడు ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతాయి.