Maruti Celerio GST Discount After GST Cut: 2025 GST సంస్కరణల తర్వాత (GST 2.0), సబ్-4 మీటర్ SUV లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ 3, 2025న కేంద్ర ప్రభుత్వం కొత్త GST స్లాబ్‌ను ఆమోదించింది, ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త శ్లాబ్‌కు అనుగుణంగా మారుతి సెలెరియో రేటు భారీగా తగ్గింది. 

మారుతి సెలెరియో రీసెంట్‌ వెర్షన్‌ స్టైలిష్‌గా, యువతరాన్ని ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. ముందుభాగంలో షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, కొత్త గ్రిల్‌ డిజైన్‌ కారు ఆకర్షణను పెంచుతున్నాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో కాంపాక్ట్‌ బాడీతో పాటు డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ కారుకు ట్రెండీ లుక్‌ ఇస్తుంది. వెనుక భాగంలో మోడ్రన్‌ టెయిల్‌ల్యాంప్స్‌ & స్లీక్‌ డిజైన్‌ సిటీ డ్రైవ్‌ స్టైల్‌కు సరిపోయే ఫ్రెష్‌ అప్పీల్‌ ఇస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గుతుంది?తెలుగు రాష్ట్రాల్లో, మారుతి సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5,64,000 (Maruti Celerio ex-showroom price, Hyderabad Vijayawada). మరో వారం రోజుల తర్వాత (సెప్టెంబర్ 22 నుంచి) మీరు Maruti Celerio ZXi Plus పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే, 18 శాతం GST ప్రకారం మీకు రూ. 62,000 వరకు తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌ పోను మిగిలినది కొత్త ధర అవుతుంది. అంటే, ఈ పండుగ సీజన్‌లో మీరు ఈ కారును చవకగా కొనుగోలు చేయవచ్చు, మిగిలే డబ్బుతో పండుగను హ్యాపీగా ఎంజాయ్‌ చేయవచ్చు.

మారుతి సెలెరియో పవర్‌ట్రెయిన్సెలెరియోలో 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 66 bhp పవర్ & 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. CNG వేరియంట్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. ఈ కారు సిటీ & హైవే పరిస్థితులలో అద్భుతమైన బ్యాలెన్స్ & పనితీరును అందిస్తుందని టాక్‌. ప్రస్తుత మార్కెట్లో, టాటా టియాగోతో మారుతి సెలెరియో పోటీ పడుతుంది.

మారుతి సెలెరియో మైలేజ్‌కంపెనీ లెక్క ప్రకార, సెలెరియో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 25.24 KMPL, ఆటోమేటిక్ వేరియంట్ 26.68 KMPL & CNG వేరియంట్ 34.43 Km/Kg మైలేజీ ఇస్తుంది. ఈ గణాంకాలను బట్టి, ఈ కారు దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటి అని స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ కారు బాగా ఉపయోగపడుతుంది.

మారుతి సెలెరియో ఫీచర్లు ఫీచర్ల పరంగా, సెలెరియోని దాని ధరతో పోలిస్తే అత్యుత్తమంగా ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు (వేరియంట్‌ను బట్టి), 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ ORVMలు & రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా కూడా ఈ కారు మెరుగ్గా ఉంటుంది.