Maruti Suzuki Celerio EMI Calculator: సొంతకారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కల. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు, నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల వేళ సామాన్యుల తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కోసం వెతుకుతుంటారు. ఈ విభాగంలో మారుతి సుజుకి సంస్థ తిరుగులేదని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు మారుతి సెలెరియో ఒక మంచి ఎంపికగా ఉంటుంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, వినియోగదారులకు ఫైనాన్స్ పరంగా ఉన్న వెసులుబాట్లు, ఆన్‌రోడ్ ధరల వివరాలు మైలేజ్ సామర్థ్యాన్ని తెలుసుకోండి.
హైదరాబాద్‌లో మారుతి సెలెరియో ఆన్‌రోడ్ ధరలు
కారు కొనేముందు ఎక్స్‌షోరూమ్ ధర కంటే ఆన్‌రోడ్ ధరపై స్పష్టత ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులు ఆన్‌రోడ్ ధరలో భాగమవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెలెరియో 8 వేరియంట్‌లలో లభ్యమవుతోంది.
బేస్ వేరియంట్ అయిన మారుతి సెలెరియో ఎల్‌ఎక్స్‌ఐ మాన్యువల్. దీని ఎక్స్ షోరూమ్ ధర 4, 69, 900 కాగా, హైదరాబాద్‌లో అన్ని పన్నులు కలిపి ఆనరోడ్ ధర సుమారు 5,55,000 నుంచి 5,60,000 వరకు ఉంటుంది. మారుతి సెలెరియో వీఎక్స్(మాన్యువల్) ఆన్‌రోడ్ ధ సుమారు 6,14,000 నుంచి 6,18,000 పలుకుతోంది. మారుతి సెలెరియో వీఎక్స్‌ఐ(ఆటోమేటిక్) సిటీ ట్రాఫిక్‌లో సులంభంగా నడపాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. దీని ఆన్‌రోడ్ ధర సుమారు 6, 65, 000 నుంచి 6, 70, 000 రూపాయలుగా ఉంది.
మారుతి సెలెరియో జెడ్‌ఎక్స్‌ఐ మాన్యువల్ ఆన్‌రోడ్ ధర 6,80,000 నుంచి 6,85,000 వరకు ఉంది. మారుతి సెలెరియో వీఎక్స్‌ఐ సీఎన్జీ అత్యధిక పొదుపు కోరుకునే వారికి సీఎన్జీ వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ఆన్‌రోడ్ ధర సుమారు 7, 10, 000 నుంచి 7, 15, 500 వరకు ఉంది. మారుతి సెలరియో జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఏఎంటీ అన్ని హంగులు కలిగిన టాప్ ఎండ్ వేరియంట్. దీని ఆన్‌రోడ్ ధర సుమారు 7, 95, 000 నుంచి 8,02,000 వరకు ఉంటుంది.
50 వేల డౌన్‌పేమెంట్‌తో కారు ఇంటికి ఎలా తీసుకెళ్లాలి?
చాలా మంది వద్ద కారు కొనడానికి సరిపడా మొత్తం ఒకేసారి ఉండకపోవచ్చు. అటువంటి వారికి బ్యాంకులు అందించే ఎల్టీవీ నిష్పత్తి వరంగా మారుతుంది. మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, ఆన్‌రోడ్ ధరలో 85 శాతం నుంచి 90 శాతం వకరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది.
ఉదాహరణకు మీరు సెలెరియో ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ను ఎంచుకుని 50 వేల డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన 5,10,000 మొత్తాన్ని లోన్ రూపంలో పొందవచ్చు. సంవత్సరానికి సుమారు 9 శాతం వడ్డీ రేటు ప్రామాణికంగా తీసుకుంటే వేర్వేరు కాలపరిమితుల్లో ఈఎంఐ లెక్కలు ఇలా ఉంటాయి.
ఏడేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 8,210 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 10, 585 రూపాయలు కట్టాలి. మూడేళ్ల కాలపరిమితికి తీసుకుంటే 16,220 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి.
సెలెరియో మైలేజ్ ఎంత?
సెలెరియో ఇంత విజయవంతం కావడానికి దాని సరికొత్త కే110సి డబుల్ జెట్ ఇంజిన్ ప్రధాన కారణం. 1.0 లీటర్ సామర్థ్యం గల ఇంజిన్ 66 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, సెలెరియో భారతీయ రోడ్లపై సంచలనం సృష్టిస్తోంది. పెట్రోల్ వాహనం లీటరకు 25.24 kmpl నుంచి 26.68kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సీఎన్జీ అయితే కిలో 34.43km/kg మైలేజ్ అందిస్తుంది.
బడ్జెట్ కారు అయినప్పటికీ మారుతి సుజుకీ ఇందులో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. 7 ఇంచ్‌ల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ వేరియంట్లలో హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కారు కొనుగోలు చేసే సమయంలో పండుగ ఆఫర్లు, లేదా కార్పొరేట్ డిస్కౌట్ గురించి డీలర్‌షిప్‌ల వద్ద ఆరా తీయడ మంచిది. దీని వల్ల మీరు 15వేల నుంచి 25వేల వరకు అదనంగా ఆదా చే ఛాన్స్ ఉంది.
