Maruti car offers and discounts September 2026: మారుతి సుజుకి, తన కస్టమర్ల కోసం ఈ నెల (సెప్టెంబర్ 2026)లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. విక్టోరిస్, స్విఫ్ట్, వాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఎస్-ప్రెస్సో & ఈకో కార్లపై వివిధ ప్రయోజనాలను ప్రకటించింది.

Continues below advertisement

Maruti Victoris - రూ.1.35 లక్షల వరకు

మారుతి విక్టోరిస్‌పై ఈ నెలలో అత్యధిక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.50,000 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనం, రూ.35,000 వరకు అదనపు తగ్గింపు, రూ.30,000 లాయల్టీ ప్రయోజనం & రూ.10,000 ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి. పాత కారును స్క్రాప్ చేస్తే ఎక్స్చేంజ్ ప్రయోజనానికి బదులుగా రూ.45,000 వరకు స్క్రాప్ బోనస్ లభిస్తుంది.

Continues below advertisement

విక్టోరిస్ పెట్రోల్ & CNG వేరియంట్లపై రూ.85,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారులో ఎక్స్చేంజ్ బోనస్, అదనపు తగ్గింపు, లాయల్టీ ప్రయోజనం & ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ కలిపి ఈ ప్రయోజనం అందుతుంది.

Maruti Wagon R - రూ.57,500 వరకు

మారుతి వాగన్ ఆర్ పెట్రోల్ వేరియంట్లపై రూ.57,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.10,000 అదనపు తగ్గింపు & రూ.2,500 ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి.

CNG వేరియంట్‌పై రూ.47,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. వాగన్ ఆర్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.24 లక్షల వరకు ఉంది.

Maruti Alto K10 - రూ.52,500 వరకు

మారుతి ఆల్టో K10 LXi పెట్రోల్ వేరియంట్‌పై రూ.52,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.10,000 అదనపు తగ్గింపు & రూ.2,500 ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.42,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. 

CNG వేరియంట్లపై రూ.37,500 వరకు తగ్గింపు ఉంది. ఆల్టో కె10 ధర రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంది.

Maruti Swift - రూ.45,000 వరకు

మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లపై రూ.45,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.10,000 అదనపు తగ్గింపు & రూ.5,000 ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి.

CNG వేరియంట్లపై రూ.30,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. స్విఫ్ట్ ధర రూ.5.84 లక్షల నుంచి రూ.8.74 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: టాటా కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!

Maruti Celerio - రూ.42,500 వరకు

మారుతి సెలెరియోపై అన్ని వేరియంట్లలో కలిపి రూ.42,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లేదా రూ.10,000 స్క్రాప్ బోనస్, రూ.10,000 అదనపు తగ్గింపు & రూ.2,500 ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి.

Maruti Eeco - రూ.42,500 వరకు

మారుతి ఈకో పెట్రోల్ వేరియంట్‌పై రూ.42,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. CNG వేరియంట్‌పై రూ.32,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈకో ధర రూ.5.28 లక్షల నుంచి రూ.6.46 లక్షల వరకు ఉంది.

Maruti S-Presso - రూ.37,500 వరకు

మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్‌పై రూ.37,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.10,000 అదనపు తగ్గింపు & రూ.2,500 ఇన్‌స్టిట్యూషనల్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి. స్క్రాప్ చేస్తే ఎక్స్చేంజ్ బోనస్‌కు బదులుగా రూ.10,000 వరకు స్క్రాప్ బోనస్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి: కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రోడ్డుపై ఎలా ఉంది?

ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నగరం, డీలర్‌షిప్ & స్టాక్‌ను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండొచ్చు. కారు కొనుగోలు చేసే ముందు సమీప మారుతి డీలర్ వద్ద ఖచ్చితమైన ఆఫర్‌ను తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.