మీరు ఫ్యామిలీ కోసం మంచి డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్, బెస్ట్ ఫీచర్లతో వచ్చే కాంపాక్ట్ SUV ని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మారుతి బ్రెజ్జా (Maruti Brezza) మీకు మంచి ఆప్షన్ కావచ్చు. భారత మార్కెట్లో చాలా ఆదరణ పొందిన SUV మారుతి బ్రెజ్జా. ఇది పెట్రోల్‌తో పాటు CNG, మ్యాన్యువల్- ఆటోమేటిక్ 2 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 

Continues below advertisement

మీరు కారును పూర్తి పేమెంట్ చేయకుండా కొంత డౌన్2పేమెంట్ చేసి, EMI ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే ఫైనాన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీతో సుమారు రూ. 2 లక్షలు ఉంటే, మిగిలిన మొత్తాన్ని EMI ద్వారా మీ టర్మ్ వరకు చెల్లించవచ్చు. 

కారు ధర, డౌన్ పేమెంట్

Continues below advertisement

మారుతి బ్రెజ్జా ధర వేరియంట్‌ను బట్టి ఆయా రాష్ట్రాలు, నగరాల్లోనే వేర్వేరుగా ఉంటుంది. బేస్ వేరియంట్ నుంచి ఎక్కువ ఫీచర్లు ఉండే టాప్ వేరియంట్ వరకు దీని ధరలో వ్యత్యాసం ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఎక్స్-షోరూమ్ ధర కాదు, ఆన్ రోడ్ ధర చెక్ చేయాలి. ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఛార్జీలు కూడా జతచేస్తే కారు ఆన్-రోడ్ ధర అవుతుంది. 

మీరు బ్రెజ్జా కొనుగోలు చేయడానికి రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ద్వారా కార్ లోన్  తీసుకోవచ్చు. డౌన్ పేమెంట్ తర్వాత మిగిలిన మొత్తాన్ని లోన్‌లో చేర్చి EMI అంచనా వేస్తారు. లోన్ మొత్తం, EMI అనేవి బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలపరిమితి, క్రెడిట్ ప్రొఫైల్, ఇతర కండీషన్లను బట్టి మారవచ్చు.

ఒకవేళ బ్యాంక్ నుంచి సుమారు 9 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ తీసుకుంటే, EMI అనేది లోన్ మొత్తం, కాలపరిమితిని బట్టి నిర్ణయిస్తారు. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా చెల్లించే EMI తగ్గుతుంది, కానీ వడ్డీ పెరుగుతుంది. తక్కువ కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెలానెలా చెల్లించే EMI పెరిగినా, చెల్లించే వడ్డీ తగ్గుతుంది.

Also Read: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు

ప్రతి నెలా EMI ఎంత చెల్లించాలి

బ్రెజ్జాలోని వేరియంట్ కోసం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే సుమారు రూ. 12.62 లక్షల లోన్‌పై 9 శాతం వడ్డీతో 7 సంవత్సరాలకు నెలకు దాదాపు EMI రూ. 20,318 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కింపు ప్రకారం 7 ఏళ్లలో సుమారు రూ. 4.43 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు. కారుకు అయ్యే ఖర్చును లెక్కించేటప్పుడు డౌన్ పేమెంట్, EMI ని మాత్రమే కాదు లోన్‌పై పడే వడ్డీ కూడా చెక్ చేసుకోవాలి. 

మారుతి బ్రెజ్జాలో వినియోగదారులకు పలు మోడ్రన్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్ప్లే, సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ కోసం కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, హిల్-హోల్డ్ కంట్రోల్, ESP, ISOFIX, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉన్నాయి.  టాప్ వేరియంట్లలో అయితే 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

Also Read: టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

కారు పవర్‌ట్రెయిన్, ఇతర వివరాలు

మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీనిని మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకోవచ్చు. CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ అవసరం, బడ్జెట్‌ను బట్టి పెట్రోల్, CNG, మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ముందు వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను కంపేర్ చేసుకున్న తరువాతే తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థను ఎంచుకోవాలి.