Maruti Brezza Price After GST Cut: ఈ దీపావళికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, కార్లతో సహా అనేక వస్తువులపై GST తగ్గించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి, మన దేశంలోని చిన్న కార్లపై 28% GST & 1% సెస్, అంటే మొత్తం 29% పన్ను విధిస్తున్నారు. దీనిని 18% కు తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే, కస్టమర్లకు 10% ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. మారుతి బ్రెజ్జాపై GST తగ్గిస్తే, ఈ కారు మునుపటి కంటే చాలా చౌకగా మారుతుంది.

మారుతి బ్రెజ్జాపై ఎంత మిగులుతుంది?ఇప్పుడు అందుబాటులో ఉన్న మారుతి Vitara Brezza 2025 ఫేస్‌లిఫ్ట్ మోడల్... స్టైలిష్ లుక్‌, కొత్త ఫ్రంట్ గ్రిల్‌లో గ్లామర్, స్లీక్ LED ల్యాంప్స్, స్పోర్టీ డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్‌తో చాలా ఆధునికంగా కనిపిస్తోంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో (Maruti Brezza ex-showroom price, Hyderabad Vijayawada) రూ. 8,69,000. దీనిని 28% నుంచి 18% GST పరిధిలోకి తగ్గించిన తర్వాత, 1% సెస్‌తో కలుపుకుని (28% - 18% GST + 1% సెస్) 19% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఒకేసారి 10% పన్ను తగ్గుతుంది, కస్టమర్‌ రూ. 64,900 వరకు ప్రయోజనం పొందుతారు.

మారుతి బ్రెజ్జాలో చాలా మోడ్రన్‌ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ & 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. ఈ SUVలో రియర్‌ AC వెంట్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫాస్ట్-ఛార్జింగ్ USB పోర్టులు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా భద్రత పరంగా కూడా చాలా బలమైన ఎంపిక. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ వంటి అధునిక లక్షణాలు ఉన్నాయి. ఇంకా.. EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ & ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా  ఎంజాయ్‌ చేయవచ్చు.

మారుతి బ్రెజ్జా ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 101.6 bhp పవర్‌ & 136.8 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. అదే ఇంజిన్ CNG వేరియంట్‌లో కూడా ఉపయోగించారు, కానీ దీని పవర్ అవుట్‌పుట్ 86.6 bhp & 121.5 Nm వరకు ఉంటుంది.

మారుతి బ్రెజ్జా SUV స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ & ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి సాంకేతికతలతో వచ్చింది, ఇవి దాని ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మారుతి బ్రెజ్జా, తన విభాగంలో, అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన SUVలలో ఒకటి. దీని పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ 19.89 నుంచి 20.15 kmpl మైలేజీని ఇస్తుంది, పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ 19.80 kmpl మైలేజీని ఇవ్వగలదు & CNG వెర్షన్ 25.51 km/kg వరకు మైలేజీని ఇవ్వగలదు.