Mahindra XUV700 SUV Latest News:  మహీంద్రా తమ ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన ఎస్ యూవీ 700కి తుది మెరుగులు దిద్ది, టెస్టింగ్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మొత్తం మోడల్ క‌నిపించ‌క పోయిన‌ప్ప‌టికీ, తాజాగా టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కారుకు సంబంధించిన పిక్స్ హ‌ల్చల్ చేస్తున్నాయి. కొత్త మోడ‌ల్ ఈవీకి సంబంధించిన‌దా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.  మహీంద్రా కంపెనీ ఫేమ‌స్ XUV700 SUV తాజాగా టెస్ట్ మ్యూల్ రూపంలో కనిపించడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎగ్జాస్ట్ పైప్ లేకపోవడంతో ఇది పెట్రో వెర్ష‌న్ కాదని నిపుణులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈ మోడల్‌కు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్ రావచ్చన్న సంకేతాన్ని ఇస్తోంది, ఇది ఆంతర్గ‌త‌ దహన (IC) వేరియంట్లతో పాటు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ కవర్ ఉన్నప్పటికీ, స్పై ఇమేజెస్ ఆధారంగా బయటికి వ‌చ్చిన స‌మ‌చారాన్ని బ‌ట్టి, మరింత పదునైన డిజైన్ లో దీన్ని రూపొందించార‌ని కనిపిస్తుంది. ఇందులో రీడిజైన్ చేసిన మల్టీ-స్లాట్ గ్రిల్, స్లీక్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, మార్పులు చేసిన LED DRLs, బంపర్లు, టెయిల్‌గేట్, టెయిల్ లాంపులు ,కొత్త అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవన్నీ facelift మోడల్‌కు ఆధునిక లుక్ ఇస్తాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అంతర్గతంగా, ఈ కొత్త మోడల్‌లో మూడు విడివిడిగా స్క్రీన్‌లతో కూడిన డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండనుందని తెలుస్తోంది.

కీల‌క మార్పులు..ఈ డిజైన్ లో కీల‌క మార్పులు చేసిన‌ట్లు, బ‌య‌ట‌కు లీక్ అయిన ఇమేజెస్ ను బ‌ట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్యూయల్-స్క్రీన్ సెటప్‌కు బదులుగా, ఇందులో ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, ఒకటి డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం, మరొకటి కో-డ్రైవర్ డిస్‌ప్లే కోసం ఉండే అవకాశం ఉందని స‌మాచారం. ఇది మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ మోడల్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అదనంగా, రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, మరింత మెరుగైన ADAS సిస్టమ్ కూడా ఈ faceliftలో ఉండవచ్చని అంచనా. 

ముందుగా ఆ ర‌కంగా..మహీంద్రా ముందుగా ఫేస్‌లిఫ్ట్ చేయబడిన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) XUV700 మోడల్‌ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అదే డిజైన్ కవర్‌తో కూడిన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడతల వారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మెకానికల్‌గా, ఇందులో ఇప్పటిదాకా ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్ , 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లు కొనసాగే అవకాశం ఉందని స‌మాచారం. అలాగే మాన్యువల్ , ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్ లతో పాటు AWD (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది. ఏదేమైనా మ‌హీంద్రా కొత్త మోడ‌ల్ కు సంబంధించిన లీక్డ్ పిక్స్ కార్ మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి.