Mahindra XUV700 Petrol Vs Diesel Guide: మహీంద్రా XUV700 కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఒక పెద్ద సందేహం ఎప్పుడూ ఉంటుంది - పెట్రోల్ వేరియంట్ తీసుకోవాలా? డీజిల్ వేరియంట్ తీసుకోవాలా? అని. మీ రన్నింగ్, వాడే స్టైల్, ట్రాఫిక్ పరిస్థితులు ఇవన్నీ కలిసి ఏ వేరియంట్ మీకు సరిపోతుందో నిర్ణయిస్తాయి. నెలకు 600–700 కి.మీ. రన్నింగ్, ఇందులో దాదాపు 70% నగరంలోనే డ్రైవింగ్ చేసేవాళ్లు మనలో చాలామంది ఉన్నారు. ఈ సందర్భంలో పెట్రోల్ XUV700నే అనువైన ఎంపికగా ఆటో ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు.
Mahindra XUV700 Petrol ఎందుకు బెస్ట్?
పెట్రోల్ XUV700 ధర డీజిల్‌తో పోలిస్తే తక్కువ. అదే వేరియంట్‌కి డీజిల్ వెర్షన్ దాదాపు ఒక లక్ష రూపాయలకు పైగా ఖరీదు ఎక్కువ. నెల రన్నింగ్ 600–700 కి.మీ. మాత్రమే కావడంతో డీజిల్ ద్వారా వచ్చే మైలేజ్ అదనపు లాభం చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే రికవర్ అవుతుంది. అంటే ఫ్యూయల్ సేవింగ్ కోసం డీజిల్ తీసుకున్నా కూడా ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుంది.
సిటీ డ్రైవింగ్‌లో Diesel ఎందుకు రిస్కీ? (DPF సమస్య)
డీజిల్ కార్లలో ప్రస్తుతం DPF (Diesel Particulate Filter) సిస్టమ్ తప్పనిసరి. ఇది పొగను ఫిల్టర్ చేస్తుంది. కానీ సిటీ డ్రైవింగ్‌లో చిన్న చిన్న దూరాలు, తరచూ బ్రేక్‌లు, తక్కువ స్పీడ్ వలన DPF క్లాగ్ అవ్వడం చాలా సాధారణం. 70% డ్రైవింగ్ నగరంలోనే చేస్తే:
- DPF రీజనరేషన్ తరచూ వస్తుంది
- వాహనం పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది
- వర్క్‌షాప్‌కి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు
- ఈ ఇబ్బందులు పెట్రోల్‌లో ఉండవు.
Mahindra XUV700 కొన్నే ముందు ఒక చిన్న సూచన - ఫేస్‌లిఫ్ట్ వస్తోంది
Mahindra XUV700 Facelift లాంచ్ చాలా దగ్గరలోనే ఉందని సమాచారం. ఫేస్‌లిఫ్ట్‌లో రావొచ్చు అనుకుంటున్న అప్‌డేట్స్:
- కొత్త స్టైలింగ్
- మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
- సస్పెన్షన్‌లో మెరుగుదల
- ఇన్ఫోటైన్‌మెంట్ అప్‌డేట్స్
కొత్త సంవత్సరం (2026) సందర్భంగా, జనవరిలో Mahindra XUV700 కారు కొనాలని అనుకుంటున్నవాళ్లు మరికొన్ని రోజులు ఆగి, కొత్త మోడల్ ఎలా ఉందో చూడటం మంచిది.
మరొక ఆప్షన్ - Mahindra XEV 9S (రాబోయే 7-సీటర్ EV)
నెల రన్నింగ్ 600–700 కి.మీ. మాత్రమే కావడంతో ఎలక్ట్రిక్ వాహనం కూడా ఈ సందర్భానికి సెట్ అవుతుంది.
అప్‌కమింగ్ XEV 9Sలో:
- ఏడు సీట్లు వస్తాయి
- XEV 9Eలో ఉన్నట్లే ఒక్కటే బ్యాటరీ సైజ్ ఉండే అవకాశం
- మంచి రేంజ్
- హోమ్ చార్జింగ్
- చాలా తక్కువ రన్నింగ్ ఖర్చులు
ఈ కారణాల వల్ల, రాబోయే EV కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.
మీ అవసరాలు, రన్నింగ్, నగర వాడకాన్ని దృష్టిలో పెట్టుకుంటే Petrol XUV700 మీకు సరైన ఎంపిక అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.