భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత రెండేళ్లలో భారీగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం, కొరత సైతం అప్పుడప్పుడు కనిపించడం వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తోంది. దాంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను  కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), మహీంద్రా Mahindra XUV400 Pro లలో ఏదో ఒకటి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, 2 కార్లు కాంపాక్ట్ SUV విభాగంలోకి వస్తాయి. ఏ కారు ఎందులో బెటర్, ఎవరు కొంటే ప్రయోజనం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

రెండు కార్ల డిజైన్, లుక్ పరిశీలిస్తే, వాటి శైలి మోడ్రన్, SUV లాగా దృఢంగా ఉంటుంది. టాటా Nexon EV డిజైన్ కొంచెం ఫ్యూచరిస్టిక్, ఆకర్షణీయంగా ఉందని చెబుతారు. అయితే XUV400 Pro లుక్ కొంచెం సింపుల్ గా ఉంటుంది. అయితే మీకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రెండు కార్లలో LED లైట్లు, మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి రోడ్డుపై మిమ్మల్ని అనేలా చేస్తాయి. 

రెండు కార్లలో ఇంటీరియర్

కార్ల ఇంటీరియర్‌లో క్యాబిన్ విషయానికి వస్తే, Nexon EV ఇక్కడ కొంచెం ముందుంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి లాంగ్ జర్నీలకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. మహీంద్రా XUV400 Pro కూడా మంచి స్పేస్, ఫీచర్లను కలిగి ఉంది. కానీ వెంటిలేటెడ్ సీట్లు,  పెద్ద డిస్‌ప్లే వంటి కొన్ని మోడ్రన్ ఫీచర్లు ఇందులో స్ట్రాంగ్‌గా లేవు.

Read Also: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

కార్ల పనితీరు

రెండు కార్లు మంచి పవర్, టార్క్‌ను అందిస్తాయి. మహీంద్రా XUV400 Pro కొంచెం ఎక్కువ శక్తి, వేగవంతమైన టార్క్ వల్ల ఫేమస్ అయింది. అయితే టాటా Nexon EV బ్యాలెన్స్‌డ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ కార్లు సిటీతో పాటు హైవే రెండింటిలోనూ సులభంగా నడుస్తాయి. అయితే మహీంద్రా XUV400 కొంచెం స్పోర్టీ అనుభూతిని ఇస్తుంది.

బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి..

రెండు కార్లు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లు కలిగి ఉంటాయి. టాటా Nexon EV ఎక్కువ వేరియంట్‌లు, ఎక్కువ రేంజ్ కలిగి ఉంది.  ఇది వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్లుగా మోడల్‌ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. XUV400 Pro కూడా మంచి రేంజ్ అందిస్తుంది. కానీ ఆప్షన్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఛార్జింగ్ పరంగా రెండు కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌  కలిగి ఉన్నాయి. 

Also Read: Car Airbag Safety Tips: కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నప్పటికీ ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. బీ అలర్ట్

సేఫ్టీ ఫీచర్లు, ధర

కారు సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, రెండు SUVలు స్ట్రాంగ్ బాడీ, ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. టాటా Nexon EV ఇప్పటికే భద్రత పరంగా నమ్మదగిన వాహనంగా భావిస్తారు. XUV400 Pro కూడా సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. Tata Nexon EV ధర రూ. 14.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మహీంద్రా XUV400 Pro ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.49 లక్షలుగా ఉంది.