Mahindra XUV 7XO Waiting Period: స్టైలిష్‌ లుక్‌, శక్తిమంతమైన ఇంజిన్‌ ఎంపికలు, ఆధునిక ఫీచర్లతో Mahindra XUV 7XO ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్‌ ఉన్న SUVలలో ఒకటిగా మారింది. 2026 జనవరిలో మిడ్‌-సైకిల్‌ ఫేస్‌లిఫ్ట్‌తో కొత్త పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మూడు వరుసల SUVకు 2025 డిసెంబర్‌ 15 నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. 2026 జనవరి 14 నుంచి కస్టమర్‌ డెలివరీలు కూడా మొదలయ్యాయి.

Continues below advertisement

అయితే, మహీంద్రా కొత్త తరం SUVలకు సాధారణంగా ఎక్కువ వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో XUV 7XO బుక్‌ చేసిన తర్వాత ఎంతకాలం వెయిట్‌ చేయాలి? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. డీలర్‌ వర్గాల సమాచారం ప్రకారం... వేరియంట్‌, ఇంజిన్‌ ఎంపికను బట్టి వెయిటింగ్‌ పిరియడ్‌ స్పష్టంగా మారుతోంది.

Mahindra XUV 7XO వెయిటింగ్‌ పిరియడ్‌ వివరాలు - ట్రిమ్‌ వారీగా
 
ట్రిమ్‌
 
టర్బో పెట్రోల్‌ MT FWD
టర్బో పెట్రోల్‌ AT FWD
డీజిల్‌  MT FWD
డీజిల్‌ AT FWD
డీజిల్‌ AT AWD
AX
 
12 నెలలు
-
12 నెలలు
-
-
AX3
 
5 నెలలు
5 నెలలు
5 నెలలు
5 నెలలు
-
AX5
 
5 నెలలు
5 నెలలు
5 నెలలు
5 నెలలు
-
AX7
 
1 నెల
1 నెల
1.5 నెలలు
1.5 నెలలు
-
AX7 Tech
 
-
1 నెల
1 నెల
1 నెల
1 నెల
AX7 Luxury
 
-
4 నెలలు
6 నెలలు
6 నెలలు
6 నెలలు

AX7 Luxury - ఎక్కువ వెయిటింగ్‌

Continues below advertisement

టాప్‌-స్పెక్‌ AX7 Luxury వేరియంట్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. డీజిల్‌ ఇంజిన్‌తో వచ్చే ఈ వేరియంట్‌కు సుమారు 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంది. అదే పెట్రోల్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ తీసుకుంటే దాదాపు 4 నెలలు వెయిట్‌ చేయాల్సి వస్తుంది.

AX7 Tech - తక్కువ వెయిటింగ్‌ ఉన్న బెస్ట్‌ ఆప్షన్‌

ఈ లైనప్‌లో అత్యల్ప వెయిటింగ్‌ పిరియడ్‌ ఉన్న వేరియంట్‌ AX7 Tech. అన్ని ఇంజిన్‌ ఎంపికలకూ దీనికి సుమారు 1 నెల వెయిటింగ్‌ మాత్రమే ఉంది. అయితే AX7 Luxuryతో పోలిస్తే పవర్డ్‌ కో-డ్రైవర్‌ సీట్‌, వెనుక సీట్లకు వెంటిలేషన్‌, రియర్‌ వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌ వంటి కొన్ని ఫీచర్లు ఇందులో ఉండవు.

AX7, AX5, AX3 - ఇంజిన్‌ ఆధారంగా వెయిట్‌

AX7 వేరియంట్‌లో టర్బో పెట్రోల్‌ ఎంచుకుంటే దాదాపు 1 నెల, డీజిల్‌ ఎంచుకుంటే సుమారు 1.5 నెలల వెయిటింగ్‌ ఉంటుంది.

AX5, AX3 వంటి లోయర్‌ మిడ్‌ వేరియంట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో సుమారు 5 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంది.

బేస్‌ వేరియంట్‌ AX - అత్యధిక వెయిటింగ్‌

ఎంట్రీ లెవల్‌ AX వేరియంట్‌కు వెయిటింగ్‌ అత్యధికంగా ఉంది. ఈ వేరియంట్‌ను బుక్‌ చేస్తే దాదాపు 12 నెలలు (ఒక సంవత్సరం) వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

ఇంజిన్‌ 

Mahindra XUV 7XOలో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ (203hp, 380Nm) లేదా 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ (185hp, గరిష్టంగా 450Nm) ఎంపికలు ఉన్నాయి. 6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. డీజిల్‌ ఆటోమేటిక్‌ వేరియంట్లలో AWD ఆప్షన్‌ కూడా AX7 Tech, AX7 Luxuryలో లభిస్తుంది.

ధర వివరాలు

ధర విషయానికి వస్తే Mahindra XUV 7XO ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.13.66 లక్షల నుంచి రూ.24.92 లక్షల వరకు ఉంటుంది. భారత మార్కెట్‌లో ఇది Tata Safari, Hyundai Alcazar, MG Hector వంటి SUVలకు పోటీగా నిలుస్తోంది.

మొత్తానికి, త్వరగా డెలివరీ కావాలంటే AX7 Tech సరైన ఎంపిక. అన్ని ఫీచర్లు కావాలంటే కొంచెం ఎక్కువ వెయిట్‌కు సిద్ధంగా ఉండాల్సిందే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.