Mahindra XUV 7XO Price And Specifications: మహీంద్రా భారత మార్కెట్లో తన ఫ్లాగ్‌షిప్‌ ICE SUVగా Mahindra XUV 7XOను లాంచ్‌ చేసింది. ఇది ప్రధానంగా XUV700 ఫేస్‌లిఫ్ట్‌గా, కొత్త పేరు, కొత్త డిజైన్‌, మెరుగైన ఫీచర్లతో వచ్చింది. ₹13.66 లక్షల నుంచి ₹24.92 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఈ SUV అందుబాటులో ఉంది. అయితే, ఈ ధర వద్ద ఇది నిజంగా విలువైన ఎంపికేనా? XUV 7XOలో ఉన్న ముఖ్యమైన ప్లస్‌లు, మైనస్‌లను ఇప్పుడే తెలుసుకుదాం.

Continues below advertisement

Mahindra XUV 7XO ప్లస్‌లు

పవర్‌ఫుల్‌ ఇంజిన్‌లు

Continues below advertisement

XUV 7XOలో మహీంద్రా ఇప్పటికే నమ్మకమైన ఇంజిన్‌లనే కొనసాగించింది. అవి:

2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ - 203 hp శక్తి

2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ - 185 hp శక్తి

ఈ రెండు ఇంజిన్‌లు 'లో రేవ్స్‌' నుంచే బలమైన పికప్‌ ఇస్తాయి. నగరంలో డ్రైవ్‌ చేయడానికి, హైవేల్లో ఓవర్‌టేక్‌ చేయడానికి కూడా ఈ SUV ఎలాంటి ఇబ్బంది పెట్టదు. రిఫైన్‌మెంట్‌ కూడా చాలా బాగుంది.

స్మూత్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు

XUV 7XOలో...

6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ 

6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ 

ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ షిఫ్ట్‌లు చాలా స్మూత్‌గా ఉంటాయి. మాన్యువల్‌ వేరియంట్‌లో క్లచ్‌ లైట్‌గా ఉండటం వల్ల నగర డ్రైవింగ్‌ ఈజీగా ఉంటుంది. AWD ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

అద్భుతమైన రైడ్‌ క్వాలిటీ

Mahindra ఈ SUVలో కొత్తగా DaVinci డ్యాంపర్స్‌ను ఉపయోగించింది. ఇవి రోడ్డు మీద ఉన్న గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లను చాలా సాఫ్ట్‌గా అబ్జార్బ్‌ చేస్తాయి. 19 ఇంచుల పెద్ద వీల్స్‌ ఉన్నప్పటికీ, లో స్పీడ్‌లో రైడ్‌ చాలా ప్లష్‌గా ఉంటుంది. హైవేల్లో హై స్పీడ్‌ స్టెబిలిటీ కూడా బాగా ఇంప్రెస్‌ చేస్తుంది.

ఫీచర్లలో తగ్గేదే లేదు

XUV 7XOలో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు

ట్రిపుల్‌ 12.3 ఇంచుల స్క్రీన్‌లు

పానోరమిక్‌ సన్‌రూఫ్‌

వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు

6 సీటర్‌ వేరియంట్‌లో కెప్టెన్‌ సీట్లు

లెవల్‌ 2 ADAS

540 డిగ్రీ కెమెరా

16 స్పీకర్‌ హార్మన్‌ కార్డన్‌ ఆడియో సిస్టమ్‌

డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌

ఈ ఫీచర్లు దీన్ని నిజంగా ప్రీమియం SUVగా నిలబెడతాయి.

Mahindra XUV 7XO మైనస్‌లు

మూడో వరుస సీట్లలో స్థలం తక్కువ

మొదటి, రెండో వరుసల్లో కంఫర్ట్‌ చాలా బాగుంటుంది. కానీ మూడో వరుస పెద్దవాళ్లకు అంతగా సరిపోదు. హెడ్‌రూమ్‌ తక్కువగా ఉంటుంది. లెగ్‌ పొజిషన్‌ కూడా మోకాళ్లు పైకి వచ్చేలా ఉంటుంది. పిల్లలకు మాత్రం ఇది సరిపోతుంది.

ఎర్గోనామిక్‌ ఇబ్బందులు

టెక్నాలజీ ఎక్కువ కావడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి.

AC కంట్రోల్స్‌ స్క్రీన్‌లో ఉండటం వల్ల డ్రైవింగ్‌ సమయంలో రోడ్డుపై నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది

టచ్‌ ఆధారిత కంట్రోల్స్‌ కొన్నిసార్లు సరిగ్గా స్పందించవు

విండో స్విచ్‌లు పనిచేసే విధానం కొంతమందికి కన్‌ఫ్యూజ్‌గా అనిపించవచ్చు

ఫైనల్‌గా చెప్పాలంటే, Mahindra XUV 7XO శక్తిమంతమైన ఇంజిన్‌లు, సూపర్‌ రైడ్‌ క్వాలిటీ, టాప్‌ క్లాస్‌ ఫీచర్లతో ఒక ప్రీమియం SUVగా నిలుస్తుంది. అయితే, మూడో వరుస అవసరం ఎక్కువగా ఉన్న కుటుంబాలు మాత్రం ఒకసారి ఆలోచించాలి. స్టైల్‌, టెక్‌, డ్రైవింగ్‌ అనుభవం మీ ప్రాధాన్యతలు అయితే XUV 7XO మీరు తప్పకుండా చూడాల్సిన SUV.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.