Mahindra XUV700 Facelift - Mahindra XUV 7XO: మహీంద్రా & మహీంద్రా, ఎట్టకేలకు, XUV700 ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన సస్పెన్స్‌కు తెర దించింది. ఈ మోడల్‌కు XUV 7XO అనే కొత్త పేరు పెట్టినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే, 2026 జనవరి 5న ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ICE SUV గ్రాండ్‌గా డెబ్యూ అవుతుంది. ఇప్పటికే XUV3XOతో ప్రారంభించిన కొత్త నేమింగ్ ట్రెండ్‌లో ఇది రెండో భారీ మోడల్. ఈసారి మహీంద్రా డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో స్పష్టమైన అప్‌గ్రేడ్స్ ఇచ్చినట్టు టీజర్లు చెబుతున్నాయి.
కొత్త డిజైన్‌లో షార్ప్ అప్‌డేట్‌లుమహీంద్రా విడుదల చేసిన మొదటి టీజర్‌లో... 7-ఆకారంలో ఉండే షార్ప్ DRLs, ట్రపీజాయిడ్ LED హెడ్‌ల్యాంప్స్, కొత్త స్లాటెడ్ గ్రిల్ లుక్ చూపించారు. ఇవి మొత్తం చూస్తే XEV 9S మోడల్ స్పూర్తితో రూపొందించినట్టు అనిపించినా, XUV 7XOకి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చేలా కనిపిస్తాయి.
తాజా స్పై షాట్స్ ప్రకారం, బాడీ షీట్ మెటల్‌లో పెద్ద మార్పులు లేవు. అంటే, ఇప్పటికే ప్రజాదరణ పొందిన XUV700 సిల్హౌట్‌ని అలాగే కొనసాగిస్తున్నారు. కానీ ఫ్రంట్, రియర్ లైటింగ్ ఎలిమెంట్స్‌లో మాత్రం పూర్తిగా కొత్త స్టైల్ కనిపిస్తుంది.
క్యాబిన్‌లో మూడు స్క్రీన్ల హై-టెక్ సెటప్‌ఇంటీరియర్ విషయంలో మహీంద్రా గట్టి మార్పులు చేసినట్టు ఆటో రంగంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా XEV 9e, 9S మోడల్స్‌లో ఉన్న ట్రిపుల్ స్క్రీన్ సెట్‌అప్ XUV 7XOలో కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్ డిస్‌ప్లే, సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్, కో-డ్రైవర్ స్క్రీన్‌లతో అత్యాధునిక డిజిటల్ అనుభవం ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టుంది.
సీటింగ్ లేఅవుట్‌లో 6-సీటర్ & 7-సీటర్ ఆప్షన్‌లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 5-సీటర్ వచ్చే అవకాశంపై మాత్రం క్లారిటీ లేదు.
ఇంజిన్ ఆప్షన్‌ల్లో మార్పులు లేవుమార్కెట్‌కు బాగా పరిచయమైన 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లు ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా కొనసాగుతాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అలాగే ఉంటాయి. డీజిల్ వేరియంట్‌లో AWD ఆప్షన్ కూడా XUV700లాగే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ పవర్‌ట్రైన్లు పనితీరు, శక్తిమంతమైన రెస్పాన్స్, కంఫర్ట్ విషయంలో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నాయి కాబట్టి, మహీంద్రా ఇక్కడ పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు.
ఎంత ఉండొచ్చు ధర - AP & TG కొనుగోలుదారులకు కీలక సమాచారంప్రస్తుతం XUV700 ధరలు ₹13.66 లక్షల నుంచి ₹23.71 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). XUV 7XO మరికొంత ఎక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఈ బండికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో డిమాండ్ భారీగా ఉన్నందున, ప్రారంభ ధరలే చర్చకు వస్తాయి. ప్రత్యేకంగా 7-సీటర్ కుటుంబ SUV సెగ్మెంట్‌లో ఇది Tata Safari, MG Hector, Hyundai Alcazar వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది.
XUV700 ఇప్పటికే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించగా... దానికి టెక్, డిజైన్, ప్రీమియం ఫీల్ అప్‌డేట్‌లు జోడించి XUV 7XOగా తీసుకురావడం మహీంద్రా వేస్తున్న పెద్ద అడుగు. ఇప్పుడు అందరి చూపు జనవరి 5 లాంచ్‌పైనే ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అద్భుతమైన SUV కొనాలనుకునే వారికి ఇది ఒక బలమైన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.