Mahindra XUV 3XO vs Tata Nexon: భారత్‌లో సబ్‌ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి యువత వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ విభాగంోల మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్ అగ్రగామిగా నిలుస్తున్నాయి. మహీంద్రా తన పాత మోడ్‌ XUV 3OOను సరికొత్త హంగులతో మహీంద్రా XUV 3XOగా రీబ్రాండ్ చేసి మార్కెట్‌లోకి తెచ్చింది. మరవైపు టాటా నెక్సాన్ తన అప్‌డేటెడ్ వెర్షన్‌తో ఇప్పికే మార్కెట్‌లో బలమైన పట్టు సాధించింది. 

Continues below advertisement

ధర, వేరియంట్లు 

ఏ కారు కొనాలన్నా వినియోగదారులు మ౧దట చూసేది ధర. టాటా నెక్సాన్ స్మార్ట్ పెట్రోల్‌ 1.2L టర్బో వేరియంట్‌ ప్రారంభ ధర 7.37 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ధర పరంగా చూస్తే టాటా నెక్సాన్‌ స్వల్పంగా తక్కువ ధరకు లభిస్తోంది. ఇది బడ్జెట్ వినియోగదారులకు సానుకూల అంశం. 

ఇంజన్ సామర్థ్యం, పని తీరు 

కారు ఇంజన్ గుండెకాయ లాంటిది. XUV 3X౦లో 1197cc, 3 సిలిండర్‌ టర్బో చార్జ్డ్‌ ఇంజిన్ ఉంది. ఇది 110bhp పవర్, 200Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి భిన్నంగా టాటా నెక్సాన్ 1199సిసి ఇంజిన్‌తో 118bhp పవర్, 170Nm టార్క్‌ను అందిస్తుంది. 

Continues below advertisement

నెక్సాన్(118bhp) మహీంద్రా XUV 3XO(110bhp)కంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది. మహీంద్రా XUV 3XO(200Nm)నెక్సాన్(170Nm) కంటే మెరుగైన ఫుల్ పవర్‌ను కలిగి ఉంది. ఇది హైవే డ్రైవింగ్‌లో ఉపయోగపడుతుంది. మహీంద్రా XUV 3XO సిక్స్‌ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.  భారతీయ వియోగదారులకు మైలేజీ అత్యంత ముఖ్యం. మహీంద్రా మహీంద్రా XUV 3XO లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. వినియోగదారులు కూడా సుమారు 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. టాటా నెక్సాన్ వినియోగదారుల నివేదికల ప్రకారం సుమారు 17కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. ఇంధన సామర్థ్యం విషయంలో XUV 3XO స్వల్పంగా ముందంజలో ఉంది. 

భద్రత విషయంలో ఈ రెండు కంపెనీలు ఎక్కడా రాజీ పడలేదు. మహీంద్రా XUV 3XO, టాటా నెక్సా్ రెండూ భారత్ Nక్యాప్ పరీక్షల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి. 

రెండు కార్లలోనూ డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్,సైడ్ ఎయిర్ బ్యాగ్‌లు ప్రామాణికంగా వస్తున్నాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. XUV 3XO నాలుగు చక్రాలకు డి్క్ బ్రేక్‌లను అందిస్తోంది. కానీ టాటా నెక్సాన్‌ ముందు చక్రాలకు డిస్క్, వెనుక చక్రాల డ్రమ్ బ్రేక్‌ను మాత్రమే కలిగి ఉంది. 

ప్రయాణికుల సౌకర్యం విషయంలో కారు వెడల్పు, వీల్‌బేస్ కీలక పాత్ర పోషిస్తాయి. మహీంద్రా XUV 3XO 2600mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది లోపల ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. నెక్సాన్‌ వీల్‌బేస్‌ 2498mm మాత్రమే. రోడ్లపై గుంతలను అధిగమించడానికి గ్రౌండ్ క్లియరెన్స్ ముఖ్యం. నెక్సాన్ 208mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో మెరుగ్గా ఉంది. మహీంద్రా XUV 3XO 201mm కలిగి ఉంది. లగేజీ పెట్టుకోవడానికి నెక్సాన్(382) మెరుగైన స్థలాన్ని ఇస్తోంది. XUV 3X౦లో ఇది 364 లీటర్లు మాత్రమే. 

ఆధునిక కాలంలో ఫీచర్లు లేకుండా కారు అమ్మడం అసాధ్యం. టాటా నెక్సాన్ LED హెడ్ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను కలిగి ఉండగా మహీంద్రా XUV 3XO MX1 వేరియంట్‌ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్‌ను ఉపయోగిస్తోంది. మహీంద్రా XUV 3XOలో వెనుక సీటు ప్రయాణికుల కోసం కూడా ఏసీ వెంట్్ ఉన్నాయి. ఇది నెక్సాన్ ప్రాథమిక వేరియంట్‌లో కనిపించదు. మహీంద్రా XUV 3XO డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. నెక్సాన్ ఆఫ్‌ వైట్, గ్రే కాంబినేషన్‌తో వస్తుంది.